అన్వేషించండి

Ashneer Grover on Uber Cabs: అంతరిక్షంలోనూ ట్రిప్స్‌ వేసిన ఉబెర్‌ కార్లు, నెఫ్ట్యూన్‌ గ్రహం వరకు టూర్లు! ఒక్క ట్వీట్‌తో వెనక్కి వచ్చాయి

తమ కంపెనీ క్యాబ్స్‌ భూమి నుంచి సౌర వ్యవస్థలోని చివరి గ్రహం వరకు ప్రయాణాన్ని పూర్తి చేశాయని వెల్లడించారు.

Ashneer Grover on Uber Cabs: మన దేశంలో అతి పెద్ద ఆన్‌లైన్ క్యాబ్ కంపెనీ ఉబెర్ ఇండియా (Uber India) క్యాబ్స్‌, అంతరిక్షాన్ని చుట్టొట్టాయట. భూమి నుంచి సుమారు 4.5 బిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించాయట. ఇలా వెళ్లీ వెళ్లీ... సౌర కుటుంబంలోని చివరి గ్రహం నెప్ట్యూన్ వరకు ప్రయాణాన్ని పూర్తి చేశాయట.

ఉబెర్ ఇండియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్ (Prabhjeet Singh), తన లింక్డ్‌ ఇన్‌ ఖాతాలో ఈ డేటాను పంచుకున్నారు. ఉబెర్ ఇండియా భారతదేశంలో సుమారు $4.5 బిలియన్ల ప్రయాణాన్ని పూర్తి చేసిందని రాశారు. కాబట్టి, తమ కంపెనీ క్యాబ్స్‌ భూమి నుంచి సౌర వ్యవస్థలోని చివరి గ్రహం వరకు ప్రయాణాన్ని పూర్తి చేశాయని వెల్లడించారు.

అష్నీర్ గ్రోవర్ రిప్లై మామూలుగా లేదు
ప్రభ్‌జీత్ సింగ్ షేర్‌ చేసిన సమాచారం మీద  భారత్ పే (BharatPe) సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ (Ashneer Grover) వెటకారంగా స్పందించారు. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్‌ చేశారు. 'ఉబెర్ కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం... ఆ కంపెనీ కార్లు సౌర వ్యవస్థ మొత్తం దూరాన్ని భారతదేశంలోనే కవర్ చేశాయి' అంటూ ఎగతాళి చేశారు. ఇప్పుడు, మీరు ఎవరితో కలిసి అంగారక గ్రహానికి ప్రయాణించాలనుకుంటున్నారు? అంటూ నెజిటన్ల కోసం ఒక పోల్‌ పెట్టారు. దీని సమాధానంగా మూడు ఆప్షన్లు కూడా ఇచ్చారు.

మొదటి ఆప్షన్‌... ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌తో
రెండో ఆప్షన్‌... క్యాబ్ రద్దు చేయకపోతే ఉబర్‌ భయ్యాతో
మూడో ఆప్షన్‌... ఎవరినైనా ఎయిర్‌పోర్ట్‌కి పంపండి

ఉబెర్‌ ఇండియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్ పోస్ట్‌ చేసిన సమాచారం మీద వెటకారపు రియాక్షన్లు పెరగడంతో, ఆయన తన లింక్డ్‌ ఇన్ పోస్ట్‌ను తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న అష్నీర్‌ గ్రోవర్‌ మళ్లీ విరుచుకు పడ్డారు. ఉబెర్‌ అధికారులను లక్ష్యంగా చేసుకున్నారు. "చంద్రుడి దగ్గరకో, విశ్వంలోకో ప్రయాణించడానికో ఏ కస్టమర్ ఉబెర్‌ క్యాబ్‌ను బుక్ చేయడం లేదు. మీరు చంద్రుడి గురించి ఆలోచించడం మానేసి, భూమ్మీద మీ సేవలు మెరుగు పరుచుకోవడం గురించి ఆలోచించండి అని సూచించారు. PR కంటే, కస్టమర్‌కు ఇచ్చే సేవ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి" అని అష్నీర్ గ్రోవర్ హితవు పలికారు. 

 

ఉబెర్ క్యాబ్‌లు రద్దు కావడం వల్ల చాలా సార్లు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అష్నీర్‌ గ్రోవర్‌ ఇంత ఘాటుగా స్పందించారు. ఆయనకు కూడా ఉబెర్‌ నుంచి ఎప్పుడో ఒక చేదు అనుభవం ఎదురై ఉండవచ్చు. లేకపోతే ఇంత ఘాటుగా స్పందించరుగా!.

టాప్ హెడ్ లైన్స్

KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget