IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

Cryptocurrency Prices Today: ఎకాఎకిన లక్ష తగ్గిన బిట్‌కాయిన్‌! క్రిప్టోల్లో ఏం జరుగుతోంది?

Cryptocurrency Prices Today, 08 May 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 3.83 శాతం తగ్గి రూ.28.06 లక్షల వద్ద కొనసాగుతోంది. ఒక రోజులోనే లక్ష వరకు తగ్గింది.

FOLLOW US: 

Cryptocurrency Prices Today, 08 May 2022: క్రిప్టో మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 3.83 శాతం తగ్గి రూ.28.06 లక్షల వద్ద కొనసాగుతోంది. ఒక రోజులోనే లక్ష వరకు తగ్గింది. మార్కెట్‌ విలువ రూ.52.79 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 2.07 శాతం తగ్గి రూ.2,07,037 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.24.96 లక్షల కోట్లుగా ఉంది. 

టెథెర్‌ 0.04 శాతం పెరిగి రూ.81.41, బైనాన్స్‌ కాయిన్‌ 4.46 శాతం తగ్గి రూ.29,282, యూఎస్‌డీ కాయిన్‌ 0.06 శాతం పెరిగి 81.45, సొలానా 3.54 శాతం తగ్గి రూ.6,351, రిపుల్‌ 4.20 శాతం తగ్గి  రూ.46.58 వద్ద కొనసాగుతున్నాయి. అల్గోరాండ్‌, యాక్సీ ఇన్ఫినిటీ, ట్రాన్‌, నానో, టెజోస్‌, ఫెచ్‌ ఏఐ, సివిక్‌ 1 నుంచి 6 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. కైబర్‌ నెట్‌వర్క్‌, టెర్రా, ఓక్స్‌, ఠీటా ఫ్యూయెల్‌, అయిలెఫ్‌, మెటల్‌, డీఎఫ్‌ఐ మనీ 7 నుంచి 14 శాతం వరకు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Published at : 08 May 2022 11:55 AM (IST) Tags: Bitcoin cryptocurrency Cryptocurrency Prices Ethereum Litecoin Ripple Dogecoin

సంబంధిత కథనాలు

Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ

Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ

World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?

World Costliest Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ఏకంగా రూ.1108 కోట్లు - దీని ప్రత్యేక ఏంటంటే?

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

Stock Market Weekly Review: గతవారం నష్టంతో పోలిస్తే రూ.10 లక్షల కోట్లు మిగిలినట్టే!

Stock Market Weekly Review: గతవారం నష్టంతో పోలిస్తే రూ.10 లక్షల కోట్లు మిగిలినట్టే!

Mahindra Scorpio N: కొత్త మహీంద్రా స్కార్పియో లాంచ్ అయ్యేది అప్పుడే - ప్రకటించిన కంపెనీ!

Mahindra Scorpio N: కొత్త మహీంద్రా స్కార్పియో లాంచ్ అయ్యేది అప్పుడే - ప్రకటించిన కంపెనీ!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!

MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి