News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Cryptocurrency Prices: క్రిప్టో విలవిల! బిట్‌కాయిన్‌ 5.36% పతనం - రూ.2.5 లక్షలు తగ్గిన Mcap

Cryptocurrency Prices Today, 08 November 2022: క్రిప్టో మార్కెట్లు నేడు విలవిల్లాడుతున్నాయి. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 5.36 శాతం తగ్గి రూ.16.08 లక్షల వద్ద కొనసాగుతోంది.

FOLLOW US: 
Share:

Cryptocurrency Prices Today, 08 November 2022: క్రిప్టో మార్కెట్లు నేడు విలవిల్లాడుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 5.36 శాతం తగ్గి రూ.16.08 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.30.87 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 6.77 శాతం తగ్గి రూ.1,20,641 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.14.54 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.43 శాతం తగ్గి రూ.81.67, యూఎస్‌డీ కాయిన్‌ 0.46 శాతం తగ్గి 81.56, బైనాన్స్‌ కాయిన్‌ 0.42 శాతం తగ్గి రూ.26,735, రిపుల్‌ 7.07 శాతం తగ్గి రూ.35.84, బైనాన్స్‌ యూఎస్‌డీ 0.42 శాతం తగ్గి రూ.81.62 వద్ద కొనసాగుతున్నాయి. హ్యాష్ ఫ్లో, ఈకాయిన్‌, రీఫ్‌, డీసెంట్రలైజ్డ్‌ సోషల్‌, డీక్సీ, స్విస్‌ బ్రాగ్‌, చైన్‌ లింక్‌ ఎగిశాయి. కాయిన్‌ మెట్రో, రెండర్‌, ఎఫ్టీఎక్స్‌, మాస్క్‌ నెట్‌వర్క్‌, ఎండెక్స్‌, కాన్‌స్టిట్యూషన్‌ డావో, డోజీ కాయిన్‌ పతనమయ్యాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 08 Nov 2022 05:51 PM (IST) Tags: Bitcoin Cryptocurrency Prices Ethereum Litecoin Ripple Dogecoin cryptocurrency

ఇవి కూడా చూడండి

Renovation Loan: మీ పాత ఇంటిని కొత్తగా మార్చేయండి - రెనోవేషన్‌ లోన్‌ రేట్లు, టాక్స్‌ బెనిఫిట్స్‌ ఇవిగో!

Renovation Loan: మీ పాత ఇంటిని కొత్తగా మార్చేయండి - రెనోవేషన్‌ లోన్‌ రేట్లు, టాక్స్‌ బెనిఫిట్స్‌ ఇవిగో!

Cryptocurrency Prices: రెండు వేలు తగ్గిన బిట్‌కాయిన్‌! మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టోలు

Cryptocurrency Prices: రెండు వేలు తగ్గిన బిట్‌కాయిన్‌! మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టోలు

Sugar Stocks: పెట్టుబడిని పరుగులు పెట్టించిన షుగర్‌ స్టాక్స్‌, ఇదంతా ఇథనాల్‌ ఎఫెక్టా?

Sugar Stocks: పెట్టుబడిని పరుగులు పెట్టించిన షుగర్‌ స్టాక్స్‌, ఇదంతా ఇథనాల్‌ ఎఫెక్టా?

Rs 2 Lakh Pension: మీరు 40ల్లోకి వచ్చారా, రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.2 లక్షల పెన్షన్ పొందాలంటే ఇప్పుడెంత పెట్టుబడి పెట్టాలి?

Rs 2 Lakh Pension: మీరు 40ల్లోకి వచ్చారా, రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.2 లక్షల పెన్షన్ పొందాలంటే ఇప్పుడెంత పెట్టుబడి పెట్టాలి?

Ambani Children Salary: తండ్రి బాటలోనే తనయులు, ముకేష్‌ అంబానీ వారసుల జీతం ఎంతో తెలుసా?

Ambani Children Salary: తండ్రి బాటలోనే తనయులు, ముకేష్‌ అంబానీ వారసుల జీతం ఎంతో తెలుసా?

టాప్ స్టోరీస్

Supreme Court: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో మరో బెంచ్‌కు

Supreme Court: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో మరో బెంచ్‌కు

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో