ITC: ₹400 మార్క్ కూడా దాటిన ఐటీసీ, నిఫ్టీ టాప్ గెయినర్ ఇది
గత ఒక సంవత్సర కాలంలో ఐటీసీ షేర్ ధర 48% పైగా పెరిగింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTD) 20% పైగా పెరిగింది.
ITC Share Price: సిగరెట్-టు-హోటల్ మేజర్ ITC షేర్లు కొత్త మైలురాయిని అధిగమించాయి. ఇవాళ్టి (సోమవారం, 17 ఏప్రిల్ 2023) ట్రేడ్‌లో కొత్త 52 వారాల గరిష్టాన్ని తాకాయి, రూ.400 స్థాయిని క్రాస్ చేశాయి.
BSEలో, ఐటీసీ షేరు 1.6 శాతం పెరిగి రూ. 401.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని క్రియేట్ చేసింది. అంతేకాదు.. ఈ ఇండెక్స్ హెవీవెయిట్, దలాల్ స్ట్రీట్‌లోనే టాప్ పెర్ఫార్మర్‌గా ఉంది. గత ఒక సంవత్సర కాలంలో ఐటీసీ షేర్ ధర 48% పైగా పెరిగింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTD) 20% పైగా పెరిగింది.
టార్గెట్ ప్రైస్ రూ.450
బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ ITC షేర్‌కు రూ. 450 టార్గెట్ ధరతో ‘బయ్’ రేటింగ్ ప్రకటించింది. ప్రస్తుత మార్కెట్ ధర కంటే 12.5% ర్యాలీ చేసే అవకాశం ఉందన్నది ఈ టార్గెట్ ధర అర్ధం.
"FY22-24 కాలంలో ITC నాన్-సిగరెట్ FMCG వ్యాపారం 17% CAGR వద్ద పెరగడానికి 'ITC-నెక్స్ట్' వ్యూహం సాయపడుతుంది, రాబోయే సంవత్సరాల్లో OPM 10% దాటడానికి కూడా దోహదపడుతుంది. ITC ప్రధాన వ్యాపారమైన సిగరెట్ విక్రయాల పరిమాణం లోయర్ డబుల్ డిజిట్ గ్రోత్‌లో పెరుగుతుందని భావిస్తున్నాం. GST సమావేశంలో సిగరెట్లపై పన్ను రేటు పెంపుదల లేకపోవడం, ప్రయాణాలు మెరుగుపరచడం వల్ల సిగరెట్ విక్రయాల పరిమాణం మంచి వేగంతో వృద్ధి చెందుతుంది" - షేర్‌ఖాన్
ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయానికి 1.28% లాభంతో రూ. 400.50 వద్ద ఐటీసీ షేర్లు ట్రేడ్ అవుతున్నాయి.
Trendlyne డేటా ప్రకారం... ఈ స్టాక్ సగటు టార్గెట్ ధర రూ. 434. ప్రస్తుత మార్కెట్ ధరల నుంచి 8.5% ర్యాలీ చేస్తుందని ఇది చూపుతోంది. ITCకి 32 మంది విశ్లేషకులు ఇచ్చిన ఏకాభిప్రాయ సిఫార్సు 'బయ్'. ఈ విశ్లేషకుల్లో 30 మంది 'స్ట్రాంగ్ బయ్', 'బయ్' రేటింగ్స్ ఇస్తే, ఇద్దరు మాత్రమే 'హోల్డ్' కాల్స్ ఇచ్చారు.
Q3 పనితీరు
2022-23 మూడో త్రైమాసికంలో (Q3FY23), ITC నికర లాభం సంవత్సరానికి (YoY) 21% వృద్ధితో రూ. 5,031 కోట్లకు పెరిగింది. నికర ఎక్సైజ్ సుంకం తర్వాత కార్యకలాపాల ఆదాయం సంవత్సరం ప్రాతిపదికన స్వల్పంగా 2.3% పెరిగింది, రూ. 16,226 కోట్లకు చేరుకుంది. రూ. 16,810 కోట్లుగా ఉంటుందన్న అంచనాలకు అనుగుణంగా వచ్చింది.
ఆ త్రైమాసికంలో సిగరెట్ అమ్మకాలు దాదాపు 17% పెరిగి రూ. 7,288.22 కోట్లకు చేరుకున్నాయి. నాన్-సిగరెట్ FMCG వ్యాపార ఆదాయం 18.4% YoY వృద్ధితో రూ. 4,841.40 కోట్లకు పెరిగింది. ప్రయాణ డిమాండ్ బలంగా పుంజుకోవడం వల్ల హోటల్ వ్యాపారం బలపడింది. ఈ విభాగం ఆదాయం 50.5% YoY వృద్ధితో రూ. 712.4 కోట్లకు చేరుకుంది.
Q3FY23లో వెనుకబడిన ఏకైక విభాగం వ్యవసాయ వ్యాపారం, దీని అమ్మకాలు సంవత్సరానికి 37% తగ్గి రూ. 3,124 కోట్లకు చేరుకున్నాయి. సిగరెట్ వ్యాపారం పన్నుకు ముందు లాభం (PBT) సంవత్సరానికి దాదాపు 17% వృద్ధి చెంది రూ. 4619.71 కోట్లకు చేరుకోగా, హోటళ్ల వ్యాపారం దాదాపు 3 రెట్లు పెరిగి రూ. 146.15 కోట్లకు చేరుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.