By: ABP Desam | Updated at : 24 May 2023 02:25 PM (IST)
జూన్ నెలలో బ్యాంక్‌లకు 12 రోజులు సెలవులు
Bank Holidays list in June: సామాన్యుల జీవితంలో బ్యాంకులు అంతర్భాగం. డబ్బు లావాదేవీలు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు స్వీకరించడం, చెక్కులు డిపాజిట్ చేయడం వంటి చాలా పనులకు బ్యాంకులు అవసరం. బ్యాంకులకు సెలవు వస్తే ఖాతాదార్ల పనులకు కూడా సెలవు ప్రకటించాల్సి వస్తుంది. దీంతోపాటు, రూ. 2000 నోట్లను వెనక్కు తీసుకోవాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. సెప్టెంబర్ 30 లోపు ప్రజలు పింక్ నోట్లను మార్చుకోవాలి, ఇందుకోసం బ్యాంక్‌లకు వెళ్లాలి. కాబట్టి, రూ.2 వేల నోట్లను జూన్ నెలలో మార్చాలని మీరు ప్లాన్ చేస్తే, ఆ నెలలో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్‌ను (Bank Holidays in June 2023) గుర్తుంచుకోండి. అప్పుడు, సెలవు రోజున బ్యాంకుకు వెళ్లి, మూసేసిన గేటును చూసి ఉసూరుమంటూ తిరుగుముఖం పట్టాల్సిన అవసరం ఉండదు.
జూన్‌లో 12 రోజులు బ్యాంకులకు సెలవులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ కస్టమర్ల సౌలభ్యం కోసం ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్ హాలిడేస్ లిస్ట్‌ను ముందుగానే విడుదల చేస్తుంది. ప్రతి రాష్ట్రంలోని పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వచ్చే సెలవుల వివరాలు ఈ లిస్ట్‌లో ఉంటాయి. జూన్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉన్నాయి. శని, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులతో పాటు, పండుగలు, ఇతర కార్యక్రమాల వల్ల వచ్చే సెలవులు కూడా ఈ లిస్ట్‌లో కలిసి ఉన్నాయి. జూన్ నెలలో.. రథయాత్ర, ఖర్చీ పూజ, ఈద్ ఉల్ అజా వంటి కొన్ని ముఖ్యమైన సందర్భాలు ఉన్నాయి. బ్యాంకు సెలవుల జాబితా ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి మారుతుంది.
2023 జూన్ నెలలో బ్యాంకులకు సెలవు రోజులు:
జూన్ 4, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 10, 2023- రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 11, 2023 - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 15, 2023- రాజా సంక్రాంతి కారణంగా మిజోరం, ఒడిశాలో బ్యాంకులు పని చేయవు
జూన్ 18, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 20, 2023- రథయాత్ర కారణంగా ఒడిశాలో బ్యాంకులు పని చేయవు
జూన్ 24, 2023- నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 25, 2023-ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 26, 2023- ఖర్చీ పూజ నేపథ్యంలో త్రిపురలో బ్యాంకులు పని చేయవు
జూన్ 28, 2023- ఈద్ ఉల్ అజా కారణంగా కేరళ, మహారాష్ట్ర, జమ్ము, కశ్మీర్‌లో బ్యాంకులను మూసిస్తారు
జూన్ 29, 2023- ఈద్ ఉల్ అజా సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు
జూన్ 30, 2023- ఈద్ ఉల్ అజా కారణంగా మిజోరాం, ఒడిశాలో బ్యాంకులను మూసివేస్తారు
బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్ అండర్ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్'. ఏ బ్యాంక్ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. అయితే, బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా చేయవలసి వస్తే ATMని ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా UPIని ఉపయోగించవచ్చు.
ఇది కూడా చదవండి: ₹2000 నోట్లను పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చా, డిపాజిట్ చేయవచ్చా?
CIBIL Score: సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా లోన్ వస్తుంది! ఈ చిట్కాలు ప్రయోగించండి
Coin Deposit: బ్యాంక్ అకౌంట్‌లో ఎన్ని నాణేల్ని డిపాజిట్ చేయవచ్చు?
Gold-Silver Price Today 30 May 2023: ఎటూ కదలని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు
Indian Market: మళ్లీ ఐదో స్థానంలోకి ఇండియన్ స్టాక్ మార్కెట్, వెనక్కు తగ్గిన ఫ్రాన్స్
Stock Market News: ఫుల్ జోష్‌లో స్టాక్ మార్కెట్లు - 18,600 సమీపంలో ముగిసిన నిఫ్టీ!
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?