By: ABP Desam | Updated at : 12 Jul 2023 01:22 PM (IST)
హోమ్ రెనోవేషన్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు, టాక్స్ బెనిఫిట్స్
Home Renovation Loan: కొత్త ఇల్లు కొనడానికి లేదా కట్టుకోవడానికే కాదు.. పాత ఇంటి రూపరేఖల్ని కొత్తగా మార్చడానికి కూడా బ్యాంకులు, NBFC కంపెనీలు లోన్స్ ఇస్తాయి. వాటిని హోమ్ రెనోవేషన్ లోన్/ గృహ పునరుద్ధరణ రుణం అంటారు.
మీ పాత ఇంటిని లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్లుగా డిజైన్ చేయాలనుకున్నా, మేజర్ మరమ్మతులు చేయించాలనుకున్నా, రూమ్స్ పెంచుకోవాలనుకున్నా, ఇంటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలనుకున్న ఈ రుణం తీసుకోవచ్చు. ఉదాహరణకు.. మీ ఇంటి వంటగది, బాత్‌రూమ్, బెడ్‌రూమ్‌ను పునర్నిర్మించినా, కొత్త గదిని నిర్మించినా, మీ ఇంటి ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ వ్యవస్థలు మార్చాలనుకున్నా హోమ్ రెనోవేషన్ లోన్ కోసం వెళ్లవచ్చు.
ఈ లోన్ చాలా పాపులర్ అయింది. హోమ్ లోన్స్ తరహాలోనే హోమ్ రెనోవేషన్ లోన్స్‌ను తీసుకునే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు). హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFCలు) ఈ లోన్స్ అందిస్తున్నాయి.
హోమ్ రెనోవేషన్ లోన్ కోసం అప్లై చేస్తే ఎంత రుణం లభిస్తుంది?
హోమ్ రెనోవేషన్ లోన్ కోసం మీరు అప్లై చేస్తే, రూ. 25 లక్షల వరకు రుణం లభిస్తుంది. అయితే, కచ్చితంగా ఎంత మొత్తం శాంక్షన్ అవుతుందన్నది బ్యాంకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కస్టమర్ ఆదాయం, క్రెడిట్ హిస్టరీ, ఆస్తిపాస్తులు, ఇంటి విలువ, ఇతర డాక్యుమెంట్స్ ఆధారంగా లోన్ అమౌంట్‌ను బ్యాంకర్ నిర్ణయిస్తారు.
హోమ్ రెనోవేషన్ లోన్ వడ్డీ రేటు ఎంత ఉంటుంది?
గృహ పునరుద్ధరణ కోసం లోన్ తీసుకుంటే, గృహ రుణం కంటే ఎక్కువ వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తాయి. వీటిని ఫ్లోటింగ్ ఇంట్రస్ట్ రేట్లతో లింక్ చేస్తారు. అయితే, పర్సనల్ లోన్స్‌తో రుణాలతో పోలిస్తే దీని వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. సాధారణంగా... హోమ్ రెనోవేషన్ లోన్ వడ్డీ రేటు 8-12 శాతం వరకు ఉంటుంది. రుణం చెల్లింపు గడువు 20 సంవత్సరాల వరకు ఉంటుంది.
హోమ్ రెనోవేషన్ లోన్ అర్హతలు
హోమ్ రెనోవేషన్ లోన్ తీసుకోవాలంటే తప్పనిసరిగా భారతదేశ పౌరుడై ఉండాలి. రెగ్యులర్ ఇన్‌కమ్ సోర్స్ ఉండాలి. వయస్సు 21 సంవత్సరాలకు తగ్గకూడదు. క్రెడిట్ స్కోర్ కూడా బాగుండాలి. లోన్ తీసుకునే వ్యక్తి, తన ఆదాయ మార్గాలకు సంబంధించిన డాక్యుమెంట్లను బ్యాంకర్‌కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
హోమ్ రెనోవేషన్ లోన్ తీసుకోవాలంటే ఏ పత్రాలు అవసరం?
కస్టమర్ వ్యక్తిగత గుర్తింపు, చిరునామా, ఆదాయం, ఉపాధికి సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్స్ సమర్పించాలి. ఆస్తి యాజమాన్యానికి సంబంధించిన రుజువు, రిపేర్ ఎస్టిమేషన్స్‌ను కూడా అందించాలి.
హోమ్ రెనోవేషన్ లోన్‌పై పన్ను మినహాయింపు
హోమ్ రెనోవేషన్ లోన్ తీసుకుంటే, ఇన్‌కమ్ టాక్స్ సెక్షన్ 24B కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరానికి రూ. 30,000 వరకు వడ్డీని క్లెయిమ్ చేసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: PPF vs FD - ఏ స్కీమ్‌లో మీరు ఎక్కువ ఆదాయం పొందుతారు?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Year Ender 2024: హ్యుందాయ్ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్ చేసిన IPOల లిస్ట్
Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?
Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్ బ్యాంక్‌లు - హోమ్ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం