By: ABP Desam | Updated at : 06 Apr 2022 04:06 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఒక్క రోజులో లక్ష కోట్లు తగ్గిన బిట్‌కాయిన్ విలువ!
Cryptocurrency Prices Today, 06 April 2022: క్రిప్టో మార్కెట్లు బుధవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి పెట్టుబడులు పెడుతున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 2.95 శాతం తగ్గి రూ.35.82 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.65.26 లక్షల కోట్లుగా ఉంది. ఒక్క రోజులో లక్ష కోట్లు తగ్గిపోయింది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 5.19 శాతం తగ్గి రూ.2,64,823 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.30.47 లక్షల కోట్లుగా ఉంది.
బైనాన్స్ కాయిన్ 3.61 శాతం తగ్గి రూ.34,979, టెథెర్ 0.05 శాతం పెరిగి రూ.79.36, యూఎస్‌డీ కాయిన్ 0.06 శాతం పెరిగి 79.37, సొలానా 6.95 శాతం తగ్గి రూ.9,811, కర్డానో 1.40 శాతం తగ్గి రూ.9,102 వద్ద కొనసాగుతున్నాయి. డోజీకాయిన్, అంబిర్ ఎడెక్స్, జిలికా, ట్రూ యూఎస్‌డీ 1-4 శాతం వరకు లాభపడ్డాయి. డిస్ట్రిక్ట్ నాట్ ఎక్స్, వేవ్స్, సింథెటిక్స్, ఓఎక్స్, డిజిబైట్, సివిక్, క్రోమియా 10 నుంచి 15 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Stock Market News: శుక్రవారం డబ్బుల వర్షం! రూ.5.5 లక్షల కోట్లు ఆర్జించిన ఇన్వెస్టర్లు, సెన్సెక్స్ 1163+
Petrol Diesel Price 20th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
Gold Silver Price Today 20th May 2022 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు, కాస్త తగ్గిన వెండి ధరలు, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Elon Musk Political Views: ట్రంప్ అంటే మస్క్ మామకి ఎందుకింత లవ్?
Employees Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన మరో స్టార్టప్! 600 మందిని తీసేసిన కార్స్ 24
Ram Charan-NTR: నీతో నా బంధాన్ని మాటల్లో చెప్పలేను - రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్
Nara Lokesh : ఎమ్మెల్సీ కారులో మృతదేహం ఘటనపై లోకేశ్ ఫైర్, హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని ఆరోపణ!
CBI Raids: లాలూ యాదవ్‌కు మరో షాక్- కొత్త అభియోగాలు మోపిన సీబీఐ
Covid-19 Cases India: దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు- 20 మంది మృతి