అన్వేషించండి

Bank Holidays: వచ్చే నెలలో బ్యాంక్‌లకు 12 సెలవులు, ఈ లిస్ట్‌ సేవ్‌ చేసుకోండి

సెలవు రోజులను గుర్తు పెట్టుకుంటే, ఆ రోజుల్లో బ్యాంక్‌కు వెళ్లకుండా ఆగొచ్చు, సమయం వృథా కాకుండా ఉంటుంది.

Bank Holidays List For May 2024: వచ్చే నెలలో బ్యాంక్‌లకు మొత్తం 12 హాలిడేస్‌ వచ్చాయి. వీటిలో 2 &4 శనివారాలు, ఆదివారాలు కలిసి ఉన్నాయి. ఈ నెలలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కారణంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులను మూసివేస్తారు. మే డే, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, నజ్రుల్ జయంతి, అక్షయ తృతీయ వంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రం లేదా ప్రాంతాన్ని బట్టి మారతాయి. 

మే నెలలో మీకు బ్యాంక్‌లో ఏ పని ఉన్నా, బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను ముందుగా సేవ్‌ చేసుకోండి. సెలవు రోజులను గుర్తు పెట్టుకుంటే, ఆ రోజుల్లో బ్యాంక్‌కు వెళ్లకుండా ఆగొచ్చు, సమయం వృథా కాకుండా ఉంటుంది.

2024 మే నెలలో బ్యాంక్‌ సెలవు రోజులు ‍‌(Bank Holidays in May 2024): 

మే 01 (బుధవారం): మహారాష్ట్ర దినోత్సవం/ మే డే (కార్మిక దినోత్సవం) సందర్భంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, అమరావతి, ఇంఫాల్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పట్నా, తిరువనంతపురం తదితర ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు

మే 05: ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

మే 08 (బుధవారం): రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (Rabindra Jayanti) సందర్భంగా కోల్‌కతాలోని అన్ని బ్యాంకులను మూసివేస్తారు

మే 10 ‍‌(శుక్రవారం): బసవ జయంతి/ అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరులో బ్యాంకులకు హాలిడే ఇచ్చారు

మే 11: రెండో శనివారం, దేశంలోని అన్ని బ్యాంక్‌లు మూతబడతాయి

మే 12: ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

మే 16 (గురువారం): రాష్ట్ర దినోత్సవం సందర్భంగా గ్యాంగ్‌టక్‌లోని అన్ని బ్యాంకులకు సెలవు

మే 19: ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

మే 20 ‍‌(సోమవారం): లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బేలాపూర్, ముంబైలోని బ్యాంకులను మూసేస్తారు.

మే 23 ‍‌(గురువారం): బుద్ధ పూర్ణిమ సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, ఇటానగర్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూదిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులు పని చేయవు.

మే 25: నాలుగో శనివారం, దేశంలోని అన్ని బ్యాంక్‌లు మూతబడతాయి

మే 26: ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

ప్రస్తుతం, మొబైల్ బ్యాంకింగ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్‌లు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, బ్యాంక్‌ సెలవులు మీ పనులపై పెద్దగా ప్రభావం చూపవు. ఈ డిజిటల్‌ సర్వీస్‌లు 24 గంటలూ, భారతదేశం అంతటా కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ సేవల్లో ఏదైనా ఆటంకం ఉంటే, మీ బ్యాంక్‌ ముందుగానే మీకు తెలియజేస్తుంది. 

భారతదేశంలో, బ్యాంక్ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం 1881 కింద లిస్ట్‌ అయ్యాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), మొత్తం సంవత్సరానికి వార్షిక బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను ప్రచురిస్తుంది. దీనిని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు అనుసరిస్తాయి. 

మరో ఆసక్తికర కథనం: మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget