అన్వేషించండి

Maruti Swift ​​vs Tata Punch:స్విఫ్ట్‌ స్పీడ్‌ vs పంచ్‌ పవర్‌లో ఏది బెటర్? ఏ కారు కొంటే మీ డబ్బుకు అసలైన విలువ?

Maruti Swift ​​vs Tata Punch:ధర పరంగా చూస్తే టాటా పంచ్ బేస్ వేరియంట్‌ను తక్కువ ధరకు ధర 5.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. స్విఫ్ట్‌ ధర 5.79 లక్షల నుంచి 9 లక్షల వరకు ధర కలిగి ఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి స్విఫ్ట్, టాటా పంచ్ ధరలు, ఫీచర్ల పోలిక.
  • స్విఫ్ట్ మెరుగైన మైలేజీ, తక్కువ నిర్వహణ ఖర్చు కలిగి ఉంది.
  • టాటా పంచ్ మెరుగైన భద్రత, SUV లుక్స్ అందిస్తుంది.
  • స్విఫ్ట్ దీర్ఘకాలిక యజమానిత్వంలో ఆర్థికంగా లాభదాయకం.

Maruti Swift ​​vs Tata Punch:భారతీయ ఆటోమొబైల్ రంగంలో బడ్జెట్‌ సెగ్మెంట్‌ ఎప్పుడూ ఒక వార్‌ జోన్‌లా ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి వాహనదారులను ఆకట్టుకోవడానికి కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతుంటాయి. అలాంటి పోటీలో వినియోగదారులు కొనే ముందు చాలా అంశాలను పరిగిలోకి తీసుకుంటారు. తమ ధరకు, తమ ఆలోచనలకు అనుగుణంగా ఉండే వాహనాల మధ్య పోలికలు సరి చూసుకుంటారు. ఇప్పుడు మధ్యతరగతి మార్కెట్‌ను శాసిస్తున్న రెండు కంపెనీలకు చెందిన మైక్రో ఎస్‌యూవీ విభాగంలో ఎస్‌యూవీ, టాటా పంచ్‌ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అయితే ఈ రెండు వాహనాల్లో ఏది కొనుక్కుంటే వినియోగదారులకు మేలు జరుగుతుంది. వారి డబ్బులు అసలైన విలువ లభిస్తుందో చూద్దాం. 

పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కారు కొనే వ్యక్తులు కేవలం కారు అవుట్‌ లుక్‌తోపాటు ఇతర ఫీచర్లు, లాంగ్‌ రన్‌లో నిర్వహణపై ఫోకస్ చేస్తున్నారు. రీసేల్ వాల్యూ గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

టాటా పంచ్‌, మారుతీ స్విఫ్ట్‌లలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఎవరు?

ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలిస్తే టాటా పంచ్ తన బేస్ వేరియంట్‌ను అత్యంత వ్యూహాత్మకంగా తక్కువ ధరకు అందిస్తోంది. దీని ధర 5.50 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ వేరియంట్‌ 10.55 లక్షల వరకు పలుకుతుంది. మైక్రో ఎస్‌యూవీగా దీనికి మార్కెట్‌లో గుర్తింపు ఉంది. హ్యాచ్‌బ్యాక్‌ కింగ్‌గా పేరున్న స్విఫ్ట్‌ ధర 5.79 లక్షల నుంచి 9 లక్షల వరకు ధర కలిగి ఉంది. 

హైదరాబాద్‌ ఆన్‌రోడ్‌ ధరలను గమనిస్తే పంచ్ బేస్ వేరింట్‌ స్విఫ్ట్‌ కంటే ఇరవై వేల నుంచి 30 వేల వరకు తక్కువ ధరకే లభిస్తోంది. అయితే టాప్‌ వేరియంట్లకు వెళ్లే కొద్దీ పంచ్‌ ధరలు స్విఫ్ట్ కంటే ఎక్కువ ఉంటున్నాయి. 

ఇంజిన్‌, పనితీరులో ఏది స్మూత్‌ ఏదీ పవర్‌ఫుల్?

రెండు కార్లు కూడా 1.2 లీటర్ల ఇంజిన్లతో వస్తున్నప్పటికీ, వాటి పనితీరులో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. టాటా పంచ్‌లో టర్బో ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 120 పీఎస్‌ శక్తిని, 170Nm టార్క్‌ను అందిస్తుంది. ఎస్‌యూవీ లుక్స్‌కు తగ్గట్టుగానే ఇందులో టార్క్‌ ఎక్కువ ఉంటుంది. మారుతి స్విఫ్ట్‌ కొత్త Z1E 3- సిలిండర్‌ ఇంజిన్ 82 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మారుతి ఇంజిన్లు తమ స్మూ్‌నెస్‌, రిఫైన్డ్‌ పికప్‌కు పేరున్న వాహనం. ముఖ్యంగా స్విఫ్ట్ తన స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ వేరియంట్‌తో 2026లో కొత్త సంచలనం సృష్టిస్తోంది. ఇది ఎలక్ట్రిక్‌ అసిస్ట్‌ ద్వారా సిటీ డ్రైవింగ్ సామర్థ్యాన్ని20-30 శాతం పెంచుతుంది. 

మైలేజీలో ఆధిపత్యం ఎవరిది?

మైలేజీ విషయంలో మారుతి స్విఫ్ట్ తన పవర్‌ను చూపిస్తోంది. స్విఫ్ట్ ఏకంగా 24.8kmpl క్లెయిమ్‌ చేస్తుండగా పంచ్‌ 20.9 kmpl అని ప్రకటిస్తోంది. హైదరాబాద్ వంటి నగరాల్లో వాస్తవ పరిస్థితుల్లో స్విఫ్ట్‌ 20-30kmpl ఇస్తుంటే, పంచ్‌ 15-18kmplకే పరిమితమవుతోంది.  సీఎన్జీ విషంలో పంచ్ కంటే స్విఫ్ట్ ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉంది. 

భద్రత కల్పిస్తున్న వాహనం ఏది?

భద్రత విషయంలో టాటా పంచ్ ముందంజలో ఉంది. పంచ్‌ జీఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధించింది. సిఫ్ట్‌ ఫోర్ స్టార్ రేటింగ్‌తో వస్తోంది. అయితే ఇందులో టాప్ వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాక్స్‌ ఇస్తున్నారు. 

టెక్ సావీ ఏదీ?

రెండు కార్లులోనూ 10.25 ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌ , ఆండ్రాయిడ్‌ ఆటో/ఆపిల్‌ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే పంచ్‌లో సన్‌రూఫ్‌, iRA కనెక్టివిటీ వంటి ఫీచర్లు అదనపు ఆకర్షణగా ఉన్నాయి. 

మెయింటెనెన్స్‌ ఖర్చు, రీసేల్‌ వాల్యూ

మారుతి విస్తృతమైన సర్వీస్‌ నెట్‌వర్క్ వల్ల స్విఫ్ట్‌ నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఈ కారు కోసం ఏడాదికి 2500 నుంచి 4000 వరకు ఖర్చు అవుతుంది. ఐదేళ్ల కాలంలో స్విఫ్ట్ నిర్వహణ కోసం 21000 వేల నుంచి 26000 వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 

రీసేల్‌ వాల్యూ విషయానికి వస్తే మారుతి బ్రాండ్ విలువ వల్ల స్విఫ్ట్ ఐదేళ్ల తర్వాత కూడా 6-70శాతం విలువను కలిగి ఉంటోంది. పంచ్ రీసేల్‌ విలువ సుమారు 50-60 శాతం మధ్యలో ఉంటోంది. 

ఐదేళ్ల ఓనర్‌షిప్ కాస్ట్ లెక్క ఏంటీ?

సంవత్సరానికి 15000 కిలోమీటర్లు ప్రయాణించే సగటు వాహనదారుడికి ఐదేళ్లలో అయ్యే నిక ఖర్చును విశ్లేషిస్తే... మారుతి స్విఫ్ట్‌ ఇంధన పొదుపు, తక్కువ మెయింటెనెన్స్, మెరుగైన రీసేల్ విలువ కారణంగా దీని నికర ఓనర్‌షిప్ ఖర్చు 4,76,700గా ఉంటుంది. టాటా పంచ్‌ 6,77,000 వరకు చేరుతుంది. అంటే ఐదేళ్ల కాలపరిమితిలో మారుతి స్విఫ్ట్‌ కొనుగోలు చేసిన వ్యక్తికి దాదాపు 2,00,300 వరకు ఆదా చేయగలదు. 

ఎవరికి ఏ కారు బెస్ట్‌?

స్విఫ్ట్‌ మెరుగైన మైలేజీ, సులభమైన పార్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సిటీ డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌, టర్బో పవర్ కలిగి ఉన్న పంచ్‌ వాహనం హైవే ప్రయాణాలకు సరిగా సరిపోతుంది. ఇందులో ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. 

Frequently Asked Questions

మారుతి స్విఫ్ట్ vs టాటా పంచ్: ధరల తేడా ఏమిటి?

టాటా పంచ్ బేస్ వేరియంట్ స్విఫ్ట్ కంటే తక్కువ ధరకు లభిస్తుంది. అయితే, టాప్ వేరియంట్లలో పంచ్ ధర స్విఫ్ట్ కంటే ఎక్కువగా ఉంటుంది.

ఇంజిన్ పనితీరులో ఏది మెరుగైనది?

స్విఫ్ట్ తన స్మూత్నెస్ మరియు రిఫైన్డ్ పికప్కు ప్రసిద్ధి చెందింది. పంచ్ టర్బో ఆప్షన్తో వస్తుంది, ఇది ఎక్కువ టార్క్ను అందిస్తుంది.

మైలేజీ విషయంలో ఏ కారు ముందంజలో ఉంది?

మైలేజీ విషయంలో మారుతి స్విఫ్ట్ మెరుగ్గా ఉంది, ఇది 24.8kmpl క్లెయిమ్ చేస్తుంది. పంచ్ 20.9 kmpl క్లెయిమ్ చేస్తుంది.

భద్రత పరంగా ఏది ఉత్తమమైనది?

టాటా పంచ్ GNCAP క్రాష్ టెస్టులో ఫైవ్-స్టార్ రేటింగ్ సాధించి, భద్రతలో ముందంజలో ఉంది. స్విఫ్ట్ ఫోర్-స్టార్ రేటింగ్తో వస్తుంది.

ఐదేళ్ల యజమాన్య ఖర్చులో ఏది తక్కువ?

మారుతి స్విఫ్ట్ ఇంధన పొదుపు, తక్కువ నిర్వహణ ఖర్చు మరియు మెరుగైన రీసేల్ విలువ కారణంగా ఐదేళ్లలో తక్కువ యజమాన్య ఖర్చును అందిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

LFP vs NMC Batteries: ఎలక్ట్రిక్‌ కారు బ్యాటరీ విషయంలో ఈ తప్పు చేయకండి! 100% ఛార్జింగ్ దేనికి అవసరం? దేనిని 80% దగ్గర ఆపాలి?
ఎలక్ట్రిక్ కారులో LFP లేదా NMC బ్యాటరీల్లో ఏది బెస్ట్? తెలుగు రాష్ట్రాల వాతావరణానికి ఏది సరిపోతుంది?
Car Insurance: కారు ఇన్సూరెన్స్‌లో ఏ యాడ్‌-ఆన్‌ ఎంచుకోవాలి? ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌ పూర్తి వివరాలు
ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌: కార్ ఇన్సూరెన్స్‌లో ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?
పెద్ద ఫ్యామిలీల కోసం 6 సీటర్, 7 సీటర్ SUVలు.. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ ఆప్షన్లు కూడా!
ఫ్యామిలీతో పిక్నిక్‌కు వెళ్లడానికి బెస్ట్ SUVలు.. రూ.8.57 లక్షల నుంచే 7 సీటర్ కార్లు!
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KA Paul on Revanth Reddy: నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Nara Lokesh And Upasana: నారా లోకేష్ రాక్‌‌స్టార్ మంత్రి.. నేను రిచ్ అయినప్పటికీ పేదల కష్టాలు తెలుసు: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
నారా లోకేష్ రాక్‌‌స్టార్ మంత్రి.. నేను రిచ్ అయినప్పటికీ పేదల కష్టాలు తెలుసు: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Embed widget