అన్వేషించండి

Maruti Baleno Safety Rating: మారుతి బాలెనోకు రెండు సేఫ్టీ రేటింగ్స్‌ ఎందుకిచ్చారు, ఈ కారు సురక్షితమేనా?

Maruti Baleno NCAP Crash Test: మారుతి బాలెనో 'భారత్ NCAP'లో రెండు వేర్వేరు సేఫ్టీ రేటింగ్స్‌ ఎందుకు పొందింది? ఈ కారు పూర్తిగా సురక్షితమేనా? పూర్తిగా అర్థం చేసుకుందాం.

Maruti Baleno Bharat NCAP Safety Rating: మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న & ఎక్కువ మంది ఇష్టపడుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ల్లో మారుతి బాలెనో ఒకటి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.67 లక్షల యూనిట్ల మారుతి బాలెనో కార్లు అమ్ముడయ్యాయి. ఇటీవల, 'భారత్ ఎన్‌క్యాప్‌' (Bharat NCAP) కింద క్రాష్ టెస్ట్‌లో మారుతి బాలెనోను పరీక్షించినప్పుడు ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఒకే కారుకు రెండు వేర్వేరు భద్రత రేటింగ్స్‌ లభించాయి - ఒకటి 4-స్టార్, మరొకటి 5-స్టార్.

ఒకే కారుకు రెండు రేటింగ్స్‌ ఎందుకు? 
వేర్వేరు వేరియంట్లను పరీక్షించినందున మారుతి బాలెనోకు భారత్ NCAPలో రెండు వేర్వేరు సేఫ్టీ రేటింగ్స్‌ లభించాయి. మారుతి బాలెనో సిగ్మా & డెల్టా వంటి బేస్ వేరియంట్స్‌లో కేవలం రెండు ఎయిర్‌ బ్యాగ్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ కారణంగా వాటికి 4-స్టార్ రేటింగ్ లభించింది. మారుతి బాలెనో జీటా & ఆల్ఫా వంటి టాప్ వేరియంట్స్‌లో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు (డ్యూయల్ ఫ్రంట్, సైడ్ & కర్టెన్) అందించారు. ఈ కారణంగా వాటికి 5-స్టార్ రేటింగ్ లభించింది.

NCAP పరీక్షకు మూడు ప్రధాన ప్రమాణాలు
భారత్ NCAP క్రాష్ టెస్టింగ్ మూడు ప్రధాన పారామితులపై (Parameters) ఆధారపడి ఉంటుంది - ఒకటి.. AOP (వయోజన ప్రయాణీకుల రక్షణ), రెండోది.. COP (పిల్లల రక్షణ) & మూడోది.. ESC, సీట్ బెల్ట్ రిమైండర్ & స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి భద్రతా సహాయ సాంకేతికతలు.

పరీక్షలో ఏ ఇంపాక్ట్స్‌ను చేర్చారు?
ఈ పరీక్షలో మూడు రకాల ఇంపాక్ట్స్‌ ఉన్నాయి - గంటకు 64 కి.మీ. వేగం వద్ద ఫ్రంటల్ ఆఫ్‌సెట్ క్రాష్, గంటకు 50 కి.మీ. వేగం వద్ద సైడ్ ఇంపాక్ట్ & గంటకు 29 కి.మీ వేగం వద్ద సైడ్ పోల్ ఇంపాక్ట్. మారుతి బాలెనో టాప్‌ వేరియంట్లయిన జీటా & ఆల్ఫాలో సైడ్ & కర్టెన్ ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండటం వలన సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో నష్టాన్ని సమర్థవంతంగా అడ్డుకుని బాగా పని చేశాయి.

ఈ రేటింగ్స్‌ను ఎలా అర్ధం చేసుకోవాలి?
ఈ రేటింగ్స్‌ అర్థం... మీరు తక్కువ ధరను చూసి బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే, మీకు తక్కువ ఎయిర్‌ బ్యాగులు & తక్కువ భద్రత స్థాయి లభిస్తుంది. రేటు కాస్త ఎక్కువైనా జీటా లేదా ఆల్ఫా వంటి టాప్ వేరియంట్‌ కొనుగోలు చేస్తే, ఆరు ఎయిర్‌ బ్యాగులు & అధిక భద్రత స్థాయి లభిస్తుంది.

మారుతి బాలెనో సేఫ్టీ ఫీచర్లు
ESC, పాదచారుల భద్రతా వ్యవస్థ (Pedestrian safety system), సీట్ బెల్ట్ రిమైండర్, ABS+EBD & స్పీడ్ అలర్ట్ వంటి భద్రత లక్షణాలు అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా ఉంటాయి, ఇవి బేస్ మోడల్‌ను కూడా సురక్షితమైన కారుగా మార్చాయి. కాబట్టి, కారు కొనుగోలు చేసేటప్పుడు మోడల్‌ను మాత్రమే కాకుండా వేరియంట్ & దానిలో అందించిన సేఫ్టీ ఫీచర్లను కూడా తెలుసుకోండి.

టాప్ హెడ్ లైన్స్

కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Ducati Monster V2 vs Triumph Street Triple 765 RS - 111hp vs 130hp.. ధర, పవర్, టార్క్‌లో ఏది బెస్ట్?
ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ 765 RS vs డుకాటి మాన్‌స్టర్‌ V2 - రేటు రూ.1 లక్ష తక్కువైనా 'పవర్‌'లో అదరగొడుతోంది!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget