Stock Market Opening Bell 10 October 2022: అగ్రరాజ్య తాళానికి మన మార్కెట్లు తందానా, 1% పైగా నష్టాల్లో ఓపెన్
మిగిలిన ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడం వల్ల కూడా మన దగ్గర సెంటిమెంట్ దెబ్బతింది.
![Stock Market Opening Bell 10 October 2022: అగ్రరాజ్య తాళానికి మన మార్కెట్లు తందానా, 1% పైగా నష్టాల్లో ఓపెన్ Indian Stock Market Opening Bell 10 October 2022 sensex nifty nifty bank Stock Market Opening Bell 10 October 2022: అగ్రరాజ్య తాళానికి మన మార్కెట్లు తందానా, 1% పైగా నష్టాల్లో ఓపెన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/10/face92346bbb8c8207614263e55912e11665375969042545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stock Market Opening Bell 10 October 2022: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ (సోమవారం) బిగ్ గ్యాప్ డౌన్‌లో, 1 శాతం పైగా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికన్ మార్కెట్లు గత శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఆ తాళానికి అనుగుణంగా మన మార్కెట్లు ఇవాళ తందానా అంటున్నాయి. మిగిలిన ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడం వల్ల కూడా మన దగ్గర సెంటిమెంట్ దెబ్బతింది. ఇవాళ వెలువడే టీసీఎస్ ఫలితాలతో రిజల్ట్స్ సీజన్ ప్రారంభమవుతుంది. JTL ఇన్‌ఫ్రా, ఇంటర్నేషనల్ ట్రావెల్ హౌస్, గోరాని ఇండస్ట్రీస్, ఎక్సెల్ రియాల్టీ ఎన్ ఇన్‌ఫ్రా కూడా ఇవాళ్టి క్యూలో ఉన్నాయి. బజాజ్ ఆటో, శ్రీ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫలితాలూ ఈ వారమే విడుదలవుతాయి. వీటితో పాటు, జీవిత కాల కనిష్ట స్థాయిలో ట్రేడవుతున్న రూపాయి కదలికలూ కీలకమే. సెప్టెంబరులో అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా నమోదైనందున, నవంబరులో అక్కడ వడ్డీ రేట్లు పెంచొచ్చని భావిస్తున్నారు. శుక్రవారం అమెరికన్ మార్కెట్లు గట్టిగా పడడానికి కారణం ఇదే. బుధవారం వెలువడే మన దేశ రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కలు, గురువారం రాత్రి వచ్చే అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలపైనా మార్కెట్ దృష్టి పెడుతుంది. కాబట్టి, కార్పొరేట్ ఫలితాలు, కీలక ఆర్థిక గణాంకాల ఆధారంగా ఈ వారం మార్కెట్ కదలాడొచ్చని విశ్లేషకుల అంచనా.
BSE Sensex
క్రితం సెషన్‌లో (శుక్రవారం) 58,191.29 పాయింట్ల వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇవాళ (సోమవారం) 767 పాయింట్లు లేదా 1.32 శాతం నష్టంతో 57,424.07 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఉదయం 10 గంటల సమయానికి 1.28 శాతం లేదా 746.63 పాయింట్ల నష్టంతో 57,444.66వద్ద ట్రేడవుతోంది.
NSE Nifty
శుక్రవారం 17,314.65 పాయింట్ల వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఇవాళ 220 పాయింట్లు లేదా 1.27 శాతం నష్టంతో 17,094.35 పాయింట్ల వద్ద ఓపెనైంది. ఉదయం 10 గంటల సమయానికి 1.27శాతం లేదా 219.85 పాయింట్ల నష్టంతో 17,094.80 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
శుక్రవారం 39,178.05 పాయిట్ల వద్ద ముగిసిన బ్యాంక్ నిఫ్టీ, ఇవాళ 536 పాయింట్లు లేదా 1.37 శాతం నష్టంతో 38,641.55 పాయింట్ల వద్ద మొదలైంది. ఉదయం 10 గంటల సమయానికి 1.33 శాతం లేదా 520.20 పాయింట్ల నష్టంతో 38,657.85 వద్ద ట్రేడవుతోంది.
Top Gainers and Lossers
మార్కెట్ ప్రారంభ సమయంలో... నిఫ్టీ 50లో కేవలం 2 కంపెనీలు (పవర్ గ్రిడ్, కోల్ ఇండియా) మాత్రమే లాభాల్లో ఉండగా, మిగిలిన 48 కంపెనీలు నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. టాటా మోటార్స్, హీరో మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, గ్రాసిమ్, హిందుస్థాన్ యూనిలీవర్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో స్టాక్స్ 2-3.5 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి. మిగిలినవి కూడా 2 శాతం వరకు నష్టాలను భరిస్తున్నాయి. అదే సమయానికి నిఫ్టీలోని మొత్తం 15 సెక్టోరియల్ ఇండీస్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)