అన్వేషించండి

Income Tax: ఈ క్రెడిట్ కార్డులతో ఇన్కమ్ టాక్స్ చెల్లిస్తే రివార్డ్స్, పూర్తి వివరాలు

Business News: చాలా మంది ప్రస్తుతం ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. వారు కొన్ని క్రెడిట్ కార్డులను వినియోగించటం వల్ల రివార్డ్ పాయింట్ల రూపంలో ప్రయోజనాలను అందుకోవచ్చు.

Credit Crads: మనలో చాలా మంది ప్రస్తుతం ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే చాలా మందికి పన్ను మెుత్తాన్ని చెల్లించటం భారంగా ఉంటుంది. కొన్ని సార్లు టాక్స్ చెల్లింపుల సమయంలో అవసరమైన నగదు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.

ఇలాంటి పరిస్థఇతుల్లో చాలా మంది తమ క్రెడిట్ కార్డులను ఇన్కమ్ టాక్స్ చెల్లింపులు చేసేందుకు వినియోగిస్తుంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కొన్ని ప్రత్యేక కార్డులను పన్ను చెల్లింపులకు వినియోగించటం ద్వారా వినియోగదారులు ఆకర్షణీయమైన రివార్డ్ పాయింట్‌లను అందుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఏ క్రెడిట్ కార్డ్‌లు ఆదాయపు పన్ను చెల్లింపుపై రివార్డ్ పాయింట్‌లను అందిస్తాయో తెలుసుకుందాం..

దేశంలో కొన్ని క్రెడిట్ కార్డ్‌లు మాత్రమే దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం హెచ్‌డిఎఫ్‌సి బిజ్‌బ్లాక్, హెచ్‌డిఎఫ్‌సి బిజ్‌పవర్ క్రెడిట్ కార్డ్‌లు వంటి కొన్ని సెలక్టెడ్ కార్డులు మాత్రమే పన్ను చెల్లింపులకు రివార్డ్‌లను అందిస్తున్నాయి. ఈ కార్డ్‌లు పన్ను చెల్లింపుదారులకు గరిష్టంగా 16% పొదుపును  అందిస్తున్నాయి. అలాగే జీఎస్టీ చెల్లింపులపై ఏకంగా 8 శాతం వరకు టాక్స్ పేయర్స్ ఆదాచేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ కార్డులకు తోడు ఎస్‌బీఐ విస్తారా కార్డ్, ఐడిఎఫ్‌సి విస్తారా కార్డ్ వంటివి సైతం ఆదాయపు పన్ను చెల్లింపుపై మైలురాయి ప్రయోజనాలను అందిస్తున్నాయి. మీరు భాగస్వామ్య ఆఫర్‌లను స్వీకరించినప్పుడు మాత్రమే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బిజ్‌బ్లాక్ క్రెడిట్ కార్డ్‌లోని సేవింగ్స్ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది.

రివార్డ్ రేటు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ఈ పొదుపులు రివార్డ్ పాయింట్ల రూపంలో మాత్రమే కార్డుదారులకు ఇవ్వబడతాయని గుర్తుంచుకోవాలి. నేరుగా క్యాష్ తగ్గింపు రూపంలో రావు. సదరు రివార్డ్ పాయింట్లను కార్డు హోల్డర్లు తర్వాత రిడీమ్ చేసుకోవచ్చు. తాజ్ హోటల్, లాంజ్ యాక్సెస్, మారియట్ హోటల్‌ వంటి బ్రాండ్ భాగస్వాముల వద్ద తమ రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేసుకోవచ్చు. వాస్తవానికి అధిక ఆదాయ వర్గాలకు చెందిన వ్యక్తులు మాత్రమే ఇలాంటి కార్డులను తీసుకుంటుంటారు. అయితే వీటిపై వార్షిక ప్రయోజనాలు లక్షల వరకు ఉంటాయి. అయితే కార్డులను కలిగిన వ్యక్తులు తమ పన్ను చెల్లింపులను చేసేందుకు ఐటీఆర్ పోర్టల్‌లో క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆప్షన్ ద్వారా తమ పన్ను బాధ్యతను పూర్తి చేయాల్సి ఉంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : నేను హోంమంత్రినైతే పరిస్థితి వేరేలా ఉంటుంది -  పిఠాపురంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
నేను హోంమంత్రినైతే పరిస్థితి వేరేలా ఉంటుంది - పిఠాపురంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
KTR Letter: తెలంగాణ సమాజాన్ని మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పండి- రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
తెలంగాణ సమాజాన్ని మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పండి- రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
Andhra Assembly Sessions : 11 కలిసొచ్చేలా అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు  - వైసీపీని ట్రోల్ చేస్తున్నారా ?
11 కలిసొచ్చేలా అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు - వైసీపీని ట్రోల్ చేస్తున్నారా ?
5G Smartphones Under Rs 10000: రూ.10 వేలలో 5జీ ఫోన్ కావాలనుకుంటున్నారా? - అయితే ఈ లిస్టుపై ఓ లుక్కేయండి!
రూ.10 వేలలో 5జీ ఫోన్ కావాలనుకుంటున్నారా? - అయితే ఈ లిస్టుపై ఓ లుక్కేయండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాంతార లాంటి కల్చర్, ఆదివాసీ దండారీ వేడుకలు చూద్దామా!జలపాతంలో కలెక్టర్, సామాన్యుడిలా ఎంజాయ్!ఎందుకయ్యా నీకు రాజకీయాలు, మంత్రి వాసంశెట్టికి క్లాస్ పీకిన చంద్రబాబుRohit Sharma Virat Kohli Failures |  హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : నేను హోంమంత్రినైతే పరిస్థితి వేరేలా ఉంటుంది -  పిఠాపురంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
నేను హోంమంత్రినైతే పరిస్థితి వేరేలా ఉంటుంది - పిఠాపురంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
KTR Letter: తెలంగాణ సమాజాన్ని మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పండి- రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
తెలంగాణ సమాజాన్ని మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పండి- రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
Andhra Assembly Sessions : 11 కలిసొచ్చేలా అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు  - వైసీపీని ట్రోల్ చేస్తున్నారా ?
11 కలిసొచ్చేలా అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు - వైసీపీని ట్రోల్ చేస్తున్నారా ?
5G Smartphones Under Rs 10000: రూ.10 వేలలో 5జీ ఫోన్ కావాలనుకుంటున్నారా? - అయితే ఈ లిస్టుపై ఓ లుక్కేయండి!
రూ.10 వేలలో 5జీ ఫోన్ కావాలనుకుంటున్నారా? - అయితే ఈ లిస్టుపై ఓ లుక్కేయండి!
Waqf Bill TDP: వక్ఫ్ బిల్లుకు టీడీపీ వ్యతిరేకమని టీడీపీ నేత ప్రకటన - జాతీయ రాజకీయాల్లో కలకలం - అసలు నిజమేంటి ?
వక్ఫ్ బిల్లుకు టీడీపీ వ్యతిరేకమని టీడీపీ నేత ప్రకటన - జాతీయ రాజకీయాల్లో కలకలం - అసలు నిజమేంటి ?
Crime News: ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి - మెదక్‌లో దారుణ ఘటన
ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి - మెదక్‌లో దారుణ ఘటన
India WTC Final: టెస్ట్ చరిత్రలో తొలిసారి వైట్ వైష్, భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఏం చేయాలి?
టెస్ట్ చరిత్రలో తొలిసారి వైట్ వైష్, భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఏం చేయాలి?
APTET Results: ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, 50.79 శాతం అర్హత - రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, 50.79 శాతం అర్హత - రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
Embed widget