Bajaj Finserv: మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లైసెన్స్ పొందిన బజాజ్ ఫిన్‌సర్వ్, ఇక దూకుడే!
బజాజ్ ఫిన్‌సర్వ్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్‌ను 'బజాజ్ ఫిన్‌సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్' (Bajaj Finserv Asset Management Limited -BFAML) అమలు చేస్తుంది.
Bajaj Finserv MF business: ఆర్థిక సేవల సంస్థ బజాజ్ ఫిన్‌సర్వ్ (Bajaj Finserv), తన పెట్టుబడిదార్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. త్వరలో మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని (mutual fund business) ఈ కంపెనీ ప్రవేశించబోతోంది. MF బిజినెస్‌లోకి బజాజ్ ఫిన్‌సర్వ్ వస్తుందన్న వార్త పాతదే అయినా, అప్‌డేషన్ ఏంటంటే... ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి ఈ కంపెనీకి తాజాగా అనుమతి (licence) వచ్చింది. ఇదే విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్ వెల్లడించింది.
సెబీ నుంచి క్లియరెన్స్‌తో పెరగనున్న పని వేగం
మ్యూచువల్ ఫండ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను బజాజ్ ఫిన్‌సర్వ్ పూర్తి చేసింది, సెబీ కనుసైగ కోసం వెయిట్ చేస్తోంది. ఇప్పుడు సెబీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో రంగంలోకి దిగబోతోంది. ఇప్పుడు బజాజ్ ఫిన్‌సర్వ్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్‌ను 'బజాజ్ ఫిన్‌సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్' (Bajaj Finserv Asset Management Limited -BFAML) అమలు చేస్తుంది. అంటే, మ్యూచువల్ ఫండ్ బిజినెస్‌కు ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌గా ఈ కొత్త కంపెనీ వ్యవహరిస్తుంది. త్వరలోనే, పెట్టుబడిదార్లకు క్రియాశీల & నిష్క్రియ విభాగాల్లో (active and passive segments) మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్స్‌ను అందించనుంది.
బజాజ్ ఫిన్‌సర్వ్‌లో కార్పొరేట్ స్ట్రాటజీ గ్రూప్ హెడ్‌గా 8 సంవత్సరాలుగా ఉన్న గణేష్ మోహన్, 'బజాజ్ ఫిన్‌సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్' CEOగా నాయకత్వం వహిస్తారు.
భారతదేశంలో డిజిటల్ ఆర్థిక సేవలను ఉపయోగించుకునే వారి సంఖ్య గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా పెరిగింది. ఈ నేపథ్యంలో, బజాజ్ ఫిన్‌సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (BFAML) సహకారంతో రంగంలోకి దిగిన బజాజ్ ఫిన్‌సర్వ్ మ్యూచువల్ ఫండ్, తన కస్టమర్‌లకు ఆధునిక సేవలను అందించడానికి సిద్ధమవుతోంది. ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ ఫండ్స్ వంటి అనేక మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్స్‌ను ఇన్వెస్టర్లకు పరిచయం చేయడానికి ఈ కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
దేశంలో మ్యూచువల్ ఫండ్ వ్యాపారం విలువ
భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ వ్యాపారం విలువ చాలా పెద్దది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల మొత్తం విలువ రూ. 39.62 లక్షల కోట్లు. నివేదిక ప్రకారం... జనవరి 31, 2023 నాటికి దేశంలో మొత్తం 42 అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు పని చేస్తున్నాయి. ఈ పరిశ్రమ జనవరిలో 9.3 శాతం వృద్ధిని సాధించింది. దేశవ్యాప్తంగా మ్యూచువల్ ఫండ్స్ రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరిగినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ తెలిపింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.