అన్వేషించండి

Yamaha Scooters India: యమహా స్కూటర్‌లలో అందుబాటులో ఉన్న మోడల్స్ ఎన్ని? లేటెస్ట్ ఫీచర్స్‌తో రాబోతున్న వెహికల్స్‌ ఏవీ?

Yamaha Scooters 2026 Price:భారతీయ టూవీలర్స్ రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది యమహా మోటర్ ఇండియా. స్కూటర్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న మోడల్స్ ఎన్ని, రాబోతున్న లేటెస్ట్ వెహికల్స్ ఏంటో చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యమహా స్కూటర్లు: 2026 నాటికి కొత్త మోడళ్లు, ధరల వివరాలు.
  • ప్రస్తుతం మార్కెట్లో రేజెడ్‌ఆర్‌, ఫ్యాసినో, ఏరోక్స్‌ అందుబాటులో ఉన్నాయి.
  • భవిష్యత్‌లో Nమ్యాక్‌, ఏరోక్స్‌-E, నియోస్‌ వంటివి విడుదల కానున్నాయి.
  • ఎలక్ట్రిక్ స్కూటర్ EC-06 ఒక్క ఛార్జికి 169 కి.మీ. ప్రయాణిస్తుంది.

Yamaha Scooters 2026 Price:భారత్‌లో టూవీలర్స్‌లో స్కూటర్లకు ప్రాధాన్యత లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వివిధ కంపెనీలు ఈ విభాగంలో తీవ్రమైన పోటీ ఉంది. ఎంత పోటీ ఉన్నప్పటికీ యమహా తన సత్తా చాటుకుంటూ వస్తోంది. అయితే ఈ స్కూర్ విభాగంలో ఈ కంపెనీ ప్రస్తుతం అమ్మకానికి ఉంచిన మోడల్స్ ఏంటి? రాబోయే మోడల్స్ గురించి సవివరంగా తెలుసుకుందాం.

భారత్‌లో యమహా ప్రస్థానం దశాబ్దాల చరిత్ర కలిగినది. ప్రారంభంలో ఎస్కార్ట్స్‌ గ్రూప్‌తో జాయింట్‌ వెంచర్‌ ద్వారా భారత మార్కెట్‌లోకి ప్రవేశించిన యమహా, రాజ్‌దూత్‌ 350, ఆర్‌ఎక్స్‌ 100 వంటి ఐకానిక్ బైక్‌లో ప్రజల హృదయాలను గెలుచుకుంది. అయితే కాలక్రమేణా మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 2001లో ఈ సంస్థ పూర్తిగా యమహా మోటార్ కంపెనీ 100 శాతం అనుబంధ సంస్థగా మారింది. నేడు యమహా మోటర్‌ ఇండియా పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ బ్రాండ్‌ , కేవలం వేగానికే కాకుండా, అత్యుత్తమ మైలేజీ, స్టైలిష్‌ డిజైన్లకు కూడా మారుపేరుగా నిలిచింది. 

యమహా స్కూటర్ల Revs Your Heart ఫిలాసఫీ

యమహా తన వాహనాల ద్వారా వినియోగదారుల్లో ఉత్సాహాన్ని నింపాలనే లక్ష్యంతో Revs Your Heart అనే ట్యాగ్‌లైన్‌తో పని చేస్తోంది. ఈ క్రమంలోనే 2012లో తన మొదటి స్కూటర్ ఫాసినోను వినూత్నమైన కర్వీ డిజైన్‌తో లాంచ్ చేసింది. ఆ తర్వాత వచ్చిన రేజ్‌డ్‌ఆర్‌ మోడల్‌ మరింత షార్ప్‌లుక్, ఇంధన సామర్థ్యంతో  మార్కెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2018లో ప్రారంభించిన కాల్‌ ఆఫ్‌ ద బ్లూ ప్రచారం ద్వారా యువతను ఆకర్షించేలా స్పోర్టీ హ్యాండ్లిగ్‌, హై పర్ఫార్మెన్స్‌ వాహనాలపై యమహా ప్రత్యేక దృష్టి పెట్టింది. 

2026లో యమహా స్కూటర్ల ధరల విశ్లేషణ

ప్రస్తుతం యమహా పోర్ట్ పోలియోలో సామాన్యులకు అందుబాటులో ఉండే మోడళ్ల నుంచి ప్రీమియం స్కూటర్ల వరకు వివిధ రకాలు ఉన్నాయి. వీటి ధరలు 74, 300 నుంచి 1,67, 600 వరకు ఉన్నాయి. యమహా రేజెడ్‌ఆర్‌ 125 Fi హైబ్రిడ్‌ ప్రారంభ ధర 74,300 రూపాయలు. యమహా ఫ్యాసినో 125 Fi హైబ్రిడ్‌ ప్రారంభ ధర 74, 910, యమహా ఏరోక్స్‌ 155 ప్రారంభ ధర 1,39,700 రూపాయలు, యమహా ఈసీ-06 ప్రారంభ ధర 1,67,600 రూపాయలు. 

యమహా రేజెడ్‌ఆర్‌ 125 Fi హైబ్రిడ్‌

ఇది భారత్‌లో లభించే అత్యంత పొదుపైన స్కూటర్లలో ఒకటి. రియల్ వరల్డ్ టెస్టింగ్ ప్రకారం ఇది లీటర్‌కు 71.33 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. బరువు కేవలం 99 కిలోల బరువు ఉండటం వల్ల రద్దీగా ఉండే నగరాల్లో దీనిని నడపడం చాలా సులభం. దీని డ్రమ్‌ వేరియంట్‌ రూ. 73, 430కాగా డిస్క్ వేరియెంట్‌ రూ. 79, 958 వరకు ఉంటుంది. మొరటైన్ లుక్‌ ఇష్టపడే వారి కోసం స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ రూ. 5, 974 వద్ద అందుబాటులో ఉంది.

యమహా ఫ్యాసినో 125 Fi హైబ్రిడ్‌  

రెట్రో డిజైన్ , మోడ్రన్ టెక్నాలజీ కలయికగా దీనిని అభివర్ణిస్తారు. వింటేజ్ లుక్‌, కర్వీ స్టైలింగ్‌ దీని ప్రధాన ఆకర్షణ. ఇందులో ఉన్న మైల్డ్‌ హైబ్రిడ్‌ అసిస్ట్‌ ఇంజిన్ సిటీ ట్రాఫిక్‌ ఓవర్‌టేకింగ్‌ సులభం చేయడానికి మెరుగైన మిడ్- రేంజ్ పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. మెటాలిక్ బ్లాక్ డ్రమ్‌ వేరియంట్‌ 74, 044 నుంచి ప్రారంభమవుతుంది. టీఎఫ్టీ కన్సోల్‌ ఉన్న స్పెషల్ ఎడిషన్లు రూ. 94, 254 వరకు పలుకుతున్నాయి. 

యమహా ఏరోక్స్‌ 155

ఇది స్కూటర్ రూపంలో ఉన్న బైక్ అని చెప్పవచ్చు. ఇందులో యమహా తన ప్రసిద్ధ R15 బైకులో వాడే 15cc లిక్విడ్- కూల్డ్ ఇంజిన్ అమర్చింది. ఇది కేవలం 6.26 సెకన్లలోనే 0-60కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దీని వర్షన్ ఎస్‌ మోడల్‌ కీ లెస్‌ ఎంట్రీ ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. 

ఎలక్ట్రిక్ వాహన రంగంలో అడుగులు 

పర్యావరణ మార్పుల వేళ యమహా తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ EC-06ని మార్కెట్‌లో ఉంచింది. దీని ధర రూ. 1, 6, 600 కాగా ఒకసారి ఛార్జ్ చేస్తే 169 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇది యమహా శ్రేణిలో అత్యంత ఖరీదైన స్కూటర్‌. 

భవిష్యత్‌లో రాబోతున్న కొత్త మోడళ్లు

యమహా తన పోర్ట్‌ పోలియోను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం 9 మోడళ్లు ప్రణాళికలో ఉండగా అందులో 5 మోడళ్లు త్వరలో విడుదల చేయనుంది. 

యమహా Nమ్యాక్‌ 155:- ఇది మాక్సీ స్కూటర్. డిసెంబర్‌ 2026నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. అంచనా ధర 1.40 లక్షలుగా చెబుతున్నారు. 

యమహా ఏరోక్స్‌-E:- ఏరోక్స్‌ ఎలక్ట్రిక్ వర్షన్ ఈ నెలలోనే విడుదల చేయనుంది. దీని అంచనా ధర 2.90లక్షలు. 

యమహా నియోస్‌:- రూ. 2.50 లక్షల అంచనా ధరతో రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. 

యమహా ఫిలానో, మరో ఎలక్ట్రిక్ స్కూట్‌ను వచ్చే ఫిబ్రవరి నాటికి విడుదల చేయనున్నారు. 

Frequently Asked Questions

2026లో యమహా స్కూటర్ల ధరలు ఎలా ఉంటాయి?

ప్రస్తుతం యమహా స్కూటర్ల ధరలు రూ. 74,300 నుండి రూ. 1,67,600 వరకు ఉన్నాయి. భవిష్యత్తులో రాబోయే మోడళ్ల ధరలు కూడా ఈ పరిధిలోనే ఉండే అవకాశం ఉంది.

యమహా రేజెడ్‌ఆర్‌ 125 Fi హైబ్రిడ్‌ మైలేజ్ ఎంత?

యమహా రేజెడ్‌ఆర్‌ 125 Fi హైబ్రిడ్‌ లీటర్‌కు 71.33 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది చాలా పొదుపైన స్కూటర్లలో ఒకటి.

యమహా ఫ్యాసినో 125 Fi హైబ్రిడ్‌ ప్రత్యేకత ఏమిటి?

యమహా ఫ్యాసినో 125 Fi హైబ్రిడ్‌ రెట్రో డిజైన్, ఆధునిక సాంకేతికత కలయికతో వస్తుంది. దీని మైల్డ్ హైబ్రిడ్ అసిస్ట్ ఇంజిన్ సిటీ ట్రాఫిక్‌లో మెరుగైన పనితీరును అందిస్తుంది.

యమహా నుండి భవిష్యత్తులో రాబోయే కొత్త స్కూటర్ మోడళ్లు ఏమిటి?

యమహా Nమ్యాక్‌ 155, ఏరోక్స్‌-E, నియోస్‌ వంటి కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
WagonR కొనుగోలుపై రూ. 64,600 డిస్కౌంట్ ఇస్తున్న మారుతి కంపెనీ.. ఆఫర్ పూర్తి వివరాలు
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
Toyota Glanza కొనేవాళ్లకు బోలెడన్ని EMI ఆఫర్లు.. రూ.1.60 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే చాలు!
Toyota Glanza కొనడం ఇప్పుడు చాలా సులభం, నెలకు రూ.10,000 కూడా అవసరం లేదు!

వీడియోలు

USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
పితృపక్షంలో ఇందిరా ఏకాదశి: పూర్వీకులకు మోక్షం ప్రసాదించే ఇందిరా ఏకాదశి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథ ఇది!
పితృపక్షంలో ఇందిరా ఏకాదశి: పూర్వీకులకు మోక్షం ప్రసాదించే ఇందిరా ఏకాదశి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథ ఇది!
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Embed widget