అన్వేషించండి

Cryptocurrency Prices: జస్ట్‌ రూ.10,000 పెరిగిన బిట్‌కాయిన్‌! మార్కెట్లో స్తబ్దత!

Cryptocurrency Prices Today, 12 July 2023: క్రిప్టో మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు.

Cryptocurrency Prices Today, 12 July 2023:

క్రిప్టో మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.89 శాతం పెరిగి రూ.25.26 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.49.06 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 1.82 శాతం పెరిగి రూ.1,55,265 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.18.66 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.07 శాతం తగ్గి రూ.82.35, బైనాన్స్‌ కాయిన్‌ 0.61 శాతం పెరిగి రూ.20,419, రిపుల్‌ 0.04 శాతం పెరిగి రూ.38.97, యూఎస్‌డీ కాయిన్‌ 0.07 శాతం తగ్గి రూ.82.28, లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.90 శాతం పెరిగి రూ.1,55,418, డోజీ కాయిన్ 0.02 శాతం తగ్గి రూ.5.37 వద్ద కొనసాగుతున్నాయి. సెంట్రిఫ్యూజ్‌, వ్రాప్డ్‌ సెంట్రీప్యూజ్‌, రిబ్బన్ ఫైనాన్స్‌, స్టీమ్‌, నెమ్‌, రాల్‌బిట్‌ కాయిన్‌, బిట్‌జెర్ట్‌ కాయిన్లు పెరిగాయి. వెర్జ్‌, కార్టెసి, మినా ప్రొటొకాల్‌, ఆకాశ్ నెట్‌వర్క్‌, జోయ్‌, బెల్డ్‌ఎక్స్‌, వేవ్స్‌ నష్టపోయాయి. 

హెచ్చుతగ్గులు ఉంటాయి


క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Also Read: ఇంటి రిపేర్‌కు లోన్‌ వస్తుంది - ఇంట్రెస్ట్‌ రేట్లు, టాక్స్‌ బెనిఫిట్స్‌ గురించి తెలుసుకోండి

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రేవంత్ రెడ్డీ..  నీ వీపు పగలడం పక్కా..!Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
Embed widget