By: ABP Desam | Updated at : 20 Sep 2023 03:06 PM (IST)
క్రిప్టో కరెన్సీ
Cryptocurrency Prices Today:
క్రిప్టో మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.75 శాతం పెరిగి రూ.22.52 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.43.91 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.34 శాతం తగ్గి రూ.1,35,978 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.16.35 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.08 శాతం తగ్గి రూ.83.25, బైనాన్స్ కాయిన్ 0.28 శాతం తగ్గి రూ.18,012, రిపుల్ 1.46 శాతం పెరిగి రూ.42.82, యూఎస్‌డీ కాయిన్ 0.16 శాతం తగ్గి రూ.83.20, లిడో స్టేక్డ్ ఈథర్ 1.34 శాతం తగ్గి రూ.1,35,891, డోజీ కాయిన్ 0.03 శాతం తగ్గి రూ.5.19 వద్ద కొనసాగుతున్నాయి. ఏఆర్కే, మురాసకి, బ్లూజెల్, మెయిన్‌ఫ్రేమ్, టెల్లార్ ట్రైబ్యూట్స్, ఎస్‌టీపీ, ఎక్స్‌డీసీ నెట్‌వర్క్ లాభపడ్డాయి. సీయూఎస్‌డీటీ, ఓపెన్ ఎక్స్‌ఛేంజీ, బ్లాక్స్, రాల్‌బిట్ కాయిన్, టామినెట్, లుస్కో, ఇన్‌సూర్ డెఫీ నష్టపోయాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Gold-Silver Prices Today 05 December 2023: కనుచూపు మేరలో కనిపించని పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Stock Market News Today: రెండు నిమిషాల్లో రూ.4 లక్షల కోట్ల లాభం - మార్కెట్ ర్యాలీ వెనకున్న శక్తులు ఇవే
Share Market Opening Today 04 December 2023: మార్కెట్లో మహా విస్ఫోటనం - సరికొత్త రికార్డ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ
Latest Gold-Silver Prices Today 04 December 2023: చుక్కలు దాటిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Stocks To Watch Today 04 December 2023: ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే 'కీ స్టాక్స్' LIC, Granules, CAMS, Hero
BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ
Chandrababu Srisailam Tour: మిగ్జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
/body>