By: ABP Desam | Updated at : 13 Jan 2022 08:59 PM (IST)
Cryptocurrency_price_today
Cryptocurrency Prices Today, 13 January 2022: క్రిప్టో మార్కెట్లు గురువారం మందకొడిగా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 0.28 శాతం పెరిగి రూ.34.92 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.61.92 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 0.14 శాతం తగ్గి రూ.2,67,396 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.29.63 లక్షల కోట్లుగా ఉంది.
బైనాన్స్ కాయిన్ 0.13 శాతం తగ్గి రూ.38,393, టెథెర్ 0.04 శాతం పెరిగి రూ.80.10, సొలానా 5.62 శాతం పెరిగి రూ.12,330, కర్డానో 1.00 శాతం పెరిగి రూ.103 యూఎస్‌డీ కాయిన్ 0.02 శాతం పెరిగి 80.06 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాండ్ ప్రొటొ, లించ్, సొలానా, డోజీకాయిన్, ఒమిస్‌గో, టెర్రా, ఫెచ్ ఏఐ 3 నుంచి 10 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. ఇంటర్నెట్ కో, ఎల్‌రాండ్, ఎయిర్‌స్వాప్, కాస్మోస్, గాలా, చైన్‌లింక్, అల్గొరాండ్ 3 నుంచి 8 శాతం వరకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Gold-Silver Price Today 04 June 2023: కొండ దిగొచ్చిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
Taiwanese Shipping Firms: ఉద్యోగులకు షిప్పింగ్ కంపెనీల బంపర్ ఆఫర్లు, మందగమనంలో ఉన్నా మస్తు బోనస్‌లు
FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీలో కోత, ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్ ఉందేమో చూసుకోండి
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ లోన్ కావాలా, మీ కోసమే ఈ గుడ్‌న్యూస్
Mutual Funds: స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్ క్యాప్ ఫండ్స్, మూడేళ్లలో 65% రిటర్న్
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?