search
×

NBFC Deposits: 12% వడ్డీ ఇస్తున్న ఎన్‌బీఎఫ్‌సీలు! నకిలీవో మంచివో తెలుసుకొనేదెలా?

How to identify fake NBFC: డిపాజిట్ల పైన 12 శాతం వడ్డీ ఇస్తామని, ఆరేళ్లలో డబ్బులు రెట్టింపు అవుతాయని ఆఫర్లు ఇస్తుంటే ఎవరైనా టెంప్ట్‌ అవుతారు! మరి ఆ కంపెనీ మంచిదో కాదో తెలుసుకొనేందుకు ఆర్బీఐ కొన్ని జాగ్రత్తలు చెప్పింది.

FOLLOW US: 
Share:

How do you know whether an NBFC accepting deposits is genuine or not: డిపాజిట్ల పైన 12 శాతం వడ్డీ ఇస్తామని, ఆరేళ్లలో డబ్బులు రెట్టింపు అవుతాయని ఆఫర్లు ఇస్తుంటే ఎవరైనా టెంప్ట్‌ అవుతారు! సాధారణంగా బ్యాంకులు ఇంత వడ్డీని ఆఫర్‌ చేయవు. ఇతర ఫైనాన్షియల్‌ కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రమే ఇలాంటి ఆఫర్లు ఇస్తాయి. అలాగని ఎందులో పడితే అందులో డబ్బులు డిపాజిట్‌ చేస్తే తర్వాత నష్టపోయే ప్రమాదం ఉంది. మోసపూరిత ఆర్థిక సంస్థల వలలో పడకుండా ఉండేందుకు ఆర్బీఐ కొన్ని జాగ్రత్తలు చెప్పింది.

కొన్ని రోజులు క్రితమే రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 'BE(A)WARE' అనే హ్యాండ్‌బుక్‌ను రిలీజ్‌ చేసింది. ఆర్థిక లావాదేవీలు చేపట్టేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందులో వివరించింది. నకిలీ ఎన్‌బీఎఫ్‌సీలను ఎలా గుర్తించాలో వివరించింది. చాలా వరకు నకిలీ ఎన్‌బీఎఫ్‌సీలు భారీగా వడ్డీని ఆఫర్‌ చేస్తూ కస్టమర్లను మోసం చేస్తుంటాయి. దాంతో ఇలాంటి మోసం కేసులు బాగా పెరుగుతున్నాయి. ఏదైనా ఎన్‌బీఎఫ్‌సీ డిపాజిట్లను సేకరిస్తే మొదట చేయాల్సింది ఆ కంపెనీకి డిపాజిట్లు సేకరించే అర్హత, అనుమతి ఉన్నాయో లేదో ఆర్బీఐలో చెక్‌ చేసుకోవాలి. ఇందుకోసం https://rbi.org.inలో లాగిన్‌ అవ్వొచ్చు.

  • రిజర్వు బ్యాంకు ఇచ్చిన సర్టిఫికెట్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ను ప్రతి ఎన్‌బీఎఫ్‌సీ తమ శాఖలో ప్రదర్శించాలి. తమకు డిపాజిట్లు సేకరించేందుకు ఆర్‌బీఐ అనుమతి ఉందో లేదో చూపించాలి. ఆ సర్టిఫికెట్‌ను కస్టమర్లు క్షుణ్ణంగా తనిఖీ చేయాలి.
  • ఎన్‌బీఎఫ్‌సీలు 12 నెలల కన్నా తక్కువ సమయానికి డిపాజిట్లు సేకరించేందుకు వీల్లేదు. అలాగే 60 నెలలకు మించి తీసుకొనేందుకు వీల్లేదు. ఎన్‌బీఎఫ్‌సీలు 12.5 శాతానికి మించి వడ్డీని చెల్లించేందుకు అనుమతి లేదు.
  • కస్టమర్లు డిపాజిట్‌ చేసినప్పుడు ప్రతి డిపాజిట్‌కు ప్రాపర్‌గా ఉన్న రసీదును ఎన్‌బీఎఫ్‌సీ నుంచి తీసుకోవాలి.
  • కంపెనీ అధీకృతంగా నియమించిన అధికారి సంతకం ఆ రసీదుపై ఉండాలి. డిపాజిట్‌ చేసిన తేదీ, డిపాజిట్‌దారు పేరు, జమ చేసిన డబ్బుల మొత్తం, చెల్లించాల్సి వడ్డీ, మెచ్యూరిటీ తేదీ, మొత్తం వివరాలు ఉండాలి.
  • ఎన్‌బీఎఫ్‌సీ తరఫున డిపాజిట్లు సేకరించే బ్రోకర్లు, ఏజెంట్లు, ఇతర వ్యక్తులు కంపెనీ అదే పర్పస్‌కు ఉద్దేశించిన వారై ఉండాలి.
  • ఎన్‌బీఎఫ్‌సీ డిపాజిటర్లకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండదని కస్టమర్లు తెలుసుకోవాలి.
  • ఎన్‌బీఎఫ్‌సీలో డిపాజిట్లు చేయడం సురక్షితం కాదని తెలుసుకోవాలి. వీరికి బీమా సదుపాయం వర్తించదు.

Published at : 19 Mar 2022 08:22 PM (IST) Tags: rbi fixed deposits personal finance NBFC Financial Transactions NBFC Depositors

ఇవి కూడా చూడండి

Latest Gold-Silver Prices Today: రూ.72,000 నుంచి కిందకు దిగని పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today: రూ.72,000 నుంచి కిందకు దిగని పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Personal Loan: ఈ టెక్నిక్ తెలిస్తే వెంటనే పర్సనల్ లోన్స్ తీసుకోవటం ఆపేస్తారు..! తక్కువ వడ్డీకే రుణం..

Personal Loan: ఈ టెక్నిక్ తెలిస్తే వెంటనే పర్సనల్ లోన్స్ తీసుకోవటం ఆపేస్తారు..! తక్కువ వడ్డీకే రుణం..

Gold-Silver Prices Today: పసిడి కొనాలంటే పర్స్‌ ఖాళీ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: పసిడి కొనాలంటే పర్స్‌ ఖాళీ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Tax-Free Incomes: ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌ - ITR ఫైల్ చేసే ముందు అప్‌డేట్స్‌ చూసుకోండి

Tax-Free Incomes: ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌ - ITR ఫైల్ చేసే ముందు అప్‌డేట్స్‌ చూసుకోండి

Schemes For Women: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్‌ చేస్తే లాభాల పంట!

Schemes For Women: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్‌ చేస్తే లాభాల పంట!

టాప్ స్టోరీస్

NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?

NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం

India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర

India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర

Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు

Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు