(Source: Poll of Polls)
Anant-Radhika: కోడలిపై కోట్ల విలువైన ప్రేమ - బెంట్లీ కార్, డైమండ్ నెక్లెస్, ఇంకా ఎన్నో!
Ambani Daughter in Law: ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి అంటే మామూలుగా ఉండదు. ఆయన చిన్న కొడుకు వివాహం సందర్భంగా కోడలికి అతి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చారు.
Anant Ambani-Radhika Merchant Wedding: దేశంలోనే అత్యంత సంపన్నుడైన వ్యాపారవేత్త ముకేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో భాగంగా ప్రి-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు (Pre Wedding Celebrations) ముహూర్తం దగ్గర పడింది. మార్చి 1, 2, 3 తేదీల్లో, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్ కాంప్లెక్స్‌లో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ (Anant Ambani-Radhika Merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించనున్నారు. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిపై దేశంలో పెద్ద చర్చే జరుగుతోంది.
అంబానీ కుటుంబానికి కాబోయే కోడలు రాధిక మర్చంట్‌కు, ప్రి-వెడ్డింగ్ వేడుకలకు ముందే, అంబానీ కుటుంబం నుంచి అతి ఖరీదైన బహుమతులు అందాయి. వాటి విలువ లక్షల్లో కాదు, కోట్ల రూపాయల్లో ఉంది. రాధిక మర్చంట్, కాబోయే అత్తమామలు ముకేష్-నీతా అంబానీ నుంచి రూ.4.5 కోట్ల విలువైన కారును గిఫ్ట్‌గా అందుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, కాబోయే అత్త నీతా అంబానీ నుంచి ఒక వెలకట్టలేని డైమండ్ చోకర్‌ను (నెక్లెస్ లాంటిది) రాధిక మర్చంట్ అందుకున్నారు. లక్ష్మీ-గణపతి గిఫ్ట్ హ్యాంపర్‌ను కూడా నీతా అంబానీ ఇచ్చారు. అందులో వెండి తులసి కుండతో పాటు లక్ష్మీదేవి, గణపతుల విగ్రహాలు ఉన్నాయి. ఒక సిల్వర్ స్టాండ్ కూడా ఉంది.
బహుమతిగా బెంట్లీ కాంటినెంటల్ GTC స్పీడ్ (Bentley Continental GTC Speed)
అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌కు ఒక అందమైన బెంట్లీ కాంటినెంటల్ GTC స్పీడ్‌ను, తన వంతు గిఫ్ట్‌గా ముకేశ్ అంబానీ అందించారు. దేశంలోని అతి కొద్దిమంది సెలబ్రిటీల గ్యారేజ్‌లో మాత్రమే ఈ కారు ఉంది. ఈ కార్ ఉన్న వాళ్ల లిస్ట్‌లో.. విరాట్ కోహ్లి, అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్ వంటి ప్రముఖుల పేర్లు మాత్రమే ఉన్నాయి. బెంట్లీ కాంటినెంటల్ GTC స్పీడ్ ఒక బ్రిటిష్ మేడ్ వెహికల్. దాని ధర 4.5 కోట్ల రూపాయలు.
వేడుకలకు హాజరుకానున్న రాజులు, ప్రధానులు, సీఈవోలు
వచ్చే నెల ప్రారంభంలో, జామ్‌నగర్‌లో జరగనున్న ప్రి-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు అంతర్జాతీయ ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మెటా CEO మార్క్ జుకర్ బర్గ్, అడోబ్ CEO శంతను నారాయణ్, బ్లాక్‌రాక్ CEO ల్యారీ పింక్, బ్లాక్‌స్టోన్ ఛైర్మన్ స్టీఫెన్ స్క్వార్జ్‌మ్యాన్, డిస్నీ CEO బాబ్ ఐగర్, ఇవాంకా ట్రంప్, ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్‌థాని, టాన్ రాజ దంపతులు, కెనడా, స్వీడన్, ఆస్ట్రేలియా, బొలీవియా దేశాల మాజీ ప్రధానులు హాజరుకానున్నారు. ఇంకా.. మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బెర్క్‌షైర్ హాథ్‌వే వంటి గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు కూడా తరలిరానున్నారు.
అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ నిశ్చితార్థం 2022 డిసెంబర్‌లో జరిగింది. ఈ ఏడాది జులైలో వివాహం జరుగుతుంది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవే