By: ABP Desam | Updated at : 06 Jun 2023 01:30 PM (IST)
మాన్‌సూన్ ముందు కొనాల్సిన మంచి స్టాక్స్
Monsoon Stocks To Buy: భారత వాతావరణ శాఖ (IMD) ఈ ఏడాది సాధారణ రుతుపవనాలు ఉంటాయని అంచనా వేసింది. వ్యవసాయ రంగానికి ఇది మంచిదని, గ్రామీణ ప్రాంతాల్లో వస్తు డిమాండ్‌ను పెంచుతుందని మోతీలాల్ ఓస్వాల్‌లోని ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు. గ్రామీణ మార్కెట్‌లో డిమాండ్ పెరిగితే చాలా రంగాలపై అది పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది.
టెక్నికల్ అనాలిసిస్ ఆధారంగా, వ్యవసాయ రసాయనాలు (agrochemicals), ఎరువులు (fertilizers), గ్రామీణ వినియోగం (rural consumption) రంగాల నుంచి 5 స్టాక్స్‌ను మోతీలాల్ ఓస్వాల్ ఎక్స్‌పర్ట్‌లు ఎంచుకున్నారు. రుతుపవనాల (Monsoon) రాక ముందే వీటిని కొనుగోలు చేయమని సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా మంచి వర్షాలు పడి వ్యవసాయ రంగం పచ్చగా కళకళలాడితే, ఈ 5 స్టాక్స్ లాభసాటి బేరంగా మారతాయని అంచనా వేశారు
మాన్‌సూన్ ముందు కొనాల్సిన 5 స్టాక్స్:
ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 171
ఈ స్టాక్, ప్రస్తుతం 20-వీక్ యావరేజ్ ప్రైస్ దగ్గర ట్రేడవుతోంది. అంతేకాదు, డైలీ స్కేల్‌లో 100 EMA వద్ద సపోర్ట్ తీసుకుంది, హయ్యర్ లెవెల్స్‌కు వెళ్లేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) ఈ కౌంటర్ దాదాపు 9.3 శాతం తగ్గింది.
మహీంద్ర అండ్ మహీంద్ర ఫైనాన్షియల్ | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 300
డైలీ ఛార్ట్‌లో ఈ స్టాక్ "పోల్ అండ్ ఫ్లాగ్" (pole and flag) ప్యాట్రెన్‌తో కదులుతోంది. టెక్నికల్‌గా దీనిని సానుకూలంగా చూడాలి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ స్క్రిప్ 24 శాతం లాభపడింది.
టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 792
వీక్లీ ఛార్ట్‌లో బ్రేక్-ఔట్ జోన్‌ను మళ్లీ పరీక్షించింది, ఫ్రెష్‌గా హయ్యర్ లెవెల్స్ వైపు మూవ్ అవుతోంది. ఇది బుల్స్ బలాన్ని సూచిస్తోంది. ఈ కంపెనీ షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 4 శాతం రాబడిని అందించాయి.
కోరమాండల్ ఇంటర్నేషనల్ | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. రూ 958
ఈ స్టాక్ 20-నెలల సగటు వద్ద సపోర్ట్ తీసుకుంది. ప్రస్తుతం, డైలీ ఛార్ట్ ప్రకారం, ఈ యావరేజ్ కంటే కొంచెం పైనే ట్రేడ్ అవుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ కౌంటర్ 6.75 శాతం లాభపడింది.
బాటా ఇండియా | ప్రస్తుత మార్కెట్ ధర: రూ. రూ. 1,577
ఈ స్టాక్ లోయర్ జోన్‌లో ఒక స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసింది, గత 3 నెలలుగా "హయ్యర్ హైస్" ప్యాట్రెన్‌లో కదులుతోంది. ఇది పాజిటివ్ ట్రెండ్ సిగ్నల్. ఈ కంపెనీ షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1.23 శాతం లాభపడ్డాయి.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: F&O ఎక్స్‌పైరీపై కీలక అప్‌డేట్, ఈ మార్పు తెలీకపోతే నష్టపోతారు!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Cryptocurrency Prices : బిట్‌కాయిన్ @ రూ.22.96 లక్షలు! ఎరుపెక్కిన క్రిప్టో మార్కెట్
Stock Market Today: కొనసాగిన నష్టాలు! 19,550 కిందకు నిఫ్టీ!
FD Rates: రెండు స్పెషల్ స్కీమ్స్‌ను క్లోజ్ చేసిన HDFC బ్యాంక్, FDలపై కొత్త వడ్డీ రేట్లు ఇవే
Stock Market Today: నెగెటివ్ సెంటిమెంటు నింపిన ముడి చమురు! నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
Investment Tips: 30-40 ఏళ్ల వయస్సులో పాటించాల్సిన బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటెజీ, మీ టార్గెట్ మిస్ కాదు!
Lokesh No Arrest : లోకేష్‌కు అరెస్టు ముప్పు తప్పినట్లే - అన్ని కేసుల్లో అసలేం జరిగిందంటే ?
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
మళ్ళీ కలవబోతున్న చైతూ, సమంత - ఇదిగో ప్రూఫ్!
Chandramukhi 2: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
/body>