Direct Tax Collections: దేశంలో వసూలైన పన్నులు ఎంత? రీఫండ్ ఇచ్చిందెంత?
Direct Tax Collections: దేశంలో పన్ను ఆదాయం బాగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.13.63 లక్షల కోట్ల స్థూల ప్రత్యక్ష పన్నులను వసూలు చేసింది.
Direct Tax Collections:
దేశంలో పన్ను ఆదాయం బాగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.13.63 లక్షల కోట్ల స్థూల ప్రత్యక్ష పన్నులను వసూలు చేసింది. గతంతో పోలిస్తే 26 శాతం వృద్ధి నమోదవ్వడం గమనార్హం. టీడీఎస్ డిడక్షన్లు, కార్పొరేట్ అడ్వాన్స్ టాక్స్‌లు ఇందుకు దోహదం చేశాయి.
రీఫండ్ చెల్లించాక సర్దుబాటు చేసిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఈ ఆర్థిక ఏడాది ఇప్పటి వరకు రూ.11.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది పూర్తి బడ్జెట్ లక్ష్యంలో ఇది 80 శాతమని ప్రభుత్వం తెలిపింది.
ఈ ఆర్థిక ఏడాదిలో రూ.14.20 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2021-22లోని 14.10 లక్షల కోట్లతో పోలిస్తే ఇప్పుడు వృద్ధిని సాధించింది. ప్రత్యక్ష పన్నుల్లో ఎక్కువగా వ్యక్తిగత ఆదాయపన్ను, కార్పొరేట్ పన్నులు కలిసి ఉంటుంది. 2022, డిసెంబర్ 17 నాటికి రూ.2.28 లక్షల కోట్ల రీఫండ్ చెల్లించారు. గతేడాదితో పోలిస్తే 68 శాతం పెరిగింది.
కార్పొరేషన్ టాక్స్ (CIT) రూపంలో ప్రభుత్వానికి రూ.13,63,649 కోట్ల ఆదాయం వచ్చింది. వ్యక్తిగత ఆదాయ పన్ను (PIT), సెక్యూరిటీ లావాదేవీల పన్ను (STT) రూపంలో రూ.6.35 లక్షల కోట్ల ఆదాయం కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ (CBDT) తెలిపింది.
వ్యక్తిగత, కంపెనీల ఆదాయం పెరగడం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సంకేతాలని నిపుణులు అంటున్నారు. కరోనా తర్వాత ఎకానమీ తిరుగులేని విధంగా వృద్ధి నమోదు చేసిందని పేర్కొన్నారు. కార్పొరేట్ పన్నుల్లో అడ్వాన్స్ రూపంలో రూ.5.21 లక్షల కోట్లు, మూలం వద్ద పన్ను (TDS) రూపంలో రూ.6.44 లక్షల కోట్లు వచ్చాయి. సెల్ఫ్ అసెస్‌మెంట్ పన్ను రూపంలో రూ.1.40 లక్షల కోట్లు సమకూరాయి.
ఈ ఏడాది మొదటి, రెండు, మూడో త్రైమాసికాల్లో ముందస్తు పన్ను వసూళ్లు 12.83 శాతం వృద్ధితో రూ.5.21 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో కార్పొరేట్ పన్నులు రూ.3.79 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్నులు రూ.1.23 లోల కోట్లుగా ఉన్నాయి.
సీబీడీటీ ప్రకటన ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు ఆదాయం, కార్పొరేట్ పన్నుల నికర వసూళ్లు రూ.11.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2021-22లో ఇదే సమయంలోని రూ.9,47,959 కోట్లతో పోలిస్తే 19.81 శాతం పెరిగాయి.
ఈ ఏడాది ఆదాయపన్ను రిటర్నుల ప్రక్రియ అత్యంత వేగంగా సాగిందని పన్నుల శాఖ తెలిపింది. డిసెంబర్ 18 నాటికి 96.5 శాతం ఐటీఆర్‌లు తనిఖీ చేశామని వెల్లడించింది.
Also Read: హాయ్ స్విగ్గీ! అండర్‌వేర్, బెడ్ డెలివరీ చేస్తారా!!
Also Read: క్రేజీ రిటర్న్! 2022లో సూపర్ డూపర్ రాబడి అందించిన సిప్ ఫండ్స్!
Union Finance Minister @nsitharaman said importance given by naming the residential blocks after traditional flowers like Vaagai, Kaanthal and Konrai depicts Tami's glorious culture dating back to the Sangam Era.@nsitharamanoffc @FinMinIndia @cbic_india @PIB_India pic.twitter.com/72Urprz3mL
— PIB in Tamil Nadu (@pibchennai) December 18, 2022
Observing that it is important to remain rooted to cultural traditions unique to each state,Hon’ble FM Smt @nsitharaman complimented ITD for invoking the rich cultural symbolism of Tamil Nadu in christening the residential blocks of ‘Nandavanam’ after the names of native flowers.
— Income Tax India (@IncomeTaxIndia) December 18, 2022