By: ABP Desam | Updated at : 27 Mar 2023 01:11 PM (IST)
Edited By: Arunmali
సన్ ఫార్మా, ఫీనిక్స్, కోటక్, M&M టార్గెట్ ధరలు
Brokerage Ratings For Hot Stocks: గ్లోబల్ బ్రోకరేజ్ BofA సెక్యూరిటీస్, మహీంద్ర & మహీంద్ర (M&M) రేటింగ్‌ను న్యూట్రల్‌కు తగ్గించింది, కోటక్ మహీంద్ర బ్యాంక్‌ను CLSA "బయ్"కి అప్‌గ్రేడ్ చేసింది. క్రెడిట్ సూయిస్ సన్ ఫార్మాను ఔట్‌పెర్ఫార్మర్‌గా పెంచింది, మోర్గాన్ స్టాన్లీ ఫీనిక్స్ మిల్స్‌పై కవరేజీని ప్రారంభించింది.
ఏ స్టాక్ రేటింగ్ ఏంటి, టార్గెట్ ప్రైస్ ఎంత?
మహీంద్ర & మహీంద్ర
"న్యూట్రల్"కు రేటింగ్ డౌన్‌గ్రేడ్ | ప్రైస్ టార్గెట్ రూ. 1320
M&Mని రూ. 1320 టార్గెట్ ధరతో న్యూట్రల్‌కి తగ్గించినా, గత సంవత్సరం కాలంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన స్టాక్‌గా BofA సెక్యూరిటీస్ అభివర్ణించింది. ఈ స్టాక్ కొంత కరెక్షన్‌కు వెళ్ళే అవకాశం ఉందని తెలిపింది. స్టాక్ ధరను పెంచే సమీప కాల ట్రిగ్గర్స్ లేవని బ్రోకరేజ్ వెల్లడించింది.
కోటక్ మహీంద్ర బ్యాంక్
"బయ్"కి రేటింగ్ అప్‌గ్రేడ్ | ప్రైస్ టార్గెట్ రూ. 2080
పెద్ద బ్యాంకుల్లో వృద్ధికి ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్ నాయకత్వం వహిస్తుందని బ్రోకరేజ్ CLSA చెప్పింది. "కోటక్ మహీంద్ర రుణ స్థాయి మెరుగుపడింది, HDFC బ్యాంక్ & ICICI బ్యాంక్‌ల ప్రీమియం వాల్యుయేషన్ కంటే 10-20% వరకు తక్కువ వాల్యుయేషన్‌లోనే ఇప్పుడు ఈ దొరుకుతోందని" వెల్లడించింది. గత 3 సంవత్సరాల్లో, సహచర బ్యాంక్ స్టాక్స్‌తో పోలిస్తే ఇది అండర్‌పెర్ఫార్మ్ చేసింది.
సన్ ఫార్మా
"ఔట్‌పెర్ఫార్మ్"కు రేటింగ్ అప్‌గ్రేడ్ | ప్రైస్ టార్గెట్ రూ. 1150
స్పెషాలిటీ ప్లాట్‌ఫామ్‌ను ఈ కంపెనీ కీలక వృద్ధి డ్రైవర్‌గా పై క్రెడిట్ సూయిస్ భావిస్తోంది. "వచ్చే నాలుగేళ్లలో స్పెషాలిటీ సేల్స్ రెట్టింపు అవుతాయని అంచనా. మార్జిన్ పెరిగే దశలోకి ఈ కంపెనీ ప్రవేశిస్తోంది" అని బ్రోకరేజ్ చెప్పింది.
ఫీనిక్స్ మిల్స్
"ఓవర్‌వెయిట్" రేటింగ్ | ప్రైస్ టార్గెట్ రూ. 1700
ఫీనిక్స్ మిల్స్ మీద ఓవర్‌వెయిట్ రేటింగ్ & రూ. 1700 టార్గెట్ ధరతో మోర్గాన్ స్టాన్లీ కవరేజీని ప్రారంభించింది. రెంటల్ పోర్ట్‌ఫోలియోను రాబోయే 3-4 సంవత్సరాలలో రెండింతలు పెంచాలని ఫీనిక్స్ మిల్స్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. "కొత్త అసెట్-క్రియేషన్ సైకిల్ రన్నింగ్‌లో ఉంది. బలమైన బ్యాలెన్స్ షీట్, చవకైన వాల్యుయేషన్ వల్ల ఫీనిక్స్ మిల్స్ ప్రస్తుత స్థాయిలలో ఆకర్షణీయంగా కనిపిస్తోంది" అని మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Latest Gold-Silver Price Today 07 June 2023: ఎటూ మొగ్గని పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు
FIIs: ఇండియన్ మార్కెట్‌పై నాన్-స్టాప్‌గా డాలర్ల వర్షం, FIIల షాపింగ్ లిస్ట్ ఇదిగో
Petrol-Diesel Price 07 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు - కొత్త రేట్లివి
Tata Technologies IPO: గ్రే మార్కెట్లో షేర్లు దొరకట్లా, ధర హై రేంజ్లో ఉంది!
Stocks Watch Today, 07 June 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్లో ఉండే 'కీ స్టాక్స్' Adani Group Stocks
Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్ షోకి కూడా ప్లాన్!
Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!
మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్