అన్వేషించండి

ED Raids Chinese Mobile Companies: చైనా మొబైల్‌ కంపెనీలకు ఈడీ షాకు! 40 ప్రాంతాల్లో సోదాలు

ED Raids Chinese Mobile Companies: చైనీస్‌ మొబైల్‌ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దాడులు తీవ్రతరం చేసింది. మంగళవారం దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టినట్టు తెలిసింది.

ED Raids Chinese Mobile Companies: చైనీస్‌ మొబైల్‌ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దాడులు తీవ్రతరం చేసింది. మంగళవారం దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టినట్టు తెలిసింది. మనీ లాండరింగ్‌ చట్టం ఉల్లంఘన నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నారని సీఎన్‌బీసీ-టీవీ 18 రిపోర్టు చేసింది. చాలా రోజులుగా చైనా మొబైల్‌ కంపెనీలపై ఆదాయపన్ను శాఖ నిఘా వేసింది. కేంద్ర హోం, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖలు సైతం వాటిని క్షుణ్ణంగా గమనిస్తున్నాయి. దాడుల నేపథ్యంలో డిక్సన్‌ టెక్నాలజీ షేర్లు రెండు శాతానికి పైగా పతనమవ్వడం గమనార్హం.

ED seizes Xiaomi's assets: కొన్ని రోజుల క్రితమే చైనా మొబైల్‌ కంపెనీ షియామికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) షాకిచ్చింది! రూ.5551 కోట్ల విలువైన కంపెనీ ఆస్తులను సీజ్‌ చేసింది. డబ్బును అక్రమంగా విదేశాలకు తరలించిన కేసులో ఈడీ చర్యలు తీసుకుంది.

ఫారిన్‌ ఎక్స్‌ఛేజ్‌ మేనేజ్‌మెంట్‌ చట్టాన్ని ఉల్లంఘించడంపై షియామీని ఈడీ ప్రశ్నించింది. షియామి టెక్నాలజీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ పైన చర్యలు తీసుకుంది. సంబంధిత సంస్థ దేశ వ్యాప్తంగా షియామి, ఎంఐ బ్రాండ్లతో మొబైళ్లను విక్రయించే సంగతి తెలిసిందే. 

'చైనాకు చెందిన షియామీ గ్రూప్‌ సబ్సిడరీ కంపెనీ షియామీ ఇండియా. కంపెనీ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.5551 కోట్ల డబ్బును ఈడీ సీజ్ చేసింది' అని దర్యాప్తు సంస్థ తెలిపింది. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో కొన్నాళ్ల నుంచి షియామీ ఇండియాపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. రాయితీల రూపంలో అక్రమంగా డబ్బును విదేశాలకు పంపిస్తున్నారని కేసు నమోదు చేసింది. 2014లో ఆపరేషన్స్‌ ఆరంభించిన ఈ కంపెనీ ఆ మరుసటి ఏడాది నుంచే అక్రమంగా డబ్బు పంపించడం మొదలు పెట్టింది.

'రూ.5551 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని రాయల్టీ పేరుతో షియామీ గ్రూప్‌నకు చెందిన మూడు విదేశీ కంపెనీలకు పంపించింది. చైనాలోని మాతృ సంస్థ ఆదేశాల మేరకే ఇలా చేసింది. అమెరికాలోని కంపెనీలకు పంపించిన డబ్బు వల్ల షియామీ గ్రూప్‌ మొత్తానికీ ప్రయోజనం లభిస్తుంది. షియామీ ఇండియా ఇక్కడ మొబైల్‌ ఫోన్లను తయారు చేస్తోంది. మూడు విదేశీ కంపెనీ సేవలను వాడుకోవడమే లేదు. అలాంటి వాటికి డబ్బులను తరలించింది. రాయల్టీ రూపంలో ఇలా డబ్బును పంపించడం ఫెమా చట్టం ఉల్లంఘన కిందకే వస్తుంది' అని ఈడీ తెలిపింది.

టాప్ హెడ్ లైన్స్

How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
How To Check CIBIL Score In Telugu: పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సిబిల్ స్కోర్‌ ఎలా చెక్ చేసుకోవాలి?
పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సిబిల్ స్కోర్‌ ఎలా చెక్ చేసుకోవాలి?
Bank Holidays in August: ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget