అన్వేషించండి

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!

ICICI Bank Credit Card: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో మార్పులు నవంబర్ 15 నుంచి అమలవుతాయి. ఆ రోజు నుంచి కొన్ని ఛార్జీలు పెరుగుతాయి, కొన్ని తగ్గుతాయి.

ICICI Bank Credit Card Rules Changed: మన దేశంలో, ప్రస్తుతం, 10 కోట్లకు పైగా క్రెడిట్‌ కార్డ్‌లు జారీ అయ్యాయి. కోట్లాది మంది కస్టమర్లు ఈ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. క్రెడిట్‌ కార్డుల్లో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులపై ఆసక్తి చూపుతున్నారు. మన దేశంలో, ఎక్కువ మంది ఉపయోగించే క్రెడిట్‌ కార్డుల్లో ICICI బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌ కూడా ఒకటి. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీ దగ్గర కూడా ఉంటే, ఈ వార్త మీకు చాలా ముఖ్యం. శుక్రవారం (15 నవంబర్ 2024) నుంచి ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నియమాలు మారబోతున్నాయి. మారిన రూల్స్‌లో కొన్ని మీపై ఆర్థిక భారం మోపుతాయి, మరికొన్ని అదనపు ప్రయోజనం అందిస్తాయి.

శుక్రవారం నుంచి మారనున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్ రూల్స్‌:

1. విద్యాసంస్థల్లో లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు లేవు
2. కార్డ్ చెల్లింపులు ఆలస్యమైతే (Late payment) విధించే రుసుముల్లో మార్పు
3. యుటిలిటీ, ఇంధన చెల్లింపులపై కొత్త రకం ఛార్జీలు

ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా విద్యా సంబంధిత లావాదేవీలపై 'నిల్‌ ఛార్జెస్‌'
15 నవంబర్‌ 2024 నుంచి, ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్ ద్వారా అంతర్జాతీయ విద్య కోసం లేదా పాఠశాల & కళాశాలల్లో ఫీజు చెల్లించడానికి ఎటువంటి అదనపు ఛార్జీలు విధించరు. అయితే, మీరు థర్డ్ పార్టీ యాప్‌ల (పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే వంటివి) ద్వారా ఐసీఐసీఐ కార్డ్‌ను ఉపయోగించి ఫీజులు చెల్లింపు లేదా విద్యాసంస్థల్లో లావాదేవీలు చేస్తే 1 శాతం రుసుము చెల్లించాలి. అంటే, మీరు నేరుగా ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో ఫీజ్‌ కడితే ఎలాంటి ఛార్జ్‌ ఉండదు.

లేట్ పేమెంట్ ఛార్జీలో మార్పు
శుక్రవారం నుంచి, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బిల్లును ఆలస్యంగా చెల్లిస్తే విధించే చార్జీలు మారతాయి. ఛార్జీల వివరాలు ఇవిగో:

- రూ. 101 నుంచి రూ. 500 - రూ. 100 ఛార్జీ
- రూ. 501 నుంచి రూ. 1,000 - రూ. 500 తీసుకుంటారు
- రూ. 1,001 నుంచి రూ. 5,000 - రూ. 600 వసూలు చేస్తారు
- రూ. 5,001 నుంచి రూ. 10,000 - రూ. 750 ఛార్జ్‌ చేస్తారు
- రూ. 10,001 నుంచి రూ. 25,000 - రూ. 900 ఛార్జీ
- రూ. 25,001 నుంచి రూ. 50,000 - రూ. 1100 తీసుకుంటారు
- రూ. 50,000 కంటే ఎక్కువ ఔట్‌స్టాండింగ్‌ - రూ. 1300 వసూలు చేస్తారు

క్రెడిట్‌ కార్డ్‌ ఔట్‌స్టాండింగ్‌ (బకాయి) మొత్తం రూ. 100 లేదా అంతకంటే తక్కువ ఉంటే, దీనిపై ఆలస్య చెల్లింపు రుసుము విధించరు.

యుటిలిటీ & ఇంధన చెల్లింపుపై ఇతర ఛార్జీలు

- క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తం యుటిలిటీ పేమెంట్స్‌ చేస్తే, ఆ మొత్తంపై 1 శాతం ఛార్జ్ చెల్లించాలి.

- 1000 రూపాయల కంటే ఎక్కువ విలువైన ఇంధన చెల్లింపు లావాదేవీ చేస్తే దానిపై 1% ఛార్జ్ చెల్లించాలి.

- పొడిగించిన క్రెడిట్ & క్యాష్‌ అడ్వాన్సులపై ఓవర్ డ్యూ వడ్డీ నెలకు 3.75 శాతం వసూలు చేస్తారు. దీనిపై వార్షిక వడ్డీ రేటు 4.5 శాతంగా ఉంటుంది. 

మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తుంటే, కొత్త ఛార్జీలను గుర్తుంచుకుంటే, మీ పర్స్‌పై అదనపు భారం పడకుండా నివారించొచ్చు.

మరో ఆసక్తికర కథనం: పసిడిలో మహా పతనం, లక్షకు దిగువన వెండి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget