By: ABP Desam | Updated at : 23 Jul 2022 06:52 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ ధరలు ( Image Source : Getty )
Cryptocurrency Prices Today, 23 July 2022: క్రిప్టో మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 5.55 శాతం తగ్గి రూ.18.70 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.34.59 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 6.49 శాతం తగ్గి రూ.1,27,994 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.15.14 లక్షల కోట్లుగా ఉంది. ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా బిట్‌కాయిన్ హోల్డింగ్స్‌లో 75 శాతం విక్రయించడమే పతనానికి కారణంగా తెలుస్తోంది.
టెథెర్ 0.04 శాతం పెరిగి రూ.83.50, యూఎస్‌డీ కాయిన్ 0.05 శాతం పెరిగి 84.98, బైనాన్స్ కాయిన్ 4.82 శాతం తగ్గి రూ.22,069, రిపుల్ 3.87 శాతం తగ్గి రూ.30.26, కర్డానో 4.93 శాతం తగ్గి రూ.40.93 వద్ద కొనసాగుతున్నాయి. యాక్సీ ఇన్ఫినిటీ, ఈఓఎస్, ఎథీరియమ్ కాయిన్, నెమ్, డీసెంట్రల్‌ల్యాండ్, ఫాంటామ్, డీఎఫ్‌ఐ మనీ 1-5 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. హార్మనీ, న్యూమరైర్, నియో, సింథెటిక్స్, కర్వ్ డావో, డిజీబైట్, కాస్మోస్ 8-10 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Petrol-Diesel Price, 15 August: నేడు గుడ్‌న్యూస్! చాలా చోట్ల దిగువకు పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ నగరాల్లో మాత్రం స్థిరంగా
Gold-Silver Price: గోల్డ్ కొనే ప్లాన్ ఉందా? నేటి బంగారం, వెండి ధరలు ఇక్కడ తెలుసుకోండి
Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!
Tax Regime in India: టాక్స్ పేయర్స్ అలర్ట్! మినహాయింపుల్లేని పన్ను వ్యవస్థకు మోదీ సర్కార్ కసరత్తు!
Rakesh Jhunjhunwala Dance: మరణం ముందు ఖజురారే పాటకు ఝున్‌ఝున్‌వాలా డాన్స్! కన్నీరు పెట్టిస్తున్న వీడియో!!
Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం
Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్
Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?
TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం