search
×

Gold: 5,876 రూపాయలకే ప్యూర్‌ గోల్డ్‌, 5 రోజులే ఈ 'గోల్డెన్‌ ఛాన్స్‌'

బాండ్ల కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసి, డిజిటల్‌ మోడ్‌లో డబ్బులు చెల్లిస్తే ఒక్కో గ్రాముకు రూ. 50 డిస్కౌంట్‌ లభిస్తుంది.

FOLLOW US: 
Share:

Sovereign Gold Bond Scheme: స్వచ్ఛమైన బంగారాన్ని చౌకగా కొనుగోలు చేసే సువర్ణావకాశం ఇది. RBI సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కింద తక్కువ ధరకే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. 5 రోజుల పాటు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌లో బాండ్‌ ఇష్యూ రేటును కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రాము బంగారం రేటును రూ. 5,926 గా ఫిక్స్‌ చేసింది. సబ్‌స్క్రిప్షన్ తేదీకి ముందున్న మూడు పని దినాల్లో, 999 స్వచ్ఛత కలిగిన బంగారం ముగింపు ధరల సగటు ఆధారంగా ఇష్యూ ధరను నిర్ణయించారు. 

బాండ్ల కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసి, డిజిటల్‌ మోడ్‌లో డబ్బులు చెల్లిస్తే ఒక్కో గ్రాముకు రూ. 50 డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాంటి వాళ్లు గ్రాము బంగారాన్ని రూ. 5,876 కే కొనవచ్చు.

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 మొదటి సిరీస్‌ సబ్‌స్క్రిప్షన్ సోమవారం (2023 జూన్‌ 19) నుంచి ప్రారంభం అవుతుంది, (శుక్రవారం 2023 జూన్ 23) వరకు ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 రెండో సిరీస్ సెప్టెంబర్‌లో జారీ చేస్తారు.

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి?
బంగారాన్ని భౌతిక రూపంలో ఇంట్లో ఉంచుకోవడానికి ప్రజలు సంకోచిస్తారు. దొంగల భయంతో నిద్ర పట్టదు. ఈ అనిశ్చితిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ (SGB Scheme). కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వీటిని జారీ చేస్తుంది. బంగారంలో మదుపు చేయాలనుకనే వాళ్లు ఈ గోల్డ్‌ బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు, గోల్డ్‌ బాండ్లను ఆర్‌బీఐ వద్ద భద్రంగా ఉంచుకోవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను 2015 సంవత్సరంలో ప్రారంభించారు.

ఒక్కో గోల్డ్‌ బాండ్‌ కాల పరిమితి 8 సంవత్సరాలు. గోల్డ్ బాండ్ హోల్డర్‌ కోరుకుంటే, ఈ బాండ్లను 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా రిడీమ్‌ చేసుకోవచ్చు. ఆ రోజు ఉన్న రేటుకు బాండ్లను అమ్మవచ్చు.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను ఎలా కొనాలి?
సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను కొనుగోలు చేయడం చాలా సులభం. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, పోస్టాఫీలు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SHCIL)‍, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (CCIL), గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్చేంజీల (NSE, BSE) ద్వారా దరఖాస్తు చేసుకుని SGBలు పొందవచ్చు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? 
భారతదేశ నివాసితులు, ట్రస్ట్‌లు, HUFలు, స్వచ్ఛంద సంస్థలు సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మైనర్ల తరఫున ఒక గార్డియన్‌ లేదా మరికొందరితో కలిసి ఉమ్మడిగా కూడా వీటిని కొనవచ్చు.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల వల్ల ఏంటి లాభం?
SGBలపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి 2.50% ఫిక్స్‌డ్‌ రేటుతో ‍‌(కూపన్‌ రేట్‌) వడ్డీ చెల్లిస్తారు. బాండ్‌ ఇష్యూ తేదీ నుంచి వడ్డీ రేటు లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఈ వడ్డీని 6 నెలలకు ఒకసారి యాడ్ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్లను ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు.

ఎంత బంగారం కొనవచ్చు?
గోల్డ్‌ బాండ్‌ ద్వారా కనీసం 1 గ్రాము బంగారాన్ని కొనాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు వ్యక్తులు (individuals) కొనుక్కోవచ్చు. HUFలకు (Hindu Undivided Family) కూడా గరిష్ట పరిమితి 4 కిలోలు. ట్రస్టులు, ఆ తరహా సంస్థలకు గరిష్ట పరిమితి 20 కిలోలు.

భౌతిక బంగారం కొనే సమయంలో వర్తించే KYC (Know-your-customer) రూల్సే సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ విషయంలోనూ వర్తిస్తాయి.

మరో ఆసక్తికర కథనం: మీ ఇంట్లో పెళ్లికి ఈపీఎఫ్‌వో డబ్బులిస్తుంది 

Published at : 17 Jun 2023 10:14 AM (IST) Tags: Gold scheme Sovereign Gold Bond Investment Gold

ఇవి కూడా చూడండి

Latest Gold-Silver Prices Today: రూ.72,000 నుంచి కిందకు దిగని పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today: రూ.72,000 నుంచి కిందకు దిగని పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Personal Loan: ఈ టెక్నిక్ తెలిస్తే వెంటనే పర్సనల్ లోన్స్ తీసుకోవటం ఆపేస్తారు..! తక్కువ వడ్డీకే రుణం..

Personal Loan: ఈ టెక్నిక్ తెలిస్తే వెంటనే పర్సనల్ లోన్స్ తీసుకోవటం ఆపేస్తారు..! తక్కువ వడ్డీకే రుణం..

Gold-Silver Prices Today: పసిడి కొనాలంటే పర్స్‌ ఖాళీ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: పసిడి కొనాలంటే పర్స్‌ ఖాళీ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Tax-Free Incomes: ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌ - ITR ఫైల్ చేసే ముందు అప్‌డేట్స్‌ చూసుకోండి

Tax-Free Incomes: ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌ - ITR ఫైల్ చేసే ముందు అప్‌డేట్స్‌ చూసుకోండి

Schemes For Women: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్‌ చేస్తే లాభాల పంట!

Schemes For Women: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్‌ చేస్తే లాభాల పంట!

టాప్ స్టోరీస్

BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!

BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!

Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు

Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు

Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే

Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్