By: ABP Desam | Updated at : 03 Feb 2023 03:41 PM (IST)
Edited By: Arunmali
కోలుకున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్
Fitch Ratings On Adani Group: అదానీ గ్రూప్ స్టాక్స్‌లో భారీ పతనం నేపథ్యంలో, వాటికి ఊరట కలిగించేలా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ (Fitch) నుంచి సానుకూల ప్రకటన వచ్చింది.
అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ స్టాక్స్‌లో గతంలో ఎన్నడూ ఎరుగని పతనం కనిపించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు.. రేట్ చేసిన అదానీ గ్రూప్ కంపెనీలు &ఆయా కంపెనీల సెక్యూరిటీల రేటింగ్స్‌పై హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఎలాంటి ప్రభావం చూపబోదని ఫిచ్ వెల్లడించింది. అదే సమయంలో, అదానీ కంపెనీల నగదు ప్రవాహంపై తన అంచనాలో ఎలాంటి మార్పు లేదని కూడా తెలిపింది.
కోలుకున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్
ఈ వార్త తర్వాత, అదానీ గ్రూప్‌లోని ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises), ఇంట్రా డేలో కాస్త కోలుకుంది. కనిష్ట స్థాయి రూ. 1,017 నుంచి పుంజుకుని మధ్యాహ్నం 2.45 గం. సమయానికి రూ.1,544 వద్ద కదులుతోంది.
అయితే, తాము రేటింగ్ ఇచ్చిన అదానీ గ్రూప్ కంపెనీలను నిశితంగా పరిశీలిస్తామని ఫిచ్ తెలిపింది. ఆ కంపెనీలు తీసుకున్న రుణాలు, దీర్ఘకాలిక రుణ వ్యయాలు, నియంత్రణ లేదా ఏదైనా చట్టపరమైన అంశం లేదా కంపెనీ క్రెడిట్ ప్రొఫైల్‌ను ప్రభావితం చేసే ESGకి సంబంధించిన సమస్యలపై నిఘా ఉంచుతామని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది. దానీ గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్ బాండ్ల మెచ్యూరిటీ స్వల్పకాలంలో జరగబోదని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.
2024 జూన్లో అదానీ పోర్ట్స్ బాండ్లు, 2024 డిసెంబర్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ బాండ్లు, గ్రూప్‌లోని మిగిలిన కంపెనీలు ఇష్యూ చేసిన బాండ్లు 2026లో లేదా ఆ తర్వాత మెచ్యూర్ అవుతాయి.
ఫిచ్ రేటింగ్స్ ఇవి
ఫిచ్ రేటింగ్స్, ప్రస్తుతం అదానీ గ్రూప్‌లోని 8 కంపెనీలకు రేటింగ్ ఇచ్చింది. ఇందులో అదానీ ట్రాన్స్‌మిషన్ BBB-/ Stable పొందింది. అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ జారీ చేసిన సీనియర్ సెక్యూర్డ్ డాలర్ నోట్స్ BBB- రేటింగ్ పొందాయి. అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ సెక్యూర్డ్ డాలర్ నోట్స్ BBB-/ Stable రేటింగ్, అదానీ ట్రాన్స్‌మిషన్ BBB-/ Stable రేటింగ్, అదానీ గ్రీన్ ఎనర్జీ సీనియర్ సెక్యూర్డ్ డాలర్ నోట్స్ BBB-/Stable రేటింగ్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీనియర్ సెక్యూర్డ్ డాలర్ బాండ్స్‌కు BBB-/ Stable రేటింగ్‌ను ఫిచ్ ఇచ్చింది.
దీనికి ముందు, రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ (CRISIL) కూడా ఒక ప్రకటన చేసింది. అదానీ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన అన్ని రేటింగ్స్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Pan-Aadhaar: పాన్-ఆధార్ లింక్ గడువును పొడిగించే ఛాన్స్, మరో 3 నెలలు అవకాశం
Stock Market News: యాక్టివ్‌గా హెచ్‌డీఎఫ్‌సీ - ఒడుదొడుకుల్లో నిఫ్టీ, సెన్సెక్స్!
EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు
SEBI: పెద్ద శుభవార్త, డీమ్యాట్ ఖాతాల్లో నామినేషన్ గడువు పెంపు
PAN- Aadhaar Link: పాన్-ఆధార్ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?
పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ - అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన
Modi Flexis on Flyover: హైదరాబాద్ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోదీ పోస్టర్లు, ఇంకెన్నాళ్లు కడతారని విమర్శలు
మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు
Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!
Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా