News
News
X

Stock Market Update: రెండ్రోజుల్లో రూ.11 లక్షల కోట్ల నష్టం, వచ్చే వారం మార్కెట్‌ను నడిపించేది ఇవే!

గత రెండు వరుస ట్రేడింగ్‌ రోజుల్లోనే (బుధవారం, శుక్రవారం) BSE సెన్సెక్స్ 1640 పాయింట్లు పతనమవగా, NSE నిఫ్టీ 400 పాయింట్లు పడిపోయింది.

FOLLOW US: 
Share:

Stock Market Update: సోమవారం (30 జనవరి 2023) నుంచి ప్రారంభమయ్యే వారం భారత స్టాక్ మార్కెట్‌కు చాలా ముఖ్యం. అయితే, అంతకుముందే మార్కెట్‌లో విపరీతమైన నిరుత్సాహం కనిపించింది. గత రెండు రోజుల్లో స్టాక్ మార్కెట్‌లో విపరీతమైన ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఇన్వెస్టర్లు అతి భారీగా నష్టపోయారు.

రెండు రోజుల్లో రూ.10.73 లక్షల కోట్ల నష్టం
కేవలం గత రెండు వరుస ట్రేడింగ్‌ రోజుల్లోనే (బుధవారం, శుక్రవారం) BSE సెన్సెక్స్ 1640 పాయింట్లు పతనమవగా, NSE నిఫ్టీ 400 పాయింట్లు పడిపోయింది. సెన్సెక్స్ 59,330, నిఫ్టీ 17,604 పాయింట్ల వద్ద ముగిశాయి. అదానీ గ్రూప్‌ షేర్ల పతనం కూడా మార్కెట్‌ మీద తీవ్ర ప్రభావం చూపింది. అదానీ రుణాల ప్రభావం బ్యాంకుల మీద కూడా ఉంటుందన్న హిండెన్‌బర్గ్‌ నివేదికతో బ్యాంకింగ్‌ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు, కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కూడా నష్టాలకు తోడయ్యాయి. బడ్జెట్‌ మీద మార్కెట్‌లో ఉన్న అంచనాలు, బాండ్‌ ఈల్డ్స్‌లో పెరుగుదల, చమురు ధరల్లో పెరుగుదల కూడా మార్కెట్‌ పతనంలో పాత్ర పోషించాయి.

సూచీల భారీ పతనం వల్ల స్టాక్‌ మార్కెట్‌లోని సామాన్య పెట్టుబడిదార్ల నుంచి దిగ్గజాల వరకు అందరి సంపద ఆవిరైంది. కేవలం గత రెండు ట్రేడింగ్ సెషన్లలోనే పెట్టుబడిదార్లు రూ. 10.73 లక్షల కోట్లు నష్టపోయారు. BSEలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ గత రెండు రోజుల ట్రేడింగ్‌లో రూ. 10.73 లక్షల కోట్లు తగ్గి రూ. 269.65 లక్షల కోట్లకు చేరుకుంది.

వచ్చే వారం పరిస్థితేంటి?
ఫిబ్రవరి 1, 2023న, మోదీ ప్రభుత్వం 2.0 చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ను సమర్పించనుంది. మార్కెట్ ఈ బడ్జెట్ కోసం ఎదురు చూస్తోంది. ఈ బడ్జెట్ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేలా ఉంటుందా, లేదా అన్న విషయం మీదే మార్కెట్‌ తదుపరి యాక్షన్‌ ఉంటుంది. ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేలా, ఆర్థిక లోటును తగ్గించేలా, మరిన్ని పెట్టుబడులు పెట్టేలా బడ్జెట్‌ 2023 (Budget 2023) ఉండాలని మార్కెట్ ఆశిస్తోంది. మార్కెట్‌ అంచనాలకు తగ్గట్టుగా బడ్జెట్‌ లేకపోతే, సూచీల క్షీణత మరింత పెరిగే ప్రమాదం ఉంది.

దీర్ఘకాల మూలధన లాభాల (LTCG) పన్ను పెంపుపై ఆందోళన
2022లో, ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి తర్వాత, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో తిరుగుబాటు జరిగింది. ఇండియన్‌ స్టాక్ మార్కెట్ మాత్రమే పెట్టుబడిదారులకు సానుకూల రాబడిని ఇచ్చింది, ఈ క్రెడిట్ మొత్తం రిటైల్ పెట్టుబడిదారులకు వెళ్తుంది. ఇప్పుడు మాత్రం ప్రపంచ మార్కెట్లు రాణిస్తుంటే భారత మార్కెట్లు డీలా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఫిబ్రవరి 1, 2023న సమర్పించే సాధారణ బడ్జెట్‌పై స్టాక్ మార్కెట్ దృష్టి పెట్టింది. స్టాక్ మార్కెట్‌ పెట్టుబడిదార్ల ఆదాయాలపై అధిక పన్ను విధించాలని (దీర్ఘకాల మూలధన లాభాల మీద పన్ను పెంపు) కేంద్రం నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే మార్కెట్‌లో ఆందోళనలు నెలకొంది.

US FED సమావేశం
వచ్చేవారంలో, జనవరి 31-ఫిబ్రవరి 1వ తేదీల్లో అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ (US FED) సమావేశం కూడా ఉంది. యూఎస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఈసారి ఎంతమేర వడ్డీ రేట్లు పెంచుతుందన్న విషయం మీద కూడా మదుపర్లు అప్రమత్తంగా ఉన్నారు. దీంతోపాటు, ఫిబ్రవరి 6-8 తేదీల్లో RBI మానిటరీ పాలసీ కమిటీ (MPC) మీటింగ్‌ కూడా ఉంది. RBI రెపో రేటు ప్రకటన మీద 8వ తేదీ ప్రకటన ఉంటుంది. కాబట్టి, సోమవారం (30 జనవరి 2023) నుంచి ప్రారంభమయ్యే వారం భారత స్టాక్ మార్కెట్‌కు చాలా చాలా ముఖ్యమైనది. 

Published at : 28 Jan 2023 11:26 AM (IST) Tags: Market capitalization US FED RBI MPC Meeting Union Budget 2023 LTCG Investors Wealth Loss

సంబంధిత కథనాలు

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

OYO IPO: దీపావళి నాటికి ఓయో ఐపీవో, ₹5,000 కోట్ల టార్గెట్‌!

OYO IPO: దీపావళి నాటికి ఓయో ఐపీవో, ₹5,000 కోట్ల టార్గెట్‌!

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Stock Market: వచ్చే వారంలో 3 రోజులే ట్రేడింగ్‌, 4 రోజులు సెలవులు

Stock Market: వచ్చే వారంలో 3 రోజులే ట్రేడింగ్‌, 4 రోజులు సెలవులు

SCSS: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ, పెట్టుబడి పరిమితి రెండూ పెరిగాయి

SCSS: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ, పెట్టుబడి పరిమితి రెండూ పెరిగాయి

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి