అన్వేషించండి

Cryptocurrency Prices Today: పొద్దున్నే చుక్కలు చూపించిన క్రిప్టో! BTC రూ.50వేలు డౌన్‌!

Cryptocurrency Prices Today, 17 December 2022: క్రిప్టో మార్కెట్లు శనివారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 4.38 శాతం తగ్గింది.

Cryptocurrency Prices Today, 17 December 2022:

క్రిప్టో మార్కెట్లు శనివారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 4.38 శాతం తగ్గి రూ.13.38 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.26.51 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 7.65 శాతం తగ్గి రూ.97,235 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.11.70 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.13 శాతం తగ్గి రూ.82.71,  బైనాన్స్‌ కాయిన్‌ 12.69 శాతం తగ్గి రూ.18,953, యూఎస్‌డీ కాయిన్‌ 0.25 శాతం పెరిగి 82.69, రిపుల్‌ 6.27 శాతం తగ్గి రూ.29.28, బైనాన్స్‌ యూఎస్‌డీ 0.17 శాతం తగ్గి రూ.82.66 వద్ద కొనసాగుతున్నాయి. కాయిన్‌ మెట్రో, అగోరిక్‌, లియో టోకెన్‌, డావో మేకర్‌, బెల్డెక్స్‌, టోన్‌కాయిన్‌, ఒలింపిస్‌ లాభపడ్డాయి. ట్రస్ట్‌ వాలెట్‌, ఫైల్‌కాయిన్‌, టెర్రా, పాలీమథ్‌, సేఫ్ పాల్‌, సెల్సియస్‌ నెట్‌వర్క్‌, చిలిజ్‌ నష్టపోయాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Embed widget