అన్వేషించండి

ITC: ₹5 లక్షల కోట్ల క్లబ్‌లో ఐటీసీ, వరుసగా రికార్డ్‌లే రికార్డ్‌లు

2023లో ఇప్పటి వరకు నిఫ్టీ50 2% పడిపోతే, ఐటీసీ కౌంటర్‌ 20% లాభాలను ఆర్జించింది.

ITC Market Cap: మూడు రోజుల క్రితం ‍‌(సోమవారం, 17 ఏప్రిల్‌ 2023) తొలిసారి రూ. 400 మార్క్‌ను క్రాస్‌ చేసిన ఐటీసీ స్టాక్‌, ఇవాళ (గురువారం, 20 ఏప్రిల్‌ 2023) మరో మైలురాయిని అధిగమించింది. గత కొన్ని రోజులుగా స్థిరంగా లాభాల్లో ఉన్న ఈ స్క్రిప్‌, ఇవాళ రూ. 5 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ITC market capitalisation Rs 5 trillion) క్లబ్‌లోకి జాయిన్‌ అయింది. అంటే, సిగరెట్‌-టు-హోటల్‌ బిజినెస్‌ చేసే ఈ కంపెనీ మార్కెట్‌ విలువ 5 లక్షల కోట్ల రూపాయలు దాటింది. మార్కెట్ విలువ ప్రకారం ఈ కంపెనీ ఇప్పుడు భారతదేశంలో 8వ అతి పెద్ద కంపెనీ.

అంతేకాదు, నేటి సెషన్‌లో, స్టాక్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ. 402.65 వద్ద తాజా జీవిత కాల గరిష్టాన్ని తాకింది.

ఐటీసీ స్టాక్‌ ప్రైస్‌ యాక్షన్‌
గత ఏడాది కాలంలో ఐటీసీ షేర్లు 50% కంటే ఎక్కువే రాబడి ఇచ్చాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) చూస్తే, నిఫ్టీ50లో రెండో అత్యుత్తమ పని తీరు గల స్టాక్ ఇది. 2023లో ఇప్పటి వరకు నిఫ్టీ50 2% పడిపోతే, ఐటీసీ కౌంటర్‌ 20% లాభాలను ఆర్జించింది.

ఐటీసీ వ్యాపార విభాగాల్లో మెరుగుదల, సిగరెట్‌లపై పన్నుల పెంపు ప్రభావం ఊహించిన దాని కంటే తక్కువగా ఉండడం ఈ స్టాక్‌లో లాభాలకు కీలక డ్రైవర్లుగా పని చేస్తున్నాయి.

కంపెనీ ఆదాయ వృద్ధిని బుల్లిష్‌గా చూస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు), మార్చి త్రైమాసికంలో ఈ కంపెనీలో తమ యాజమాన్యాన్ని పెంచుకున్నారు. కేటగిరీ-I FPIల మొత్తం హోల్డింగ్ మార్చి త్రైమాసికం చివరి నాటికి 12.87%గా ఉంది. అంతకుముందు త్రైమాసికంలోని 12.51% నుంచి పెరిగింది.

ఇటీవలే అదానీ గ్రూప్ స్టాక్స్‌లో రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టిన GQG పార్టనర్స్ కూడా మార్చి త్రైమాసికంలో ఐటీసీలో హోల్డింగ్‌ పెంచుకుంది.

ఐటీసీ టార్గెట్‌ ధర రూ. 450

బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ ITC షేర్‌కు రూ. 450  టార్గెట్ ధరతో ‘బయ్‌’ రేటింగ్‌ ప్రకటించింది. ప్రస్తుత మార్కెట్ ధర కంటే 12.5% ర్యాలీ చేసే అవకాశం ఉందన్నది ఈ టార్గెట్‌ ధర అర్ధం.

బ్రోకరేజ్ CLSA, ITCకి రూ. 430 టార్గెట్ ధరతో "ఔట్‌పెర్ఫార్మ్‌" రేటింగ్‌ కొనసాగించింది. పన్నుల్లో స్థిరత్వం వల్ల సిగరెట్‌ ఆదాయంలో వృద్ధిని ఈ బ్రోకరేజ్‌ అంచనా వేసింది.

Trendlyne డేటా ప్రకారం... ఈ స్టాక్ సగటు టార్గెట్ ధర రూ. 414.77. ప్రస్తుత మార్కెట్ ధరల నుంచి 4.11% ర్యాలీ చేస్తుందని ఇది చూపుతోంది. ITCకి 32 మంది విశ్లేషకులు ఇచ్చిన ఏకాభిప్రాయ సిఫార్సు 'బయ్‌'. ఈ విశ్లేషకుల్లో 30 మంది 'స్ట్రాంగ్‌ బయ్‌', 'బయ్‌' రేటింగ్స్‌ ఇస్తే, ఇద్దరు మాత్రమే 'హోల్డ్' కాల్స్‌ ఇచ్చారు.

Q3 పనితీరు
2022-23 మూడో త్రైమాసికంలో (Q3FY23), ITC నికర లాభం సంవత్సరానికి (YoY) 21% వృద్ధితో రూ. 5,031 కోట్లకు పెరిగింది. నికర ఎక్సైజ్ సుంకం తర్వాత కార్యకలాపాల ఆదాయం సంవత్సరం ప్రాతిపదికన స్వల్పంగా 2.3% పెరిగింది, రూ. 16,226 కోట్లకు చేరుకుంది. రూ. 16,810 కోట్లుగా ఉంటుందన్న అంచనాలకు అనుగుణంగా వచ్చింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget