News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Forex: మళ్లీ పడిపోయిన ఫారిన్‌ కరెన్సీ నిల్వలు, విదేశీ వాణిజ్యంలో ఊగిసలాట

ఫారిన్‌ కరెన్సీ నిల్వలు ఇప్పటికీ వాటి చారిత్రక గరిష్ఠ స్థాయి కంటే దాదాపు 52 బిలియన్ డాలర్లు తక్కువలో ఉన్నాయి.

FOLLOW US: 
Share:

India's Forex Reserves: భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు మళ్లీ తగ్గాయి. బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా ప్రకారం, ఈ నెల 9వ తేదీతో (జూన్ 9, 2023) ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 1.31 బిలియన్ డాలర్లు తగ్గి 593.74 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీనికిముందు వారంలో ఫారెక్స్‌ రిజర్వ్స్‌ బలంగా పెరిగాయి. 2023 మే 26వ తేదీతో ముగిసిన వారంలో నమోదైన 589.13 బిలియన్ డాలర్ల నుంచి, 2023 జూన్ 2తో ముగిసిన వారానికి 5.92 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి, 595.06 బిలియన్ డాలర్లకు చేరాయి.

మన దేశంలో ఫారిన్‌ కరెన్సీ నిల్వలు ఇప్పటికీ వాటి చారిత్రక గరిష్ఠ స్థాయి కంటే దాదాపు 52 బిలియన్ డాలర్లు తక్కువలో ఉన్నాయి. అయితే, ఈ అంతరం క్రమంగా తగ్గుతూ వస్తోంది. అంటే, భారత విదేశీ వాణిజ్యం ‍‌(India's Foreign Trade) పెరుగుతోంది.

RBI డేటా ప్రకారం, జూన్‌ 9తో ముగిసిన వారంలో, మన దేశంలో విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets) 1.12 బిలియన్‌ డాలర్ల క్షీణతతో 525.07 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. జూన్ 2తో ముగిసిన వారంలో ఇవి 526.20 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ అంటే.. విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల విలువ. అమెరికన్‌ డాలర్ల రూపంలో ఈ విలువను చెబుతారు.

దేశంలో బంగారం నిల్వలు (Gold reserves In India) కూడా తగ్గుముఖం పట్టాయి. సమీక్ష కాల వారంలో 183 మిలియన్ డాలర్లు తగ్గి 45.37 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. IMF వద్ద ఉన్న ఇండియా గోల్డ్‌ రిజర్వ్స్‌ 8 మిలియన్ డాలర్లు తగ్గి 5.11 బిలియన్ డాలర్లకు దిగి వచ్చాయి. అంతకుముందు వారంలో అవి 5.12 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 

శుక్రవారం (జూన్ 16, 2023), అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడింది. డాలర్‌తో రూపాయి ఎక్సేంజ్‌ వాల్యూ 25 పైసలు మెరుగుపడి రూ. 81.94 వద్ద ముగిసింది. 

ఆల్ టైమ్ హై లెవెల్ ఇది
భారతదేశ విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్‌ నెలలో అత్యధిక స్థాయికి, 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది, ఆల్‌ టైమ్‌ హై రికార్డ్‌. అప్పటి నుంచి RBI వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టాయి. 2022 సంవత్సరం ప్రారంభంలోనూ, మన దేశ విదేశీ మారక నిల్వలు 633 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వివిధ ప్రతికూల కారణాల వల్ల విదేశీ పెట్టుబడిదార్లు భారత్‌లోని తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుని డాలర్ల రూపంలో ఆ డబ్బును వెనక్కు తీసుకెళ్లారు. ఈ కారణంగా, విదేశీ మారక నిల్వలు తగ్గుతూ వచ్చాయి, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఉత్పన్నమయిన ప్రపంచ ఉద్రిక్తతలు కూడా మన దేశ ఫారెక్స్‌ రిజర్వ్స్‌పై ప్రభావం చూపాయి. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ముడి చమురు కొనుగోళ్ల కోసం డాలర్ల రూపంలో ఎక్కువగా వ్యయం చేయాల్సి వచ్చింది. 2022లో US ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రారంభించడంతో విదేశీ పెట్టుబడిదార్లు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో, రూపాయి విలువలో బలహీనత కనిపించింది. ఆ సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 శాతం పడిపోయి రూ.83 కనిష్ట స్థాయికి చేరుకుంది. రూపాయికి మద్దతు ఇవ్వడానికి, ఆర్‌బీఐ డాలర్లను విక్రయించాల్సి వచ్చింది. ఈ కారణంగానూ విదేశీ మారక నిల్వలు క్షీణించాయి.

ఏ దేశంలోనైనా, సౌకర్యవంతమైన స్థాయిలో ఉండే విదేశీ మారక నిల్వలు ఆ దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి. విదేశీ మారక నిల్వల్లో క్షీణతను ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిగా చూడాలి. నిల్వలు పెరుగుతుంటే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలపడుతున్నాయని భావించాలి.

మరో ఆసక్తికర కథనం: 5,876 రూపాయలకే ప్యూర్‌ గోల్డ్‌, 5 రోజులే ఈ 'గోల్డెన్‌ ఛాన్స్‌' 

Published at : 17 Jun 2023 11:12 AM (IST) Tags: India RBI Economy Forex reserves Forex dollars

ఇవి కూడా చూడండి

Latest Gold-Silver Price 28 September 2023: పాతాళానికి పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price 28 September 2023: పాతాళానికి పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Bank Holiday: గాంధీ జయంతి, దసరా సహా చాలా సెలవులు - అక్టోబర్‌లో బ్యాంకులు సగం రోజులు పని చేయవు

Bank Holiday: గాంధీ జయంతి, దసరా సహా చాలా సెలవులు - అక్టోబర్‌లో బ్యాంకులు సగం రోజులు పని చేయవు

Petrol-Diesel Price 28 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol-Diesel Price 28 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Stocks To Watch 28 September 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Ports, Apollo Hosp, Zee

Stocks To Watch 28 September 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Ports, Apollo Hosp, Zee

Gold-Silver Price 28 September 2023: పసిడిలో భారీ పతనం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price 28 September 2023: పసిడిలో భారీ పతనం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

టాప్ స్టోరీస్

AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు ! గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?

AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు !  గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?

TS Cabinet Agenda : ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?

TS Cabinet Agenda :  ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన