By: ABP Desam | Updated at : 05 Jul 2022 03:02 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ ధరలు ( Image Source : RODNAE Productions/Pexels )
Cryptocurrency Prices Today, 5 July 2022: క్రిప్టో మార్కెట్లు నేడు లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 3.95 శాతం పెరిగి రూ.16.12 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.29.96 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 8.24 శాతం పెరిగి రూ.92,000 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.10.67 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.04 శాతం పెరిగి రూ.81.22, యూఎస్‌డీ కాయిన్ 0.02 శాతం పెరిగి 83.89, బైనాన్స్ కాయిన్ 5.70 శాతం పెరిగి రూ.18,763, రిపుల్ 1.82 శాతం పెరిగి రూ.27.13, కర్డానో 2.48 శాతం పెరిగి రూ.38.48 వద్ద కొనసాగుతున్నాయి. పాలీగాన్, కాస్మోస్, బేసిక్ అటెన్షన్, యూనిస్వాప్, ఎన్‌జిన్ కాయిన్, లూప్‌రింగ్, యార్న్ ఫైనాన్స్ 9-11 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. న్యూమరైర్, ఆర్జిన్ ప్రొటో, అయిలెఫ్, సింథెటిక్స్, యూఎంఏ, నెమ్, రిక్వెస్ట్ 2-13 శాతం వరకు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!
CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన
Ola Electric Car: చూడగానే కొనాలనిపించే ఓలా ఎలక్ట్రిక్ కారు - కేవలం నాలుగు సెకన్లలోనే - మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్లు!
Ola New Electric Scooter: ఓలా - కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరిపోలా - ఈసారి తక్కువ ధరలోనే!
ఖాతాదారులకు ఎస్బీఐ షాకింగ్ న్యూస్, నేటి నుంచి ఈఎంఐల బాదుడు!
Horoscope Today 16th August 2022: ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!