Nifty: నిఫ్టీని నడిపిస్తున్న 5 బ్లూ చిప్ స్టాక్స్, మీ దగ్గర ఒక్కటైనా ఉందా?
రిలయన్స్ ఇండస్ట్రీస్, ITC, ICICI బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ 40% లేదా 760 పాయింట్లు కాంట్రిబ్యూట్ చేశాయి.
Nifty Blue Chip Stocks: ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, 2020 మార్చి నుంచి దాదాపు 2000 పాయింట్ల రికార్డ్ బ్రేకింగ్ ర్యాలీతో ఇప్పుడు 16,828 స్థాయికి చేరుకుంది. ఐదు బ్లూ చిప్ స్టాక్స్ ఈ ర్యాలీని నడిపాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ITC, ICICI బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ 40% లేదా 760 పాయింట్లు కాంట్రిబ్యూట్ చేశాయి. రిలయన్స్ ఒక్కటే 272 పాయింట్లు అందించింది. ఐటీసీ 206 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 104 పాయింట్లు, బజాజ్ ఫైనాన్స్ 92 పాయింట్లు, యాక్సిస్ బ్యాంక్ 87 పాయింట్ల మేర సాయం చేశాయి.
2022 డిసెంబర్ 1 నుంచి, గెయినర్స్ లిస్ట్‌లో 33% లాభంతో ITC టాప్ ప్లేస్‌లో నిలిచింది. టాటా మోటార్స్ 30%, బజాజ్ ఆటో 25% పెరిగాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ ఎక్కువగా నష్టపోయాయి.
టాప్ గెయినర్స్ (2022 డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు)
ఐటీసీ - ప్రస్తుత మార్కెట్ ధర రూ. 453.10 | లాభం 33.44%
టాటా మోటార్స్ - ప్రస్తుత మార్కెట్ ధర రూ. 569.80 | లాభం 30.02%
బజాజ్ ఆటో - ప్రస్తుత మార్కెట్ ధర రూ. 4,641.95 | లాభం 25.20%
బ్రిటానియా ఇండస్ట్రీస్ - ప్రస్తుత మార్కెట్ ధర రూ. 5,044.70 | లాభం 14.62%
అల్ట్రాటెక్ సిమెంట్ - ప్రస్తుత మార్కెట్ ధర రూ. 8,333.25 | లాభం 14.56%
టాప్ లూజర్స్ (2022 డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు)
అదానీ ఎంటర్‌ప్రైజెస్ - ప్రస్తుత మార్కెట్ ధర రూ. 2,509.60 | నష్టం -35.90%
ఇన్ఫోసిస్ - ప్రస్తుత మార్కెట్ ధర రూ. 1291. 65 | నష్టం -22.05%
అదానీ పోర్ట్స్ - ప్రస్తుత మార్కెట్ ధర రూ. 747.40 | నష్టం -16.07%
యూపీఎల్- ప్రస్తుత మార్కెట్ ధర రూ. 690.85 | నష్టం -11.30%
Cipla ప్రస్తుత మార్కెట్ ధర రూ. 1,006.05 | నష్టం -10.57%
2022 డిసెంబరు 1 నుంచి డిఫెన్స్, FMCG, రియాల్టీ, ఆటో, ట్రాన్స్‌పోర్టేషన్ & లాజిస్టిక్స్ వంటి సెక్టార్లు 10-18% మధ్య పుంజుకున్నాయి.
టాప్ గెయినింగ్ సెక్టార్ (2022 డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు)
నిప్టీ డిఫెన్స్ ఇండెక్స్ 2729.79 | ర్యాలీ 17.95%
నిఫ్టీ FMCG ఇండెక్స్ 52440.20 | ర్యాలీ 15.58%
నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 517.10 | ర్యాలీ 12.65%
నిఫ్టీ ఆటో ఇండెక్స్ 14768.45 | ర్యాలీ 11.95%
నిఫ్టీ ట్రాన్స్‌పోర్టేషన్ & లాజిస్టిక్స్ ఇండెక్స్ 13999.48 | ర్యాలీ 10.06%
టాప్ లూజర్ సెక్టార్ (2022 డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు)
నిఫ్టీ మీడియా ఇండెక్స్ 1806.20 | డౌన్ -16.40%
నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ ఇండెక్స్ 7612.45 | డౌన్ -11.09%
నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ 24733.15 | డౌన్ -9.01%
నిఫ్టీ IT ఇండెక్స్ 28588.80 | డౌన్ -8.14%
Nifty మెటల్ ఇండెక్స్ 6231.50 | -6.50%
శుక్రవారం (16 జూన్ 2023), నిఫ్టీ 18,826 వద్ద, సెన్సెక్స్ 63,385 వద్ద ముగిశాయి. నిఫ్టీ50 ఇప్పుడు ఆల్-టైమ్ హై లెవెల్‌కు కేవలం 63 పాయింట్ల దూరంలో ఉంది. సెన్సెక్స్ కూడా 2022న డిసెంబర్ 1న నమోదైన రికార్డ్ స్థాయికి కేవలం 198 పాయింట్ల దూరంలో ముగిసింది.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ పడిపోయిన ఫారిన్ కరెన్సీ నిల్వలు, విదేశీ వాణిజ్యంలో ఊగిసలాట
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.