అన్వేషించండి

Tata Sierra EV vs Petrol-Diesel:టాటా సియారా EV, పెట్రోల్-డీజిల్ మధ్య తేడా ఏంటీ? కొనుగోలు చేసే ముందు వ్యత్యాసం తెలుసుకోండి!

Tata Sierra EV vs Petrol-Diesel: మీరు టాటా సియారా ఈవీ కొనాలా లేక పెట్రోల్-డీజిల్ మోడల్ కొనాలా? కొనుగోలు చేసే ముందు, ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను తెలుసుకోండి.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా సియెరా EV, పెట్రోల్/డీజిల్ ప్లాట్‌ఫారమ్‌లు విభిన్నంగా ఉంటాయి.
  • EV డ్యూయల్ మోటార్, అధునాతన డిజైన్‌తో అధిక టార్క్.
  • EVలో ట్రిపుల్ స్క్రీన్, V2L వంటి అత్యాధునిక ఫీచర్లు.
  • సుదూర ప్రయాణాలకు పెట్రోల్/డీజిల్ ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయి.

Tata Sierra EV vs Petrol-Diesel: గత కొన్నేళ్లుగా భారత్‌లో ఎస్‌యూవీల క్రేజ్ పెరిగింది. దీని ఫలితంగా, ఆటోమొబైల్ కంపెనీలు మరింత అధునాతనమైన ఎస్‌యూవీలను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. ఇటీవల, టాటా మోటార్స్ ఒక శక్తివంతమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఎలక్ట్రిక్ సియారా జూన్ 30న భారత ఆటో పరిశ్రమలో ప్రారంభమైంది. అప్పటి నుంచి, ఎలక్ట్రిక్ సియారా తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. 

అయితే, మీరు టాటా సియారా కొనాలని ఆలోచిస్తుంటే, ఏ వేరియంట్‌ను పరిగణనలోకి తీసుకోవాలో ఈరోజు మనం చర్చిద్దాం. సియారా పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. కాబట్టి, మీకు ఏ వేరియంట్ సరైనదో సులభంగా అర్థం చేసుకుందాం.

డిజైన్‌లో చాలా తేడా ఉంది 

టాటా సియారా EVకి, దాని పెట్రోల్, డీజిల్ వేరియంట్లకు మధ్య ఉన్న అతిపెద్ద సాంకేతిక వ్యత్యాసం, అవి నిర్మించిన ప్లాట్‌ఫారమ్. టాటా సియారా EV, కంపెనీ సరికొత్త, అధునాతన జనరేషన్ 2 యాక్టి.ఈవి (acti.ev) మోడల్‌పై ఆధారపడి ఉంది. దీనిని ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. 

సియారా పెట్రోల్, డీజిల్ మోడల్‌లు, కంబషన్ ఇంజిన్‌ల కోసం రూపొందింంచిన కంపెనీ ఆల్ఫా లేదా ఒమేగా మోడల్‌లపై ఆధారపడి ఉన్నప్పటికీ, వాటి విభిన్న ప్లాట్‌ఫారమ్‌ల కారణంగా ఈ రెండు వాహనాలు రైడ్ క్వాలిటీ, బ్యాలెన్స్, క్యాబిన్ స్పేస్ విషయంలో చాలా విభిన్నంగా ఉంటాయి.

మీరు సాహసాలను లేదా పర్వత ప్రాంతాలలో డ్రైవింగ్‌ను ఇష్టపడితే, సియారా ఎలక్ట్రిక్ ఉత్తమ ఎంపిక అవుతుంది. టాప్-ఎండ్ సియారా EV వేరియంట్ డ్యూయల్ మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ సెటప్‌తో వస్తుంది, ఇది ఏకంగా 504Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కఠినమైన భూభాగాలపై కూడా అద్భుతమైన పట్టును అందిస్తుంది. 

మరోవైపు, పెట్రోల్ ,డీజిల్ మోడళ్లు ఫ్రంట్-వీల్ డ్రైవ్‌తో వస్తాయి, దీనిలో ఇంజిన్ శక్తి కేవలం ముందు చక్రాలకు మాత్రమే పంపుతుంది. పెట్రోల్ 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్, డీజిల్ 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ నగరం, హైవే డ్రైవింగ్ కోసం మార్పులు చేసినా అవి ఒక EV అంతటి శక్తిని అందించవు.

డిజైన్‌లో మార్పులు 

ఎలక్ట్రిక్  సియారా విడుదలైన తర్వాత, రెండు వాహనాలు ఒకే విధమైన దృఢమైన, భవిష్యత్ తరహా డిజైన్‌ కలిగి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అయితే, నిశితంగా పరిశీలిస్తే తేడాలు స్పష్టమవుతాయి. సియారా EV ముందు భాగంలో క్లోజ్డ్‌ గ్రిల్, సొగసైన, అనుసంధానించిన LED లైట్ బార్ ఉన్నాయి, ఇవి దానికి చాలా ఆధునిక రూపాన్ని ఇస్తున్నాయి. 

మరోవైపు, పెట్రోల్ -డీజిల్ మోడళ్లలో ఇంజిన్‌ను చల్లగా ఉంచడానికి సాంప్రదాయ ఫ్రంట్ ఎయిర్ వెంట్,  గ్రిల్ ఉంటాయి. అంతేకాకుండా, రెండు మోడళ్లలోని అల్లాయ్ వీల్స్ డిజైన్‌లో పూర్తిగా భిన్నంగా ఉంటాయి,  EV వేరియంట్‌లో అంతటా ప్రత్యేకమైన EV బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది.

క్యాబిన్ లోపల హై-టెక్ ఫీచర్లు

మీరు టాటా సియారా లోపలికి అడుగుపెట్టిన వెంటనే, ఫీచర్లలో చాలా తేడాను గమనిస్తారు. సియారా EVలో ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, కారు నుంచి గృహోపకరణాలను ఆపరేట్ చేయడానికి వీలు కల్పించే V2L టెక్నాలజీ, అధునాతన 540-డిగ్రీల కెమెరా ఉన్నాయి. దీనికి ముందు వైపు సామాను నిల్వ చేయడానికి ఫ్రంక్ కూడా ఉంది. 

పెట్రోల్ -డీజిల్ మోడళ్లలో కూడా పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్ల వంటి అన్ని విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన ప్రీమియం ఇంటీరియర్ ఉంటుంది. అయితే, EVలలో కనిపించే కొన్ని అత్యంత అధునాతన టెక్ ఫీచర్లు వీటిలో లేవు. అయినప్పటికీ, ఛార్జింగ్ ఇబ్బంది లేకుండా సుదూర ప్రయాణం విషయానికి వస్తే, పెట్రోల్ -డీజిల్ వాహనాలే ఇప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాల కంటే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.

Frequently Asked Questions

టాటా సియారా EV, పెట్రోల్-డీజిల్ వెర్షన్‌ల మధ్య ప్రధాన సాంకేతిక వ్యత్యాసం ఏమిటి?

సియారా EV, acti.ev ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. పెట్రోల్-డీజిల్ మోడల్‌లు కంబషన్ ఇంజిన్‌ల కోసం రూపొందించిన ఆల్ఫా లేదా ఒమేగా ప్లాట్‌ఫారమ్‌లపై ఉంటాయి. ఇది రైడ్ క్వాలిటీ, బ్యాలెన్స్, క్యాబిన్ స్పేస్‌లో వ్యత్యాసాలకు దారితీస్తుంది.

సాహసపూరిత డ్రైవింగ్ లేదా పర్వత ప్రాంతాలకు సియారాలో ఏ వేరియంట్ ఉత్తమం?

సియారా EV, డ్యూయల్ మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ సెటప్‌తో 504Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కఠినమైన భూభాగాలపై అద్భుతమైన పట్టును అందిస్తుంది కాబట్టి EV ఉత్తమ ఎంపిక. పెట్రోల్-డీజిల్ మోడల్‌లు ఫ్రంట్-వీల్ డ్రైవ్‌తో వస్తాయి.

సియారా EV అంతర్గత భాగంలో ఏ అధునాతన ఫీచర్లు ప్రత్యేకంగా ఉన్నాయి?

సియారా EV ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, V2L టెక్నాలజీ, 540-డిగ్రీల కెమెరాను కలిగి ఉంది. దీనికి ముందు భాగంలో సామాను నిల్వ చేయడానికి ఫ్రంక్ కూడా ఉంటుంది. పెట్రోల్-డీజిల్ మోడల్‌లలో ఈ టెక్ ఫీచర్లు లేవు.

టాప్ హెడ్ లైన్స్

Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
Scorpio N, Tata Safari, XUV 7XO.. ఈ మూడు SUVల్లో మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్? ధర, పవర్, ఫీచర్ల పూర్తి పోలిక!
Scorpio N వర్సెస్‌ Tata Safari వర్సెస్‌ XUV 7XO.. ఈ మూడు SUVల్లో మీకు ఏది బెస్ట్?
Hero Vida Electric Bike: హీరో విడా తొలి ఎలక్ట్రిక్ బైక్... ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన UBX 06
Hero Vida UBX 06 ఎలక్ట్రిక్ బైక్ టెస్టింగ్.. TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త మోడల్!
Rodent Attacks: కారు వైర్లను ఎలుకలు కొరికేస్తున్నాయా? రూ.వేల రిపేర్‌ ఖర్చు తప్పించుకోవాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి!
కారు ఇంజిన్‌లోకి ఎలుకలు వెళ్తున్నాయా? స్ప్రే నుంచి స్టీల్ మెష్ వరకు.. రక్షణకు 5 మార్గాలు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Akvan Cyclone: ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
DNK Collections : మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
Bhimavaram Municipal Elections: భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
India Myanmar Naval Exercise: విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
Embed widget