అన్వేషించండి

రూ.13.50 లక్షల నుంచి Kia Syros EV - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు? కొనాలంటే ఏది బెస్ట్‌?

Kia Syros EV మొత్తం 7 వేరియంట్లలో అందుబాటులో ఉంది. 42kWh & 51.4kWh బ్యాటరీ ఎంపికలు, ఫీచర్లు, ధరలు, రంగులు, భద్రతా సదుపాయాలు & ఏ వేరియంట్‌ కొనడం ఉత్తమమో తెలుసుకోండి.

Kia Syros EV Variants Explained In Telugu: భారత ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్‌లోకి, Kia తన రెండో మాస్‌-మార్కెట్‌ EV అయిన Syros EVని విడుదల చేసింది. ఈ కంపెనీకి సంబంధించి, ఇప్పటివరకు అత్యంత అందుబాటు ధరలో ఉన్న ఎలక్ట్రిక్‌ మోడల్‌గా నిలిచిన ఈ SUV... Tata Nexon EV & Mahindra XUV 3XO EVలకు గట్టి పోటీ ఇవ్వనుంది. మొత్తం ఐదు ట్రిమ్‌లలో ఏడు వేరియంట్లుగా అందుబాటులోకి వచ్చిన Syros EVలో రెండు బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. అయితే ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయి? ఏది కొనడం ఉత్తమం? ఇప్పుడు తెలుసుకుందాం.

ధరలు
Kia Syros EV ధరలు రూ.13.50 లక్షల నుంచి ప్రారంభమై రూ.20 లక్షల వరకు ఉన్నాయి. 42kWh & 51.4kWh బ్యాటరీ ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. అంతేకాదు, Battery-as-a-Service (BaaS) పథకం కింద కేవలం రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ పథకంలో ప్రతి కిలోమీటర్‌కు రూ.3.30 బ్యాటరీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాటరీ ఎంపికలు
42kWh బ్యాటరీ వేరియంట్‌ 135 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తే, 51.4kWh బ్యాటరీతో వచ్చే మోడల్‌ 171 హెచ్‌పీ శక్తిని అందిస్తుంది. రెండు వేరియంట్లలోనూ 255 ఎన్ఎం టార్క్‌ ఒకేలా ఉంటుంది. చిన్న బ్యాటరీతో 443 కిలోమీటర్ల ARAI రేంజ్‌ లభిస్తుండగా, పెద్ద బ్యాటరీతో ఏకంగా 526 కిలోమీటర్ల రేంజ్‌ను కంపెనీ ప్రకటించింది. 100kW DC ఫాస్ట్‌ ఛార్జర్‌తో రెండు బ్యాటరీలు కూడా 10 నుంచి 80 శాతం వరకు కేవలం 39 నిమిషాల్లోనే ఛార్జ్‌ అవుతాయని Kia చెబుతోంది.

ఇది కూడా చదవండి: సరికొత్త CB500ని ఆవిష్కరించిన హోండా - లోకల్‌గా తయారీ, మూడు వేరియంట్లలో అందుబాటులోకి!

రంగులు 
Syros EV మొత్తం తొమ్మిది మోనోటోన్‌ ఎక్స్‌టీరియర్‌ కలర్‌ ఎంపికల్లో లభిస్తుంది, అవి: Ivory Silver Matte, Frost Blue, Gravity Grey, Pewter Olive, Magma Red, Ivory Silver Gloss, Aurora Black Pearl, Glacier White Pearl & Xclusive Matte Graphite రంగులు అందుబాటులో ఉన్నాయి. టాప్‌ X-Line వేరియంట్‌కు మాత్రం Aurora Black Pearl & Xclusive Matte Graphite మాత్రమే లభిస్తాయి. ఇంటీరియర్‌లో మూడు రకాల సీటు అప్హోల్స్టరీ ఎంపికలను ట్రిమ్‌ను బట్టి అందించారు.

భద్రత 
అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, బ్రేక్‌ అసిస్ట్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌-స్టార్ట్‌ అసిస్ట్‌, TPMS, నాలుగు చక్రాలకు డిస్క్‌ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ విత్‌ ఆటో హోల్డ్‌, ఫాలో-మీ-హోమ్‌ హెడ్‌ల్యాంప్స్‌, వర్చువల్‌ ఇంజిన్‌ సౌండ్‌ సిస్టమ్‌, Isofix చైల్డ్‌ సీటు యాంకర్లు, రియర్‌ ఆక్యుపెంట్‌ అలర్ట్‌ వంటి భద్రతా ఫీచర్లను Kia స్టాండర్డ్‌గా అందించింది.

ఎంట్రీ లెవల్‌ HTK వేరియంట్‌ ధర రూ.13.50 లక్షలు. ఇందులో LED లైట్లు, 16 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, 12.3 అంగుళాల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ Android Auto & Apple CarPlay, నాలుగు స్పీకర్లు, డ్రైవ్‌ మోడ్స్‌, రియర్‌ AC వెంట్స్‌, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

HTK+ వేరియంట్‌ ధర రూ.14 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో.. HTK వేరియంట్‌ ఫీచర్లతో పాటు రియర్‌వ్యూ కెమెరా, క్రూయిజ్‌ కంట్రోల్‌, 100W Type-C ఛార్జింగ్‌ పోర్ట్‌ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. Extended Range వేరియంట్‌లో 17 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ కూడా లభిస్తాయి.

ఇది కూడా చదవండి: 2026 Maruti Brezza మైలేజ్‌ నంబర్లు ఇవిగో - పెట్రోల్‌, టర్బో, CNG వేరియంట్ల పూర్తి వివరాలు

HTX వేరియంట్‌ రూ.16 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ వేరియంట్‌లో పనోరమిక్‌ సన్‌రూఫ్‌, స్లైడింగ్‌ & రిక్లైనింగ్‌ రియర్‌ సీట్లు, 60:40 స్ప్లిట్‌ ఫోల్డింగ్‌ రియర్‌ సీట్లు, రియర్‌ ఆర్మ్‌రెస్ట్‌, రియర్‌ వైపర్‌, రియర్‌ డిఫాగర్‌, కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ, OTA సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ వంటి ఫీచర్లు అదనంగా ఉన్నాయి. కుటుంబ అవసరాలకు ఇవి చాలా ఉపయోగపడతాయి.

HTX+ వేరియంట్‌లో 51.4kWh బ్యాటరీ మాత్రమే లభిస్తుంది. ఇందులో.. పైన చెప్పిన అన్ని ఫీచర్లతో పాటు వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ & రియర్‌ సీట్లు, Harman Kardon 8-స్పీకర్‌ ఆడియో సిస్టమ్‌, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌, ఆన్‌బోర్డ్‌ నావిగేషన్‌, బ్యాటరీ హీటింగ్‌ సిస్టమ్‌, డ్యూయల్‌ డ్యాష్‌క్యామ్‌లు, పవర్డ్‌ డ్రైవర్‌ సీటు వంటి ప్రీమియం ఫీచర్లు వస్తాయి.

టాప్‌ X-Line వేరియంట్‌ ధర రూ.20 లక్షలు. ఇందులో.. HTX+ లో ఉన్న ఫీచర్లకు అదనంగా Level 2 ADAS, Vehicle-to-Load (V2L), డిజిటల్‌ కీ, 64-కలర్‌ అంబియెంట్‌ లైటింగ్‌, ప్రత్యేక ఇంటీరియర్‌ థీమ్‌, లోగో ప్రొజెక్షన్‌తో కూడిన పడ్డిల్‌ ల్యాంప్స్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి.

అయితే ఎక్కువ మంది కొనుగోలుదారులకు HTX వేరియంట్‌ ఉత్తమ ఎంపికగా కనిపిస్తోంది. ఈ వేరియంట్‌లో 51.4kWh పెద్ద బ్యాటరీ ఎంపికతో పాటు 526 కిలోమీటర్ల రేంజ్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, స్లైడింగ్‌ రియర్‌ సీట్లు, 60:40 స్ప్లిట్‌ సీట్లు, రియర్‌ ఆర్మ్‌రెస్ట్‌, కనెక్టెడ్‌ కార్‌ ఫీచర్లు వంటి రోజువారీ వినియోగానికి ఉపయోగపడే అనేక సౌకర్యాలు లభిస్తున్నాయి. HTX+ & X-Line వేరియంట్లలో మరిన్ని ప్రీమియం ఫీచర్లు ఉన్నప్పటికీ, వాటి కోసం చెల్లించాల్సిన అదనపు ధరతో పోలిస్తే HTX వేరియంట్‌ డబ్బుకు అత్యుత్తమ విలువను అందించే ఎంపికగా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

హైదరాబాద్‌ లేదా విజయవాడ... Kawasaki Versys X 300ని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్లొచ్చు, ఈజీ EMI ప్లాన్‌ ఉందిగా!
Kawasaki Versys X 300: రూ.4 లక్షల బండిని కేవలం రూ.7,685 EMI తో సొంతం చేసుకునే ప్లాన్‌
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
ఒంటరిగా వెళ్లినా, జంటగా వెళ్లినా.. లాంగ్ రైడ్స్‌కు బెస్ట్.. రూ.2-5 లక్షల్లో 11 అడ్వెంచర్ టూరర్ బైక్స్
రూ.2-5 లక్షల బడ్జెట్‌లో బ్రహ్మాండమైన అడ్వెంచర్ టూరర్‌ బైక్స్.. ఇవిగో 11 ఆప్షన్లు
Tata Aerisలో ఏ వేరియంట్‌ మీ బడ్జెట్‌కు సరిపోతుంది? వేరియంట్ల వారీగా ఫీచర్లు, ధరల వివరాలు
Tata Aerisలో 5 వేరియంట్లు.. ఏ వేరియంట్‌లో స్మార్ట్‌ ఫీచర్లు ఉన్నాయి, ఏది కొనాలి?
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
Amaravati News: అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
Embed widget