(Source: ECI/ABP News/ABP Majha)
Gautam Adani: డబ్బు సంపాదనలో మస్క్‌ను మించిన అదానీ - అంబానీకి కూడా చేతకాలేదు
Adani News: అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ (Adani Group’s Market Capitalisation) ఒక్కరోజులో రూ.64,500 కోట్లు పెరిగింది.
Gautam Adani Networth: అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు (03 జనవరి 2024) గౌతమ్ అదానీకి కొత్త అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. కోర్టు తీర్పునకు ముందు, తర్వాత కూడా అదానీ స్టాక్స్ భారీగా పెరిగాయి. దీంతో, ఒక్క రోజులో అత్యధిక ఆదాయం సంపాదించిన వ్యక్తిగా గౌతమ్ అదానీ వార్తల్లో నిలిచారు.
ఒక్క రోజు లాభాల రేస్‌లో, ఫోర్బ్స్ బిలియనీర్ లిస్ట్‌లోని సంపన్నులందరినీ భారతీయ వ్యాపారవేత్త & అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ ఓడించారు. ప్రపంచ నంబర్ 1 ఎలాన్ మస్క్‌ను కూడా అదానీ కంటే వెనుకబడ్డారు. ప్రపంచ ధనవంతుల ర్యాంకింగ్స్‌లో పైకి దూసుకెళ్లిన భారతీయ బిలియనీర్, దేశంలోని అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీకి గట్టి పోటీగా నిలిచారు. ఇదంతా కేవలం ఒక్కరోజులోనే జరిగింది.
కొత్త ఏడాది - కొత్త 'ఫార్చ్యూన్'
అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై దర్యాప్తును సెబీ (SEBI) కొనసాగిస్తుందని, కేసుల విచారణను సిట్/సీబీఐకి బదిలీ చేయబోమని, బుధవారం, సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు అదానీకి అనుకూలంగా ఉంది. దీంతో, బుధవారం, అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ (Adani Group’s Market Capitalisation) ఒక్కరోజులో రూ.64,500 కోట్లు పెరిగింది. ఆ ఒక్క రోజులోనే గౌతమ్ అదానీ నికర విలువ (Gautam Adani Net Worth) 3.6 బిలియన్ డాలర్లు పెరిగింది.
ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ (Forbes Billionaires List) ప్రకారం, ప్రస్తుతం, గౌతమ్ అదానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 16వ స్థానంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. 66 ఏళ్ల ముకేశ్ అంబానీ ఇప్పటికీ భారతదేశంలో అత్యంత ధనవంతుడు.
మరో ఆసక్తికర కథనం: ప్రజల ఆశలపై పెట్రోల్ చల్లిన ప్రభుత్వం, పైసా కూడా తగ్గించదట
గౌతమ్ అదానీ సంపద విలువ (Gautam Adani's wealth value)
బుధవారం రోజు, ముకేష్ అంబానీ నికర విలువ (Mukesh Ambani Net Worth) 983 మిలియన్ డాలర్లు తగ్గింది. ఇది, అంబానీ మొత్తం సంపదనలో 0.98 శాతం క్షీణత. అదే సమయంలో, గౌతమ్ అదానీ నికర విలువ 3.6 బిలియన్ డాలర్లు పెరిగింది, ఇది ఆయన మొత్తం సంపదలో 4.90 శాతం వృద్ధి.
ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా ప్రకారం, ప్రస్తుతం, గౌతమ్ అదానీ సంపద విలువ 77.4 బిలియన్ డాలర్లు.
ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్‌లో, 244.1 బిలియన్ డాలర్ల ఆస్తిపాస్తులతో ఎలాన్ మస్క్ (Elon Musk Net Worth) మొదటి స్థానంలో ఉన్నారు. బుధవారం ట్రేడింగ్‌లో అతని నికర విలువ 7.1 బిలియన్ డాలర్లు తగ్గింది, ఇది అతని మొత్తం నికర విలువలో 2.84 శాతం క్షీణత. 52 ఏళ్ల అమెరికన్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. కానీ, భారతదేశానికి చెందిన గౌతమ్ అదానీ ఒక్కరోజు సంపాదనలో అతనిని అధిగమించారు.
మరో ఆసక్తికర కథనం: భాగ్యనగరంలో సొంతింటికి పెరిగిన డిమాండ్, లగ్జరీ గృహాలకు యమా గిరాకీ