అన్వేషించండి

Credit Card Eligibility: బ్యాంక్ అకౌంట్ లేకున్నా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా ? ఎవరికి జారీ చేస్తారు

Credit Card Without Bank Account: క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు అడ్రస్ ప్రూఫ్, ఆదాయానికి సంబంధించిన కొన్ని అవసరమైన పత్రాలు సమర్పించాలి. అకౌంట్ లేకున్నా బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇస్తాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బ్యాంక్ అకౌంట్ లేకున్నా ఆదాయం, క్రెడిట్ స్కోర్ చూసి కార్డు.
  • క్రెడిట్ హిస్టరీ లేకున్నా ఎఫ్‌డీ ఆధారంగా కార్డు పొందవచ్చు.
  • క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులు భిన్నం; స్కోర్‌పై ప్రభావం వేరు.
  • కార్డును జాగ్రత్తగా వాడి, బిల్లులు సకాలంలో చెల్లించాలి.

సార్/ మేడం మేం పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీకు క్రెడిట్ కార్డ్ ఏమైనా కావాలా అని వారి రిప్రజెంటెటివ్స్ అడుగుతుంటారు. అయితే క్రెడిట్ కార్డు తీసుకోవడానికి బ్యాంకులో అకౌంట్ ఉండటం అవసరమా? అంటే తప్పనిసరిగా అదే బ్యాంకులో అకౌంట్ ఉన్న వ్యక్తికే క్రెడిట్ కార్డు ఇవ్వాలనే రూల్ ఉండదు. పలు బ్యాంకులు తమ వద్ద బ్యాంక్ అకౌంట్ లేని వారికి కూడా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుంటాయి. 

నిపుణుల ప్రకారం, బ్యాంకులు ముందుగా దరఖాస్తుదారుడి ఆదాయం ఎంత, వారు ఏ పని చేస్తారు, క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది. సమయానికి బిల్ పేమెంట్ చేయగలరా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఈ విషయాల్లో క్లారిటీ వస్తే చాలు బ్యాంక్ అకౌంట్ లేకుండానే కూడా ఆ వ్యక్తికి క్రెడిట్ కార్డు జారీ చేస్తారు. 

ఎఫ్‌డీని చూసి క్రెడిట్ కార్డు జారీ

కొన్నిసార్లు ఒక వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు. దాంతో వారికి క్రెడిట్ హిస్టరీ కూడా ఉండదు. అలాంటి సందర్భాల్లో కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీ(FD)కి బదులుగా కూడా క్రెడిట్ కార్డు జారీ చేస్తాయి. దీని ద్వారా ప్రజలకు మంచి క్రెడిట్ హిస్టరీ క్రియేట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంటే వ్యక్తికి క్రెడిట్ కార్డు వస్తుంది. అక్కడి నుంచి ఆ వ్యక్తికి క్రెడిట్ హిస్టరీ ప్రారంభమవుతుంది.

క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ

క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, మీ ఆదాయానికి సంబంధించిన కొన్ని అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అయితే ప్రతి బ్యాంక్‌కు వారికంటూ వేర్వేరు రూల్స్, కండీషన్స్ ఉంటాయని గుర్తుంచుకోండి. చాలాసార్లు ప్రీపెయిడ్ కార్డు, క్రెడిట్ కార్డుకు ప్రత్యామ్నాయం అని ప్రజల్లో అపోహ ఉంటుంది. కానీ అందులో నిజం కాదు. ప్రీపెయిడ్ కార్డులో మీరు మీ  డబ్బును ముందుగానే లోడ్ చేసి ఖర్చు చేస్తారు.

Also Read: Online Shopping News: ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు బిగ్‌షాక్! సెప్టెంబర్ 1  డెలివరీ ఛార్జీలు పెంపు!

క్రెడిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డుకు మధ్య వ్యత్యాసం ఏమిటి?

క్రెడిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డు 2 వేర్వేరు రకాల కార్డులు అని గ్రహించాలి. బిల్లులు సకాలంలో చెల్లిస్తూ క్రెడిట్ కార్డును సరిగ్గా ఉపయోగిస్తే మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడవచ్చు. అయితే ప్రీపెయిడ్ కార్డు వినియోగం క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. ప్రీపెయిడ్ కార్డు అంటే ముందుగానే మనీ జమ చేసే కార్డు. వినియోగదారు కార్డులో ఉన్న మొత్తాన్ని తమ అవసరాలకు తగ్గట్లుగా ఖర్చు చేయవచ్చు. క్రెడిట్ కార్డును మీ వద్ద నగదు లేకపోయినా అందులో ఉన్న లిమిట్ వరకు షాపింగ్ చేయవచ్చు. బిల్లులు పే చేసే వీలుంటుంది. అందువల్ల ప్రీపెయిడ్ కార్డును క్రెడిట్ కార్డుగా భావించవద్దు.

క్రెడిట్ కార్డుతో జాగ్రత్త

క్రెడిట్ కార్డును బాగా ఆలోచించి, జాగ్రత్తగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. ఎంత ఖర్చు చేస్తారో, దాని బిల్ సైకిల్ సమయానికి తిరిగి చెల్లించాలి. సరిగ్గా ఉపయోగిస్తే క్రెడిట్ కార్డు అవసరమైన సమయంలో మిమ్మల్ని ఆదుకుంటుంది. క్రెడిట్ కార్డు తీసుకునే ముందు దాని వడ్డీ రేటు, వార్షిక ఫీజు, లేట్ ఫీజుతో పాటు ఇతర అన్ని ఛార్జీల గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Frequently Asked Questions

క్రెడిట్ కార్డు పొందడానికి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలా?

తప్పనిసరిగా అదే బ్యాంకులో అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని బ్యాంకులు తమ వద్ద అకౌంట్ లేని వారికి కూడా క్రెడిట్ కార్డులు జారీ చేస్తాయి.

క్రెడిట్ కార్డు మంజూరు చేసేటప్పుడు బ్యాంకులు ఏ విషయాలు పరిశీలిస్తాయి?

బ్యాంకులు దరఖాస్తుదారుడి ఆదాయం, పని, క్రెడిట్ స్కోర్, బిల్లు చెల్లింపు సామర్థ్యాన్ని పరిశీలిస్తాయి. ఈ వివరాలు స్పష్టంగా ఉంటే అకౌంట్ లేకుండానే కార్డు ఇస్తారు.

క్రెడిట్ హిస్టరీ లేనివారు క్రెడిట్ కార్డును ఎలా పొందవచ్చు?

బ్యాంక్ అకౌంట్ లేదా క్రెడిట్ హిస్టరీ లేనివారికి కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీ (FD)కి బదులుగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తాయి. ఇది వారికి మంచి క్రెడిట్ హిస్టరీని సృష్టించుకోవడానికి సహాయపడుతుంది.

క్రెడిట్ కార్డుకు, ప్రీపెయిడ్ కార్డుకు మధ్య తేడా ఏమిటి?

క్రెడిట్ కార్డుతో అప్పుగా ఖర్చు చేయవచ్చు, ఇది క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. ప్రీపెయిడ్ కార్డులో ముందుగా డబ్బు లోడ్ చేసి ఖర్చు చేస్తారు, ఇది క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపదు.

క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

క్రెడిట్ కార్డును అవసరం మేరకు జాగ్రత్తగా ఉపయోగించాలి. వడ్డీ రేటు, వార్షిక ఫీజు, లేట్ ఫీజుతో పాటు ఇతర ఛార్జీల గురించి తెలుసుకొని, బిల్లులను సకాలంలో చెల్లించాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Comedy Drama OTT : ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget