Patanjali: ఆవు నెయ్యి నాణ్యతపై కోర్టు తీర్పు తప్పు- ట్రిబ్యూనల్‌లో అప్పీల్ చేయనున్న పతంజలి
Patanjali Cow Ghee : పతంజలి తన ఆవు పాలు , నెయ్యి నాణ్యతలపై వచ్చిన సందేహాలకు వివరణ జారీ చేసింది. ఉత్పత్తులు కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, ప్రయోగశాల పరీక్ష తప్పు అని పేర్కొంది.

Patanjali: పతంజలి ఆవు పాలు, ఆవు నెయ్యి గురించి ఓ లేబోరేటరీ సందేహాలు లేవనెత్తిన అంశంపై యోగా గురు బాబా రాందేవ్ కంపెనీ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ అధికారిక వివరణ విడుదల చేసింది. కఠినమైన ప్రమాణాలు , ప్రయోగశాల తనిఖీల తర్వాతే కంపెనీ ఆవు పాలు , నెయ్యిని విక్రయిస్తుందని పతంజలి పేర్కొంది. ఆహార భద్రతా చట్టం కింద తీసుకున్న పతంజలి ఆవు నెయ్యి నమూనాకు సంబంధించి దాఖలు చేసిన కేసు , దానికి సంబంధించి కోర్టు జారీ చేసిన ఉత్తర్వు తప్పు , చట్ట విరుద్ధం అని కంపెనీ పేర్కొంది.
“ఆవు నెయ్యిని పరీక్షించిన రిఫెరల్ లాబొరేటరీకి NABL గుర్తింపు ఇవ్వలేదు, అందువల్ల, అక్కడ చేసిన పరీక్ష చట్టబద్ధంగా ఆమోదయోగ్యం కాదు. ఒక ప్రామాణికం కాని ల్యాబ్ పతంజలి ఉత్తమ ఆవు నెయ్యి ప్రామాణికం కాదని పేర్కొనడం హాస్యాస్పదం , చాలా అభ్యంతరకరమైనది.” అని పతంజలి స్పష్టం చేసింది. " టెస్టు సమయంలో నమూనా విఫలమైనట్లు ప్రకటించిన పారామీటర్స్ కూడా వర్తించవు; కాబట్టి, వాటిని ఉపయోగించడం చట్టపరంగా తప్పు" అని కంపెనీ పేర్కొంది.
పతంజలి ఆహార భద్రత ట్రిబ్యునల్‌లో అప్పీల్
"గడువు తేదీ తర్వాత నమూనాను తిరిగి పరీక్షించడం జరిగింది, ఇది చట్టం ప్రకారం చెల్లదు. ఈ ముఖ్యమైన వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా కోర్టు ప్రతికూల ఉత్తర్వు జారీ చేసింది, ఇది చట్టం దృష్టిలో సరైనది కాదు. ఈ ఉత్తర్వుపై అప్పీల్ ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్‌లో దాఖలు చేస్తాం. మా కేసులో మాకు బలమైన ఆధారాలు ఉన్నాయి.. ట్రిబ్యునల్ ఈ విషయాన్ని గుర్తించి మాకు అనుకూలంగా నిర్ణయిస్తుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము." అని పతంజలి తెలిపింది.
"ఈ తీర్పులో, పతంజలి ఆవు నెయ్యిని ఎక్కడా వినియోగానికి హానికరం అని పేర్కొనలేదు. నెయ్యిలో RM విలువలో ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన దానిలో స్వల్ప వ్యత్యాసం ఉందని మాత్రమే పేర్కొన్నారు. RM విలువ అస్థిర కొవ్వు ఆమ్లం స్థాయిని సూచిస్తుంది. నెయ్యి వేడి చేసినప్పుడు ఇది ఆవిరైపోతుంది . ఇది సహజ ప్రక్రియ. ఇది నెయ్యి నాణ్యతను ప్రభావితం చేయదు. మానవ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలలో నామమాత్రపు వ్యత్యాసం సహజమైనది." అని పతంజలి తెలిపింది.
కఠినమైన ప్రమాణాలు , పరీక్షల ఆధారంగా ఉత్పత్తుల విక్రయం
“జంతువుల ఆహారం , వాతావరణం ఆధారంగా RM విలువ ప్రమాణం ప్రాంతీయంగా మారుతుంది. ప్రభుత్వ నియంత్రణ సంస్థ FSSAI కూడా ఈ RM విలువను మారుస్తూనే ఉంది. కొన్నిసార్లు ప్రాంతాల వారీగా వేర్వేరు RM విలువ కోసం ఒక నిబంధన చేస్తారు. కొన్నిసార్లు ఒకే జాతీయ RM విలువ నిర్ణయిస్తారు. పతంజలి కఠినమైన ప్రమాణాలు, పరీక్షల ఆధారంగా దేశవ్యాప్తంగా పాలు, ఆవు నెయ్యిని సేకరించి జాతీయ స్థాయిలో విక్రయిస్తుంది.” అని పతంజలి తెలిపింది.





















