అన్వేషించండి

Bank Holiday: వచ్చే 4 రోజుల్లో 3 రోజులు ఒక్క బ్యాంక్‌ కూడా పని చేయదు, పనుంటే ముందే ప్లాన్ చేసుకోండి

ఆ వర్కింగ్‌ డే (సోమవారం, ఆగస్టు 14) రోజున కూడా చాలా మంది బ్యాంక్‌ ఉద్యోగులు సెలవు పెట్టే అవకాశం ఉంది.

Bank Holidays list in August 2023: ఈ నెలలో బ్యాంకులకు మొత్తం 14 రోజులు సెలవులు వచ్చాయి. ఈ వారంలో శనివారం నుంచి వచ్చే మంగళవారం వరకు, ఈ 4 రోజుల్లో 3 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. చెక్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, డీడీ తీయడం, క్యాష్‌ డిపాజిట్‌, క్యాష్‌ విత్‌డ్రా, కొత్త అకౌంట్‌ ఓపెన్‌ చేయడం, అకౌంట్‌ క్లోజ్‌ చేయడం, లోన్‌ తీసుకోవడం, 2 వేల రూపాయల నోట్లు మార్చుకోవడం సహా ఈ నెలలో మీకు బ్యాంక్‌లో ఎలాంటి పనున్నా... బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు వచ్చాయో ముందుగా తెలుసుకోండి. హాలిడేస్‌ లిస్ట్‌ సేవ్‌ చేసుకోండి. దీనివల్ల, సెలవు రోజుల్లో మినహా మిగిలిన రోజుల్లో మీ పనిని ప్లాన్‌ చేసుకోవచ్చు, టైమ్‌ సేవ్‌ అవుతుంది.

ఈ వారంలో రెండో శనివారం (ఆగస్టు 12వ తేదీ) వచ్చింది. కాబట్టి, బ్యాంక్‌లకు ఆ రోజు సెలవు. ఆ తర్వాత ఆదివారం (ఆగస్టు 13వ తేదీ) కూడా సెలవు. సోమవారం (ఆగస్టు 14) రోజు బ్యాంకులు పని చేస్తాయి. ఆ తర్వాత, మంగళవారం రోజున స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15). ఆ రోజున కూడా బ్యాంకులకు సెలవే. మొత్తంగా చూస్తే, ఈ నాలుగు రోజుల్లో మూడు రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడేస్‌. వరుసగా నాలుగు రోజులు హాలిడేస్‌ ఎంజాయ్ చేయడానికి, ఆ ఒక్క వర్కింగ్‌ డే (సోమవారం, ఆగస్టు 14) రోజున కూడా చాలా మంది బ్యాంక్‌ ఉద్యోగులు సెలవు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి, సిబ్బంది కొరతతో ఆ రోజున కూడా బ్యాంక్‌లో పని లేటయ్యే ఛాన్స్‌ ఉంటుంది.

ఈ నెలలో బ్యాంకులకు ఇంకా 12 రోజులు సెలవులు
ఆగస్టు 12, రెండో శనివారం నుంచి ఈ నెలాఖరు వరకు బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉన్నాయి. రెండు, నాలుగు శనివారాలు, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులతో పాటు, పండుగలు, ఇతర కార్యక్రమాల వల్ల వచ్చే సెలవులు కూడా ఈ లిస్ట్‌లో కలిసి ఉన్నాయి. బ్యాంకు సెలవులు ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి వేర్వేరుగా ఉంటాయి.

2023 ఆగస్టు నెలలో బ్యాంకుల సెలవు రోజులు:

ఆగస్టు 12 - రెండో శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 13 - ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 15 - మంగళవారం - (స్వాతంత్ర్య దినోత్సవం) దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 16 - బుధవారం - (పార్సీ నూతన సంవత్సరం- షాహెన్‌షాహి): బేలాపూర్, ముంబై, నాగ్‌పుర్‌లలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 18 - శుక్రవారం - (శ్రీమంత శంకరదేవుని తిథి) గువాహతిలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 20 - ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 26 - నాలుగో శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 27 - ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 28 - సోమవారం - (మొదటి ఓనం) కోచి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 29 - మంగళవారం - (తిరువోణం) కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 30 - బుధవారం - (రాఖీ పండుగ) జైపూర్, సిమ్లాలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 31 - గురువారం - (రాఖీ పండుగ/శ్రీనారాయణ గురు జయంతి/పాంగ్-లాబ్సోల్): డెహ్రాడూన్, గాంగ్‌టక్, కాన్పూర్, కొచ్చి, లఖ్‌నవూ, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు

బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌'. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా/డిపాజిట్‌ చేయాల్సివస్తే ATMను ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ లేదా UPIని ఉపయోగించవచ్చు. 

మరో ఆసక్తికర కథనం: కష్టకాలంలో నష్టాలను తగ్గించే మంత్రమిది - ఇన్వెస్టర్లు చాలా డబ్బు సంపాదించారు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget