అన్వేషించండి
Advertisement
Budget 2022 For Defence: రక్షణ రంగానికి బూస్ట్.. 'మేక్ ఇన్ ఇండియా' సూత్రం మాత్రం పక్కా
బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ. 3,85,370 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. ఇందులో 68వ శాతం దేశీయ వనరుల నుంచి కొనుగోళ్లకు కేటాయించారు.
కేంద్ర బడ్జెట్ 2022లో రక్షణ రంగానికి నిధులను భారీగా పెంచింది ప్రభుత్వం. సాయుధ బలగాలు, పరికరాల ఆధునీకరణ కోసం రక్షణ శాఖకు రూ. 3,85,370 కోట్లు కేటాయించింది మోదీ సర్కార్.
ఇందులో 68 శాతం దేశీయ వనరుల నుంచి కొనుగోళ్లకు కేటాయించారు. గత ఏడాది కేటాయించిన రూ.1.35 లక్షల కోట్ల కంటే ఇది దాదాపు 13 శాతం ఎక్కువ.
" రక్షణ రంగంలో స్థానిక పరిశ్రమల కోసం మూలధన సేకరణ బడ్డెట్‌లో 68 శాతం నిధులు కేటాయించాం. రక్షణ రంగానికి గత ఆర్థిక ఏడాది 58 శాతం మేర నిధులు పెంచగా ఈసారి మరో పది శాతం అదనంగా కేటాయించాం. రక్షణ పరికరాల దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడం, ఆత్మనిర్భర్ భారత్ కింద స్వయం ఆధారిత రక్షణ రంగాన్ని కలిగి ఉండటమే మా ధ్యేయం. "
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
మరిన్ని..
- రక్షణ రంగ అభివృద్ధి, పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ), ఇతర సంస్థలతో కలిసి ప్రత్యేక ప్రయోజన వాహనం (ఎస్‌పీవీ) మోడల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు నిర్మలా.
- దీని ద్వారా సైనిక ప్లాట్‌ఫారమ్‌లు, పరికరాల రూపకల్పన, అభివృద్ధి చేపట్టేందుకు ప్రైవేట్ పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు.
- రక్షణ రంగంలో పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థల కోసం రక్షణ పపరిశోధన, అభివృద్ధి సంస్థ (ఆర్ అండ్ డీ)ని ప్రారంభిస్తామన్నారు.
- ప్రైవేటు కంపెనీలు సరికొత్త డిజైన్లు, మిలిటరీ ఉత్పత్తుల అభివృద్ధి, పరిశోధనలు చేయడానికి తాము ప్రోత్సహిస్తున్నట్టు నిర్మలా తెలిపారు.
- కృత్రిమ మేధస్సు, జియోస్పాటియల్ సిస్టమ్స్, డ్రోన్లు, సెమి కండక్టర్లు, వాటి ఎకో సిస్టమ్, స్పేస్ ఎకానమీ, జీనోమిక్స్, ఫార్మాస్యూటికల్, క్లీన్ మొబిలిటీ సిస్టమ్స్ వంటి ఏరియాలపై ఫోకస్ పెట్టామన్నారు.
Also Read: Budget 2022, Digital Rupee: బ్లాక్‌చైన్‌తో డిజిటల్ రూపాయి! క్రిప్టో కరెన్సీకి చుక్కలేనా?
Also Read: Tax Slab, Budget 2022: ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులేదు! ప్చ్.. వేతన జీవులకు నిరాశే!!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
సినిమా
వరంగల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement