By: ABP Desam | Updated at : 02 May 2023 12:14 PM (IST)
మార్చి ఫలితాల్లో రికార్డుల మోత, ఓ రేంజ్‌లో పెరిగిన షేర్లు
IDFC First Bank Shares: ప్రైవేట్ రంగ రుణదాత IDFC ఫస్ట్ బ్యాంక్ 2023 మార్చి త్రైమాసికంలో రికార్డ్ స్థాయి ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో, ఆ ఉత్సాహం షేర్లలో కనిపించింది. బ్యాంక్ షేర్లు ఇవాళ (మంగళవారం, 02 మే 2023) BSEలో 6% ర్యాలీ చేసి రూ. 65.20 కి చేరుకున్నాయి. ఇది 52-వారాల కొత్త గరిష్ట స్థాయి.
ఉదయం 11.45 గంటల సమయానికి ఈ స్క్రిప్ 4.29% లేదా రూ. 2.73 లాభంతో రూ. 64.22 వద్ద ట్రేడవుతోంది.
ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTD), ఈ స్టాక్ కేవలం 5% మాత్రమే పెరిగింది. అయితే, గత ఒక సంవత్సర కాలంలో 65% పైగా పెరిగింది. గత ఆరు నెలల కాలంలో దాదాపు 16%, గత ఒక నెల రోజుల్లోనూ దాదాపు 16% రిటర్న్ ఇచ్చింది.
Q4 ఫలితాల తర్వాత, బ్రోకరేజ్ నోమురా, IDFC ఫస్ట్ బ్యాంక్ స్టాక్ మీద తన హోల్డ్ రేటింగ్‌ను కొనసాగించింది. ప్రైస్ టార్గెట్‌ను గతంలోని రూ. 57 నుంచి రూ. 60కి పెంచింది.
Q4 ఫలితాల్లో రికార్డుల మోత
2023 జనవరి-మార్చి కాలంలో బ్యాంక్‌కు త్రైమాసిక పన్ను తర్వాతి లాభం 134% YoY జంప్ చేసి రూ. 803 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ చరిత్రలో ఏ త్రైమాసికంలోనైనా ఇదే గరిష్ట లాభం. మొత్తం FY23లో బ్యాంక్ లాభం రూ. 2,437 కోట్లు. ఇది కూడా రికార్డ్ స్థాయి మొత్తం.
Q4లో, IDFC ఫస్ట్ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) రూ. 3,596.75 కోట్లకు చేరింది, ఏడాదికి 34.75% వృద్ధిని సాధించింది.
రుణదాత ఆస్తి నాణ్యత కూడా మెరుగుపడింది. స్థూల నిరర్ధక ఆస్తులు (GNPAలు) 2.51% వద్ద, నికర నిరర్ధ ఆస్తులు (NNPAలు) 0.86% వద్ద ఉన్నాయి.
మార్చి త్రైమాసికంలో, కోర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 61% YoY పెరిగి రూ. 1,342 కోట్లకు చేరుకుంది.
మొత్తం ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు గణనీయంగా 46% తగ్గి రూ. 1,665 కోట్లకు చేరాయి. ఇదొక మంచి పరిణామం. బ్యాంక్ ప్రొవిజన్ కవరేజ్ రేషియో (PCR) 1000 bps పెరిగి 80.29% వద్ద ఉంది.
FY23లో రుణ వ్యయాలు 1.5%గా ఉండొచ్చని గతంలో బ్యాంక్ మేనేజ్‌మెంట్ చెబితే, ఇంకా తగ్గి 1.16%గా నమోదయ్యాయి. అంటే, బ్యాంక్ ఖర్చులుతగ్గాయి.
RoA FY22లోని 0.08% నుంచి FY23లో 1.13%కి మెరుగుపడింది, RoE కూా FY22లోని 0.75% నుంచి 10.95%కి మెరుగుపడింది.
బ్యాంక్ మంచి లాభాల్లోకి వస్తోందని, ఇక్కడి నుంచి బలమైన ఆర్థిక పనితీరును అందించగలదని IDFC ఫస్ట్ బ్యాంక్ MD & CEO వి.వైద్యనాథన్ తెలిపారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లకు యూఎస్ డెట్ సీలింగ్ ఊపు - బిట్‌కాయిన్ రూ.70వేలు జంప్!
Latest Gold-Silver Price Today 29 May 2023: మళ్లీ పడిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Petrol-Diesel Price 29 May 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు - కొత్త రేట్లివి
NSC: మీకు ₹72 లక్షలు కావాలా? ఈ పోస్టాఫీస్ పథకం ఇస్తుంది!
Stock Market News: ఆల్‌టైమ్ హై వైపు పరుగులు - ఇంట్రాడేలో 63,026 టచ్ చేసిన సెన్సెక్స్!
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్