అన్వేషించండి

Oil Imports: చైనా కరెన్సీలో రష్యాకు పేమెంట్స్‌ - భారత రిఫైనరీల యాక్షన్‌!

Oil Imports: రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురుకు చైనా కరెన్సీ యువాన్లలో భారత రిఫైనరీ కంపెనీలు చెల్లింపులు చేస్తున్నాయని సమాచారం.

Oil Imports:

రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురుకు చైనా కరెన్సీ యువాన్లలో భారత రిఫైనరీ కంపెనీలు చెల్లింపులు చేస్తున్నాయని సమాచారం. వెస్ట్రన్‌ కంట్రీస్‌ డాలర్లలో ట్రేడింగ్‌ను నిషేధించడంతో కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల్లో చెల్లిస్తున్నాయి.

ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలవ్వగానే పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అక్కడి నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతి చేసుకోవడం నిలిపివేశాయి. దాంతో ఆ దేశం నుంచి భారత్‌ మునుపెన్నడూ లేని విధంగా ముడి చమురును దిగుమతి చేసుకొంది. స్థానిక కంపెనీలు ఆ చమురును రిఫైన్‌ చేసి తిరిగి ఐరోపా దేశాలకు విక్రయించి లాభపడ్డాయి. మొదట్లో రష్యాకు రూపాయిల్లో చెల్లింపులు చేపట్టినప్పటికీ.. వీటిని ఏం చేసుకోవాలని ఆ దేశం ప్రశ్నించింది. దాంతో భారత్‌ కొంత మేరకు యువాన్లలో చెల్లింపులు చేపట్టినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.

ప్రపంచ వ్యాప్తంగా సుదీర్ఘ కాలంగా చమురు క్రయవిక్రయాలకు అన్ని దేశాలు అమెరికా డాలర్‌ను ప్రామాణికంగా తీసుకున్నాయి. భారత్‌ సైతం సౌదీ, ఓపెక్‌ దేశాలు డాలర్లలో రూపంలోనే చెల్లింపులు చేస్తుంది.  అయితే ఆంక్షల వల్ల చైనా కరెన్సీ యువాన్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురుకు డ్రాగన్‌ దేశం ఇలాగే చెల్లింపులు చేస్తోంది. ఇతర దేశాలను యువాన్లలో చెల్లించాలని రష్యా కోరుతోంది.

'ట్రేడింగ్‌ సెటిల్‌మెంట్లను డాలర్లలో చేసేందుకు బ్యాంకులు అంగీకరించకపోతే కొన్ని రిఫైనరీలు యువాన్‌ వంటి ఇతర దేశాల కరెన్సీల్లో చెల్లింపులు చేస్తాయి' అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి భారీ స్థాయిలో చమురు కొనుగోలు చేస్తున్న ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ జూన్‌లో యువాన్‌ రూపంలో చెల్లింపులు చేపట్టిందని వారు పేర్కొన్నారు. మూడు ప్రైవేటు కంపెనీల్లో రెండు ఇలాగే చేశారని వెల్లడించారు.

యువాన్లలో చెల్లింపులపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నయారా ఎనర్జీ, హెచ్‌పీసీఎల్‌, ఎనర్జీ లిమిటెడ్‌ను సంప్రదించగా ఆ కంపెనీల ప్రతినిధులు స్పందించలేదని తెలిసింది. ఇండియన్‌ ఆయిల్‌ సైతం ఇందుకు నిరాకరించింది. అయితే ఇండియన్‌ రిఫైనరీలు ఎంత మేరకు యువాన్లలో చెల్లింపులు చేశాయో తెలియడం లేదు. కాగా కొన్ని డాలర్‌ యేతర చెల్లింపులను యూఏఈ దిర్హమ్స్‌లోనూ చెల్లిస్తాయని సమాచారం.

'డాలర్లలో చెల్లించేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. కొన్నిసార్లు విక్రేతలు అడిగితే ఇతర కరెన్సీలైన దిర్హమ్స్‌, యువాన్లలోనూ రిఫైనరీలు చెల్లింపులు చేస్తాయి' అని ప్రభుత్వ వర్గాలు అన్నాయి. చైనాతో సరిహద్దు సమస్యల కారణంగా దిగుమతి చేసుకున్న రష్యా చమురుకు యువాన్లలో చెల్లించొద్దని కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్‌, రిఫైనరీ కంపెనీలను ఆదేశించినట్టు తెలిసింది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే సమస్యలు సద్దుమణిగినట్టు తెలుస్తోంది.

Also Read: కేవలం ₹100కే రైల్వే స్టేషన్‌లో రూమ్‌ - హోటల్‌ గదిలా ఉంటుంది

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Does Gen Z Use Credit Cards:క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 
క్రెడిట్ కార్డుల కోసం ఎగబడుతున్న జెన్‌జీ! షాపింగ్, ఈఎంఐల కోసం వాడకం! షాకింగ్ రిపోర్టు ఇదే! 
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
EPFO Crediting Interest: కోట్లాది మంది ఉద్యోగులకు EPFO తీపి కబురు! 8.25% వడ్డీ జమ ప్రారంభం.. ఇలా చెక్ చేసుకోండి!
కోట్లాది మంది ఉద్యోగులకు EPFO తీపి కబురు! 8.25% వడ్డీ జమ ప్రారంభం.. ఇలా చెక్ చేసుకోండి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget