News
News
X

Global Health IPO: గ్లోబల్‌ హెల్త్‌ ఐపీవోలో పాల్గొంటారా?, ముందు ఈ 5 కీ పాయింట్స్‌ తెలుసుకోండి!

ఇవాళ ప్రారంభమైన ఈ ఇష్యూ సోమవారం (నవంబర్ 7, 2022) ముగుస్తుంది. నిన్న (బుధవారం) యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ జరిగింది.

FOLLOW US: 

Global Health IPO: మేదాంత (Medanta) బ్రాండ్‌తో హాస్పిటల్‌ వ్యాపారం చేస్తున్న గ్లోబల్‌ హెల్త్‌ లిమిటెడ్‌ IPO ఇవాళ (నవంబర్‌ 3, 2022) ప్రారంభమైంది. IPO సైజ్‌ ₹ 2,206 కోట్లు. అన్ని మార్కెట్లలో వ్యాపారం పెంచుకోవడానికి ఈ డబ్బును ఉపయోగించాలన్నది కంపెనీ ప్లాన్.

గ్లోబల్‌ హెల్త్‌ షేర్లు ఈ నెల 16న BSE, NSEలో లిస్ట్‌ అవుతాయి. ముందస్తు ప్రణాళిక మారితే లిస్టింగ్‌ తేదీలు కూడా మారే అవకాశం ఉంది. 

గ్లోబల్‌ హెల్త్‌ IPO గురించి తెలుసుకోవలసిన 5 ముఖ్య విషయాలు:

IPO తేదీలు 
ఇవాళ ప్రారంభమైన ఈ ఇష్యూ సోమవారం (నవంబర్ 7, 2022) ముగుస్తుంది. నిన్న (బుధవారం) యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ జరిగింది.

News Reels

ప్రైస్ బ్యాండ్ 
గ్లోబల్ హెల్త్ ఒక్కో ఈక్విటీ షేరు ముఖ విలువ ₹2. ఒక్కో ఈక్విటీ షేరుకు IPO ధరను ₹319-336గా కంపెనీ నిర్ణయించింది.

గ్రే మార్కెట్, షేర్ల కేటాయింపు, లిస్టింగ్‌ తేదీలు
ప్రస్తుతం, ఒక్కో షేరుకు గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ₹25గా ఉంది. IPO ధర కంటే 7.44% ప్రీమియంతో ఈ స్టాక్ ₹361 వద్ద లిస్ట్‌ అవ్వచ్చని ఇది సూచిస్తోంది. విన్‌ బిడ్డర్‌లకు నవంబర్ 11న షేర్లను కేటాయిస్తారు. విన్‌ కాని బిడ్డర్‌లకు నవంబర్ 14న రీఫండ్ ఉంటుంది. నవంబర్ 15 నాటికి విన్‌ అయిన బిడ్డర్ల డీమ్యాట్ ఖాతాలో షేర్లను జమ చేస్తారు. నవంబర్ 16న ఈ స్టాక్ మార్కెట్‌లోకి వస్తుంది.

లాట్‌ సైజ్ 
ఏ IPOలో అయినా లాట్‌ రూపంలో బిడ్‌ వేయాలి. ఈ IPOలో 44 షేర్లను ఒక లాట్‌గా నిర్ణయించారు. పెట్టుబడిదారులు 1 లాట్‌ కావాలంటే 44 షేర్లకు, 2 లాట్లు కావాలంటే 88 షేర్లకు, ఇలా 44 గుణిజాల్లో బిడ్‌ వేయాలి. ఎగువ ప్రైస్‌ బ్యాండ్‌ (₹336) ప్రకారం... రిటైల్ ఇన్వెస్టర్‌ కనీస పెట్టుబడి (44 షేర్లకు) ₹14,784 అవుతుంది. ఒక రిటైల్ ఇన్వెస్టర్ గరిష్టంగా 13 లాట్‌లు లేదా 572 షేర్ల కోసం బిడ్‌ వేయవచ్చు. ఈ లెక్కన గరిష్ట పెట్టుబడి ₹1,92,192 అవుతుంది.

ఇష్యూ సైజ్‌లో సగం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, మిగిలిన 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేశారు.

మరింత సమాచారం 
కార్డియాలజిస్ట్ నరేష్ త్రెహాన్‌ ఈ సంస్థను స్థాపించారు. IPOలో.. ₹500 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ, 5.08 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉంటుంది.

టైర్ II, టైర్ III నగరాల్లో కూడా వీలైనంత ఎక్కువ మందికి సరసమైన ధరలకు సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతంలో త్రెహాన్ చెప్పారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 03 Nov 2022 01:17 PM (IST) Tags: GMP share price Global Health IPO Medanta

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices: మేజర్‌ క్రిప్టోలు పైకి.. మైన్‌ కాయిన్లు కిందకి! రూ.25వేలు పెరిగిన BTC

Cryptocurrency Prices: మేజర్‌ క్రిప్టోలు పైకి.. మైన్‌ కాయిన్లు కిందకి! రూ.25వేలు పెరిగిన BTC

New Rules from December 2022: గ్యాస్‌ ధరల్లో మార్పు! డిసెంబర్లో మారుతున్న ఆర్థిక నిబంధనలు!

New Rules from December 2022: గ్యాస్‌ ధరల్లో మార్పు! డిసెంబర్లో మారుతున్న ఆర్థిక నిబంధనలు!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

Stock Market Opening: జీడీపీ డేటా టెన్షన్‌! ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సెన్సెక్స్‌, నిఫ్టీ!

Stock Market Opening: జీడీపీ డేటా టెన్షన్‌! ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సెన్సెక్స్‌, నిఫ్టీ!

Petrol-Diesel Price, 30 November 2022: పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్- తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలపై ఎఫెక్ట్‌!

Petrol-Diesel Price, 30 November 2022: పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్- తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలపై ఎఫెక్ట్‌!

టాప్ స్టోరీస్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్