అన్వేషించండి

Cryptocurrency Prices: ఎరుపెక్కిన క్రిప్టో! రూ.5000 తగ్గిన బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices Today, 29 December 2022: క్రిప్టో మార్కెట్లు గురువారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.40 శాతం తగ్గింది.

Cryptocurrency Prices Today, 29 December 2022: 

క్రిప్టో మార్కెట్లు గురువారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.40 శాతం తగ్గి రూ.13.75 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.26.47 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 0.38 శాతం పెరిగి రూ.99,453 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.11.98 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.01 శాతం పెరిగి రూ.82.82,  బైనాన్స్‌ కాయిన్‌ 1.07 శాతం పెరిగి రూ.20,392, యూఎస్‌డీ కాయిన్‌ 0.02 శాతం తగ్గి 82.85, రిపుల్‌ 1.07 శాతం పెరిగి రూ.28.74, బైనాన్స్‌ యూఎస్‌డీ 0.01 శాతం తగ్గి రూ.82.87 వద్ద కొనసాగుతున్నాయి. డెంట్‌, బ్యాండ్‌ ప్రొటొకాల్‌, వింక్‌లింక్‌, డెక్సీ, ఇంటర్‌నెట్‌ కంప్యూటర్‌, బిట్‌కాయిన్‌ ఎస్వీ లాభాల్లో ఉన్నాయి. షిడో ఫైనాన్స్‌, ఈకాయిన్‌, అగోరిక్‌, ఐఎస్‌ఓటీ, టెర్రా లూనా క్లాసిక్‌, మెయిడ్‌సేఫ్‌ కాయిన్‌, టాన్‌కాయిన్‌ నష్టపోయాయి. 

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
Sankranti Special Buses : సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
Sankranti Special Buses : సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
498A: అతుల్ సుభాష్‌లా ఆత్మహత్య చేసుకుంటేనే స్పందిస్తారా ? తన సోదరుడి దుస్థితిపై తెలుగు యువతి ఆవేదన - ఈ ప్రశ్నకు బదులేది?
అతుల్ సుభాష్‌లా ఆత్మహత్య చేసుకుంటేనే స్పందిస్తారా ? తన సోదరుడి దుస్థితిపై తెలుగు యువతి ఆవేదన - ఈ ప్రశ్నకు బదులేది?
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Simhachalam Temple: తిరుమల ఎఫెక్ట్..సింహాచలంలో వెనక్కు తగ్గిన భక్తులు..సాఫీగా సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు!
తిరుమల ఎఫెక్ట్..సింహాచలంలో వెనక్కు తగ్గిన భక్తులు..సాఫీగా సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు!
Embed widget