అన్వేషించండి

Gas Price: మూడో నెలలోనూ తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర - మీ ప్రాంతంలో కొత్త రేటు ఇది

LPG Cylinder Price Today: జూన్ నెలకు చమురు సంస్థలు కాస్త ఊరట కలిగించాయి. మూడోసారి కూడా గ్యాస్ ధరలు తగ్గించి ఉక్కపోతలో ఉపశమనం కలిగించాయి. మరి మీ ప్రాంతంలో ఉన్న సిలిండర్‌ ధరలు ఇక్కడ చూసేయండి

LPG Cylinder Price Reduced From 01 June 2024: లోక్‌సభ ఎన్నికల ఫలితాల ముందు LPG వినియోగదార్లకు ఊరట లభించింది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గించాయి. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) ప్రక్రియ ప్రారంభమైన తర్వాత వంట గ్యాస్‌ సిలిండర్ల ధర వరుసగా మూడోసారి తగ్గింది.

ప్రభుత్వ చమురు కంపెనీలు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ రోజు (01 జూన్‌ 2024) నుంచి దేశంలోని వివిధ నగరాల్లో ఎల్‌పీజీ సిలిండర్ల ధర సుమారు రూ. 70 తగ్గింది. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్లను వినియోగించేవాళ్లకు ఈ ప్రయోజనం దక్కుతుంది.

ఈ రోజు నుంచి మీ నగరంలో కొత్త ధరలు
తాజా కోత తర్వాత... దిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ. 69.50 తగ్గి రూ. 1676కు  (Commercial LPG Cylinder Price Today) చేరుకుంది. కోల్‌కతాలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌ రూ. 1,787కు అందుబాటులోకి రానున్నాయి. ముంబై ప్రజలు ఇప్పుడు బ్లూ సిలిండర్ కోసం రూ. 1,629 చెల్లించాల్సి ఉంటుంది. చెన్నైలో దీని ధర ఈ రోజు నుంచి రూ. 1,840.50 అవుతుంది.

గత నెలల్లోనూ తగ్గుదల
గత రెండు నెలల్లో కూడా కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గించారు. మే 01న, 19 కిలోల సిలిండర్‌ ధర రూ. 19 తగ్గింది. దీనికిముందు, ఏప్రిల్‌ 01న రూ. 35 తగ్గింది. ఏప్రిల్‌కు ముందు వరుసగా మూడు నెలలపాటు వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయి.

సామాన్యులకు మాత్రం 3 నెలలుగా రిక్తహస్తం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఈ ఏడాది మహిళా దినోత్సవం (08 మార్చి 2024) సందర్భంగా దేశీయ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను ‍‌(Domestic LPG Cylinder Price) రూ. 100 తగ్గిస్తున్నట్లు మార్చిలో ప్రకటించారు. ఇంట్లో వంటకు ఉపయోగించే ఎల్‌పీజి సిలిండర్‌ రేటు తగ్గడం అదే చివరిసారి. అప్పటి నుంచి, అంటే 3 నెలలుగా 14 కిలోల సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు.

తెలుగు రాష్ట్రాల్లో 14 కిలోల గ్యాస్‌ సిలిండర్ ధరలు
హైదరాబాద్‌లో 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ‍‌(14 KGs Gas Cylinder Price In Hyderabad) రూ. 855కి అందుబాటులో ఉంది. విజయవాడలోనూ దేశీయ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ‍‌(14 KGs Gas Cylinder Price In Vijayawada) కోసం రూ. 855 చెల్లించాలి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇదే ధర ఉంది, రవాణా ఛార్జీల వల్ల అతి స్వల్పంగా మారొచ్చు.

మార్చి నెలలో, పీఎం ఉజ్వల యోజన (Pradhan Mantri Ujjwala Yojana -  PMUY) లబ్ధిదార్లకు మాత్రం కేంద్ర ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 2024 మార్చి 07న, ఈ పథకం కింద ఒక్కో సిలిండర్‌కు రూ. 300 చొప్పున సబ్సిడీని ప్రకటించింది. దీంతో, పీఎం ఉజ్వల యోజన లబ్ధిదార్లకు పీఎంయూవై సబ్సిడీ రూ. 300 + రూ. 100 డిస్కౌంట్‌ కలిపి, మొత్తం రూ. 400 తగ్గింది. ఫైనల్‌గా, ఒక్కో సిలిండర్ రూ. 503 కే అందుబాటులోకి వచ్చింది. ఉజ్వల యోజన లబ్ధిదార్లకు ఈ రాయితీ 2025 మార్చి 31 వరకు వర్తిస్తుంది. 

ఏప్రిల్‌ నెలలో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు (జూన్ 01) చివరి దశ ఓటింగ్ జరుగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి.

మరో ఆసక్తికర కథనం: గ్లోబల్‌గా దిగొస్తున్న గోల్డ్‌ రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget