News
News
X

India's Forex Reserves: రూపాయే కాదు, ఫారెక్స్‌ కూడా పాయే! ఈ దేశానికి ఏమైంది?

బంగారం నిల్వలు 458 మిలియన్ డాలర్లు తగ్గి 38.19 బిలియన్ డాలర్లకు దిగి వచ్చాయి.

FOLLOW US: 
 
India's Forex Reserves: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిన్న (శుక్రవారం) విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ‍‌(ఫారిన్‌ కరెన్సీ లేదా ఫారెక్స్‌) రెండేళ్ల కనిష్టానికి కరిగిపోయాయి. ఈ నెల 16తో ముగిసిన వారానికి, 5.22 బిలియన్ డాలర్లు తగ్గి 545.65 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.

గతేడాది అక్టోబరులో 642 బిలియన్‌ డాలర్ల నిల్వలుండగా, ఇప్పుడు 545.65 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఈ ఏడాది వ్యవధిలోనే 96.45 బిలియన్‌ డాలర్లు తగ్గాయి. 2020 అక్టోబరు 2 తరవాత ఇదే తక్కువ మొత్తం. అంటే, రెండేళ్ల కనిష్ట స్థాయికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోయాయి.

ఏడో వారం కూడా డౌన్‌
ఫారెక్స్ రిజర్వ్స్‌ తగ్గడం ఇది వరుసగా ఏడో వారం. భారతదేశ స్పాట్ ఫారెక్స్ నిల్వలు ఈ ఏడాది మార్చి చివరిలో ఉన్న 607 బిలియన్ల డాలర్ల నుంచి పడతున్నాయి.

మొత్తం నిల్వల్లో ప్రధాన భాగం అయిన ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌- FCA) పతనం కారణంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టాయని వీక్లీ స్టాటిస్టికల్ సప్లిమెంట్‌లో RBI వెల్లడించింది. 

News Reels

కరుగుతున్న బంగారం
ఈ నెల 16తో ముగిసిన వారంలో, విదేశీ నగదు ఆస్తులు 4.70 బిలియన్‌ డాలర్లు తగ్గి 484.90 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. బంగారం నిల్వలు 458 మిలియన్ డాలర్లు తగ్గి 38.19 బిలియన్ డాలర్లకు దిగి వచ్చాయి.

డాలర్ పరంగా చూస్తే, భారత విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల ప్రభావం FCA మీద ఉంటుంది.

ఇండియన్‌ రూపాయి విలువ ఇటీవలి కాలంలో జీవిత కాల కనిష్టాలకు పడిపోతోంది. శుక్రవారం ట్రేడ్‌లో, డాలర్‌తో పోలిస్తే రూ.81 కన్నా తక్కువ స్థాయికి దిగజారింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలోనే 1.6 శాతం తగ్గింది. గత సంవత్సరం ఏప్రిల్ తర్వాత రూపాయికి ఇదే అత్యంత చెత్త వారం.

తరుగుదలకు కారణాలు
పడిపోతున్న రూపాయి విలువను కాపాడడం కోసం, తన దగ్గరున్న డాలర్లను RBI విక్రయిస్తోంది. కరెంట్ ఖాతా లోటు పెరిగింది. అంటే, విదేశీ కరెన్సీ రూపంలో చెల్లింపులు పెరిగాయి. మళ్లీ నెట్‌ సెల్లర్స్‌గా మారిన విదేశీ పెట్టుబడిదారులు ఈక్విటీల అమ్మకం ద్వారా వచ్చిన రూపాయిలను విదేశీ కరెన్సీల్లోకి మార్చుకుని తీసుకెళ్లిపోతున్నారు. ఫారెక్స్‌ నిల్వలు పడిపోవడానికి ఇవే కారణాలు.

ఈ సంవత్సరం భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు మరింత క్షీణిస్తాయని డ్యూయిష్ బ్యాంక్ ఇటీవల తన నివేదికలో వెల్లడించింది. ఫారెక్స్‌ నిల్వలు తగ్గిపోయేకొద్దీ అంతర్జాతీయ ఆర్థిక ఒడుదొడుకులను తట్టుకోవడం మన ఆర్థిక వ్యవస్థకు కష్టం అవుతుంది.

FY'23 అంచనాల ప్రకారం ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) అంచనాల ప్రకారం, కరెంట్ ఖాతా లోటు 4 శాతానికి పెరిగితే, విదేశీ మారక ద్రవ్య నిల్వలు దారుణమైన స్థాయికి దిగజారతాయి. 510 బిలియన్‌ డాలర్లకు పడిపోవచ్చు. 2013 మే నెలలోని నిల్వలు $300 బిలియన్ల కంటే తక్కువగా ఉన్న టేపర్‌ ట్యాట్రమ్‌ (Taper Tantrum) కాలం కంటే ప్రస్తుతానికి మెరుగ్గానే ఉన్నాం. 2013లో జూన్‌లో ఉన్న "స్వల్పకాలిక రుణాలు-నిల్వల" నిష్పత్తి 60గా ఉంటే, ప్రస్తుతం 44 శాతంగా ఉంది. 

అధికారిక డేటా ప్రకారం.. ప్రస్తుత ఫారెక్స్‌ నిల్వలు మరో 8.9 నెలల దిగుమతులకు సరిపోతాయి.

Published at : 24 Sep 2022 10:23 AM (IST) Tags: Dollar rupee value RBI India forex reserves forex fall

సంబంధిత కథనాలు

Stock Market Closing 09 December 2022: ఓరి దేవుడా అనిపించిన ఐటీ షేర్లు - సెన్సెక్స్‌ 389, నిఫ్టీ 389 పాయింట్లు డౌన్‌

Stock Market Closing 09 December 2022: ఓరి దేవుడా అనిపించిన ఐటీ షేర్లు - సెన్సెక్స్‌ 389, నిఫ్టీ 389 పాయింట్లు డౌన్‌

Cryptocurrency Prices Today: కాస్త బెటరే! లాభాల్లో క్రిప్టో మార్కెట్లు - రూ.10వేలు పెరిగిన BTC

Cryptocurrency Prices Today: కాస్త బెటరే! లాభాల్లో క్రిప్టో మార్కెట్లు - రూ.10వేలు పెరిగిన BTC

IT Stocks Slump: ఇండియన్‌ ఐటీ షేర్లు భారీగా పతనం! అమెరికాలో ముదురుతున్న మాంద్యం!

IT Stocks Slump: ఇండియన్‌ ఐటీ షేర్లు భారీగా పతనం! అమెరికాలో ముదురుతున్న మాంద్యం!

BSNL 5G Service: 5 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్‌ - టీసీఎస్‌ను సాయం కోరిన బీఎస్ఎన్ఎల్!

BSNL 5G Service: 5 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్‌ - టీసీఎస్‌ను సాయం కోరిన బీఎస్ఎన్ఎల్!

Blackstone - Care Hospitals: క్లైమాక్స్‌కు చేరుకున్న కేర్‌ హాస్పిటల్స్‌ మెగా సేల్‌, ₹8,000 కోట్లకు బ్లాక్‌స్టోన్‌ రెడీ

Blackstone - Care Hospitals: క్లైమాక్స్‌కు చేరుకున్న కేర్‌ హాస్పిటల్స్‌ మెగా సేల్‌, ₹8,000 కోట్లకు బ్లాక్‌స్టోన్‌ రెడీ

టాప్ స్టోరీస్

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు