By: ABP Desam | Updated at : 12 Jul 2023 12:54 PM (IST)
PPF vs FD - ఏ స్కీమ్‌లో మీరు ఎక్కువ ఆదాయం పొందుతారు?
PPF vs FD Scheme: సంపాదించిన డబ్బును వృద్ధి చేయాలంటే దానిని సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం ముఖ్యం. మార్కెట్‌లో ప్రస్తుతం చాలా ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు.
ఈ రెండు స్కీమ్స్ మార్కెట్ రిస్క్‌కు దూరంగా ఉంటాయి. ద్రవ్యోల్బణం కారణంగా, ఆర్‌బీఐ గత ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును పెంచింది. దీనికి అనుగుణంగా, చాలా బ్యాంకులు లాంగ్‌టర్మ్ ఇన్వెస్టర్లకు 8 నుంచి 9 శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. పీపీఎఫ్ మీద ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఇప్పుడు, ఈ రెండింటిలో దేని ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు?.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్ అనేది, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఒకటి. ఈ పథకంపై వడ్డీ రేటును ప్రతి త్రైమాసికంలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ స్కీమ్‌లో డిపాజిట్స్ చేస్తే, ఉద్యోగం లేకపోయినా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ పథకం కింద 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ. 500 - గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, కావాలనుకుంటే, మెచ్యూరిటీ డేట్‌ను మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తంపై ఏడాదికి 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. డిపాజిట్ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీ పూర్తిగా టాక్స్ ఫ్రీ. దీంతో పాటు, స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తంపై ఇన్‌కమ్ టాక్స్ సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్
దేశంలోని అన్ని ప్రైవేట్ & గవర్నమెంట్ బ్యాంకులు FD వడ్డీ రేట్లను పెంచాయి. దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ FD స్కీమ్స్ మీద 3 శాతం నుంచి 6.50 శాతం వరకు ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.50 శాతం వరకు చెల్లిస్తోంది. స్పెషల్ స్కీమ్ అమృత్ కలశ్ పథకం కింద, సాధారణ కస్టమర్లకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 7.60 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది.
HDFC బ్యాంక్ కూడా 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు FDపై సాధారణ పౌరులకు 3 శాతం నుంచి 7 శాతం వరకు, సీనియర్ సిటిజన్స్‌కు 3.50 శాతం నుంచి 7.75 శాతం వరకు ఇంట్రస్ట్ చెల్లిస్తోంది.
PPF Vs FD స్కీమ్
వడ్డీ రేటు గురించి మాట్లాడుకుంటే, PPF స్కీమ్‌లో చక్రవడ్డీ రాబడి వస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో, సాధారణ వడ్డీ లేదా చక్రవడ్డీ రేటులో ఏదైనా వర్తించవచ్చు. మీరు షార్ట్‌టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ప్లాన్ చేస్తుంటే FD ఒక మంచి ఆప్షన్ అవుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనుకుంటే PPF పథకం మంచి ఎంపికగా నిలుస్తుంది.
మరో ఆసక్తికర కథనం: నేడు టీసీఎస్ రిజల్ట్స్ - రిపోర్ట్ కార్డ్‌లో చూడాల్సిన 6 కీ పాయింట్స్ ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
PF Salary Limit: పీఎఫ్ జీతాల పరిమితి 25-30 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం! దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?
World Cheapest Silver Price: ప్రపంచంలో అత్యంత చౌకగా వెండి లభించే దేశం ఏదీ? భారత్ కంటే 40 వేల రూపాయల వరకు తక్కువ!
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Nimmala Ramanaidu: పోలవరం - నల్లమలసాగర్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. లీగల్ టీంతో మంత్రి నిమ్మల సమీక్ష
Khammam Cyber Crime: రూ. 547 కోట్ల అంతర్జాతీయ సైబర్ మోసాలు.. సత్తుపల్లికి చెందిన గ్యాంగ్ అరెస్ట్
TVK Vijay: జననాయగన్‌కు ఆటంకాలు - విజయ్‌కే సానుభూతి - అన్నీ అలా కలసి వస్తున్నాయా?
8th Pay commission: 8వ వేతన సంఘం సిఫార్సులు అమలు ఎప్పుడు? జీతాలు పెరిగేది ఎప్పుడంటే