Mukesh Ambani: ముఖేష్ అంబాని మరో ఘనత.. త్వరలో వంద బిలియన్ డాలర్ల క్లబ్ లో..
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో అరుదైన ఘనత దక్కించుకోనున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో టాప్‌లో ఉన్న ముకేష్ అంబానీ..సంపాదనలో వంద బిలియన్ డాలర్లకు చేరువలో ఉన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరో రికార్డు సాధించనున్నారు. ముఖేష్ సంపాదన వంద బిలియన్ డాలర్లకు చేరుకోబోతంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం 92.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచ ధనికుల జాబితాలో ముఖేష్ 12వ స్థానంలో ఉన్నారు. మరోవైపు రిలయన్స్ స్టాక్ షేర్లు కూడా ఈ వారంలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. బోంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 4.12 శాతం పైకి ఎగసి..2 వేల 388 రూపాయల వద్ద ముగిసింది.
వంద బిలియన్ డాలర్ల సంపద కలిగిన వారి క్లబ్‌లో చేరేందుకు ముఖేష్ రెడీ అవుతున్నారు. ఫ్రెంచ్ ఫ్యాషన్ కంపెనీ ‘లో ఓరియల్స్’ చీఫ్ ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మీయర్ సంపద 92.9 బిలియన్ డాలర్లు కాగా, అంబానీ ఆయనకు దగ్గరగా వచ్చారు. వీళ్లిద్దరూ త్వరలోనే 100 బిలియన్ డాలర్ల వెల్త్ క్లబ్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంబానీ ఈ సంవత్సరం క్లీన్ ఎనర్జీవైపు ఫోకస్ చేశారు. 2030 నాటికి కనీసం 100 గిగావాట్ల రిన్యూవల్ ఎనర్జీ తయారు చేయడానికి 10 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఫలితంగా రిలయన్స్ షేర్లు పెరిగాయి. అంబానీ ఆస్తి శుక్రవారం మరో 3.7 బిలియన్ డాలర్లు పెరిగింది.
Also Read:
Petrol-Diesel Price, 8 September 2021: ఇవాళ్టీ పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
Gold-Silver Price Today: మగువలకు గుడ్ న్యూస్…స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా...
అంబానీ టెలికం కంపెనీ జియో, రిటైల్ వెంచర్ కూడా దూసుకెళుతున్నాయి. ఇండియా టెలికం మార్కెట్ లీడర్‌గానూ నిలిచింది. ఇందులో ఫేస్‌బుక్, గూగుల్ వంటి ఎన్నో కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి. అంతేగాక సౌదీ ఆరామ్ కో డీల్ పూర్తయితే అంబానీ చేతికి 25 బిలియన్ డాలర్లు వస్తాయి.
లోకల్ సెర్చి ఇంజిన్ జస్ట్ డయల్‌లో రిలయన్స్ రిటైల్ 40.95% వాటాలు కొనుగోలు చేసింది. ఇక జియో ఇన్ఫోకామ్ అతి తక్కువ రేట్లకు ఇంటర్నెట్ అందిస్తూ ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తుంది. ప్రస్తుతం జియో భారతదేశంలో అతిపెద్ద వైర్ లెస్ సర్వీస్ ప్రొవైడర్ గా ఉంది. 2021, జూన్ చివరి నాటికి 43.66 కోట్ల మంది చందాదారులను కలిగి ఉంది.
Also Read: Bit coin: తొలిసారి ఓ దేశ అధికారిక కరెన్సీగా బిట్ కాయిన్
Also Read: WhatsApp: వాట్సాప్ మేసేజ్‌లను ఫేస్‌బుక్ చదివేస్తుందట!