అన్వేషించండి

Cryptocurrency Prices: మళ్లీ రెడ్‌ జోన్లో క్రిప్టో మార్కెట్‌ - బిట్‌కాయిన్‌ రూ.59వేలు డౌన్‌!

Cryptocurrency Prices Today, 24 May 2023: క్రిప్టో మార్కెట్లు బుధవారం ఎరుపెక్కాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు.

Cryptocurrency Prices Today, 24 May  2023:

క్రిప్టో మార్కెట్లు బుధవారం ఎరుపెక్కాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 2.43 శాతం తగ్గి రూ.22.09 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.42.84 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 2.40 శాతం తగ్గి రూ.1,50,125 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.18.06 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.18 శాతం తగ్గి రూ.82.69, బైనాన్స్‌ కాయిన్‌ 1.83 శాతం తగ్గి రూ.25,529, రిపుల్‌ 0.53 శాతం తగ్గి రూ.37.64, యూఎస్‌డీ కాయిన్‌ 0.24 శాతం తగ్గి రూ.82.71, కర్డానో 1.44 శాతం తగ్గి రూ.30.26, డోజీ కాయిన్ 0.17 శాతం తగ్గి 5.86 వద్ద కొనసాగుతున్నాయి. ఇన్‌సూపర్‌ డెఫి, సేఫ్‌మూన్‌, బ్లాక్స్, మరుమరు ఎన్‌ఎఫ్‌టీ, క్రిప్టాన్‌ డావో, నెర్వస్‌ నెట్‌వర్క్‌, వేవ్స్‌ లాభపడ్డాయి. మల్టీ చెయిన్‌, ఆర్డీ, కస్పా, సూయి, యాక్సెస్‌ ప్రొటొకాల్‌, లుస్కో, స్టెప్‌ఎన్‌  నష్టపోయాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Davos Tour: దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
KTR vs Revanth: ఢిల్లీ వీధుల్లో పులకేశి కొత్త నాటకం, జాగో ఢిల్లీ జాగో - సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
ఢిల్లీ వీధుల్లో పులకేశి కొత్త నాటకం, జాగో ఢిల్లీ జాగో - సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
Naga Chaitanya: చేపల పులుసు వండిన అక్కినేని నాగచైతన్య... అదీ పుల్లల పొయ్యి మీద, వీడియో చూశారా?
చేపల పులుసు వండిన అక్కినేని నాగచైతన్య... అదీ పుల్లల పొయ్యి మీద, వీడియో చూశారా?
Prakash Raj Vs Pawan : పవన్‌ను మళ్లీ కెలుక్కున్న ప్రకాష్ రాజ్ - నటించండి కానీ జీవించొద్దంటున్న బీజేపీ!
పవన్‌ను మళ్లీ కెలుక్కున్న ప్రకాష్ రాజ్ - నటించండి కానీ జీవించొద్దంటున్న బీజేపీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Konaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP DesamAttack on Saif Ali Khan | బాలీవుడ్ బడా హీరోలు టార్గెట్ గా హత్యాయత్నాలు | ABP DesamISRO SpaDEX Docking Successful | అంతరిక్షంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఇస్రో ఉపగ్రహాలు | ABP DesamKTR Attended ED Enquiry | ఫార్మూలా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Davos Tour: దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
KTR vs Revanth: ఢిల్లీ వీధుల్లో పులకేశి కొత్త నాటకం, జాగో ఢిల్లీ జాగో - సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
ఢిల్లీ వీధుల్లో పులకేశి కొత్త నాటకం, జాగో ఢిల్లీ జాగో - సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
Naga Chaitanya: చేపల పులుసు వండిన అక్కినేని నాగచైతన్య... అదీ పుల్లల పొయ్యి మీద, వీడియో చూశారా?
చేపల పులుసు వండిన అక్కినేని నాగచైతన్య... అదీ పుల్లల పొయ్యి మీద, వీడియో చూశారా?
Prakash Raj Vs Pawan : పవన్‌ను మళ్లీ కెలుక్కున్న ప్రకాష్ రాజ్ - నటించండి కానీ జీవించొద్దంటున్న బీజేపీ!
పవన్‌ను మళ్లీ కెలుక్కున్న ప్రకాష్ రాజ్ - నటించండి కానీ జీవించొద్దంటున్న బీజేపీ!
Kohli In Ranji Trophy: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. రంజీల్లో బరిలోకి కోహ్లీ.. ఆ తేది నుంచి మైదానంలోకి రన్ మేషిన్
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. రంజీల్లో బరిలోకి కోహ్లీ.. ఆ తేది నుంచి మైదానంలోకి రన్ మేషిన్
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్ - ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడి
సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్ - ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడి
Jallikattu : ముగిసిన సంక్రాంతి సంబురాలు - జల్లికట్టు చివరి రోజు ఆరుగురు మృతి - వందల మందికి గాయాలు
ముగిసిన సంక్రాంతి సంబురాలు - జల్లికట్టు చివరి రోజు ఆరుగురు మృతి - వందల మందికి గాయాలు
IPL Ban: టీమిండియా ప్లేయర్లు రూల్స్ పాటించాల్సిందే.. లేకపోతే ఐపీఎల్ నుంచి బ్యాన్..! బీసీసీఐ సంచలన నిర్ణయం!
టీమిండియా ప్లేయర్లు రూల్స్ పాటించాల్సిందే.. లేకపోతే ఐపీఎల్ నుంచి బ్యాన్..! బీసీసీఐ సంచలన నిర్ణయం!
Embed widget