అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

Adani Group: అదానీ కంపెనీల్లో పెట్టుబడులపై అమెరికా ఆరా, టపటాపా పడిపోయిన స్టాక్స్‌

అదానీ గ్రూప్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన అమెరికన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు ఇటీవలి నెలల్లో ఎంక్వైరీ నోటీసులు పంపిందని సమాచారం.

Adani Group Update: యూఎస్‌ షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ నేపథ్యంలో అమెరికన్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ రంగంలోకి దిగిందని, అదానీ గ్రూప్‌పై స్క్రూటినీ నిర్ణయం తీసుకున్నట్లు రిపోర్ట్స్‌ రావడంతో, ఇవాళ (శుక్రవారం, 23 జూన్‌ 2023) అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఒత్తిడిలో ఉన్నాయి, 6 శాతం వరకు పడిపోయాయి.

ఉదయం 10:15 గంటల సమయానికి... అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు BSEలో 6 శాతం క్షీణించి రూ. 2,251కి చేరుకున్నాయి. అదానీ పోర్ట్స్‌ & స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌, అదానీ పవర్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ విల్‌మార్‌, అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ షేర్లు 2 శాతం నుంచి 4 శాతం దిగజారాయి. వీటితో పోలిస్తే, S&P BSE సెన్సెక్స్ కేవలం 0.28 శాతం క్షీణించి 63,061 వద్ద ఉంది. 

కొన్ని నెలలుగా US అటార్నీ ఆఫీస్‌ దర్యాప్తు
బ్లూంబెర్గ్ రిపోర్ట్‌ ప్రకారం, అదానీ గ్రూప్ తన కంపెనీల షేర్‌ ధరలను అక్రమ పద్ధతిలో మార్చేందుకు ఆఫ్‌షోర్ కంపెనీలను ఉపయోగిస్తోందని షార్ట్ సెల్లర్ ఆరోపించింది. ఆ రిపోర్ట్‌ ఆధారంగా, అదానీ గ్రూప్ తన అమెరికన్ ఇన్వెస్టర్లను ఎలా వాడుకుందన్న దానిపై US అధికారులు పరిశీలిస్తున్నారు.

US అటార్నీ ఆఫీస్‌, అదానీ గ్రూప్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన అమెరికన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు ఇటీవలి నెలల్లో ఎంక్వైరీ నోటీసులు పంపిందని సమాచారం. 

ఇండియన్‌ మార్కెట్ రెగ్యులేటర్ 'సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI) కూడా, ఈ ఏడాది జనవరి 24న హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలపై & ఆ తేదీకి ముందు, తర్వాత జరిగిన మార్కెట్ లావాదేవీలపై విచారణ నిర్వహిస్తోంది. సెబీ రిపోర్ట్‌ ఆగస్టులో బయటకు వచ్చే అవకాశం ఉంది.

అయితే, అదానీ షేర్ల ధరలను అక్రమంగా మార్చినట్లు తమకు ఎలాంటి ఆధారం కనిపించలేదని సుప్రీంకోర్టు ప్యానెల్‌ గత నెలలో తన రిపోర్ట్‌లో వెల్లడించింది.

ఈ నెల ప్రారంభం నుంచి అదానీ స్టాక్స్‌పై ఒత్తిడి
అదానీ గ్రూప్ స్టాక్స్‌లో గత 3 వారాలుగా కొనసాగుతున్న ఒత్తిడి ఈ వారం చివరి రోజు కూడా కొనసాగుతోంది. ఈ నెల మొత్తం అదానీ గ్రూప్‌నకు ప్రతికూలంగానే ఉంది. నిన్న (గురువారం) కూడా, మంచి ఓపెనింగ్‌ దక్కినా, చివరకు మొత్తం  10 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. వారం మొదటి రోజున కూడా ఇదే పరిస్థితి. గత 3 వారాలుగా, మంచి ఓపెనింగ్స్‌ పని చేయడం లేదు. ట్రేడ్‌ ముగిసే సమయానికి నష్టాల్లోకి జారిపోతున్నాయి.

మరో ఆసక్తికర కథనం: పసిడి ధర మరింత పతనం - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Aditi Shankar: పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Aditi Shankar: పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Paritala Sunitha: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
Karthika Vanabhojanam 2024: కార్తీక సమారాధన అంటే క్యాటరింగ్ భోజనాలు కాదు..అసలైన వనభోజనాలంటే ఇవి!
కార్తీక సమారాధన అంటే క్యాటరింగ్ భోజనాలు కాదు..అసలైన వనభోజనాలంటే ఇవి!
Amla Soup : చలికాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు రోగనిరోధక శక్తిని పెంచే సూప్.. సింపుల్ రెసిపీ, మరెన్నో హెల్త్ బెనిఫిట్స్
చలికాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు రోగనిరోధక శక్తిని పెంచే సూప్.. సింపుల్ రెసిపీ, మరెన్నో హెల్త్ బెనిఫిట్స్
Embed widget